విజయవాడ లో మున్సిపల్ కార్మికులు సమ్మెను మరింత ఉధృతం చేశారు. సింగినగర్ లోని నగరపాలక సంస్ధ డిప్యూటీ మేయర్ గోగుల రమణ ఇంటిని ముట్టడించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. మున్సిపల్ కార్మికుల ఆందోళన తీవ్రతరం చేయడంతో ఇంటి నుంచి బయటకొచ్చిన డిప్యూటీ మేయర్ సిఐటియు నాయకులతో మాట్లాడారు. మున్సిపల్ కార్మికులు చేస్తున్న సమ్మె సరైందేనని, త్వరలోనే మంత్రి నారాయణ దృష్టికి తీసుకెళ్ళి సమస్య పరిష్కారం అయ్యేలా చూస్తానని హామీ ఇచ్చారు. మరోవైపు పేదల ఓట్ల తో గద్దెనెక్కిన టిడిపి ప్రభుత్వం వాళ్ల పొట్టలే కొట్టాలని సీపీఎం నేతలు విమర్శించారు. రాజధాని పేరుతో పేదల భూములను లాక్కొని చైనాకు కట్టబెడుతున్న ప్రభుత్వం మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని, లేకుంటే పెద్ద ఎత్తున ఉద్యమ బాట పట్టి రాష్ట్రాన్ని స్తంభింపచేస్తామని హెచ్చరించారు.
No comments:
Post a Comment