Thursday, 23 July 2015

కార్మికలకు మద్దతుగా కలెక్టరేట్ల ముట్టడి.......

మున్సిపల్ కార్మికల సమ్మెకు మద్దతుగా శుక్రవారం కలెక్టరేట్ల ముట్టడికి సిపిఎం రాష్ట్ర కార్యదర్శి మధు పిలుపునిచ్చారు. సమ్మెను అణచివేయాలని రాష్ట్ర కాబినెట్ తీసుకున్న నిర్ణయం దారుణమని అన్నారు. రాష్ట్ర మంత్రే ఈ ప్రకటన చేయడం సిగ్గుచేటన్నారు.ప్రభుత్వం కార్మికుల సమ్మెను పరిష్కరించకుండా రాజకీయం చేస్తే ఇది ఒక్క కార్మికుల సమస్య గానే కాక రాజకీయ సవాల్ గా కూడా స్వికరించాల్సివస్తుందన్నారు. సమస్య పరిష్కారం కాకుంటే నెల రోజులైనా ఆందోళనలకు సిద్ధమన్నారు. ప్రభుత్వ బెదిరింపులకు భయపడేది లేదన్నారు.ప్రభుత్వం వెంటనే కార్మిక జెఎసి తో చర్చలు జరిపి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేసారు ..

No comments:

Post a Comment