గత ప్రభుత్వ విధానాలే...
సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు నరసింగరావు మాట్లాడుతూ 13 నెలల కాలంలో గత ప్రభుత్వాలు అవలంబించిన విధానాలనే నేటి ప్రభుత్వాలు పటిష్టంగా అమలు చేస్తున్నాయని విమర్శించారు. దేశంలోని భూములను, గనులను కార్పొరేట్లకు అప్పగిస్తున్నారని దుయ్యబట్టారు. రూ.4809 కోట్లకు చెందిన ప్రభుత్వరంగ ఆస్తులను కార్పొరేట్లకు అమ్ముతున్నారని పేర్కొన్నారు. కార్పొరేట్ల కోసమే ప్లానింగ్ కమిషన్‌ను రద్దు చేశారని విమర్శించారు. చంద్రబాబు కార్మికవర్గాన్ని అణిచివేస్తేనే తన పని చేసుకోవచ్చనే ఆలోచనలో ఉన్నారని చెప్పారు. కేంద్రంలో ఎమర్జెన్సీ రోజులను అద్వానీ ప్రకటించారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్ధం చేసుకోవాలని సూచించారు. నిర్బంధం ద్వారా అధికారాన్ని వెలగబెట్టాలంటే కుదరదన్నారు. చంద్రబాబు అభివృద్దిని రాజధాని చుట్టూ తిపుతున్నారని, వెనుకబడిన ప్రకాశం జిల్లా అభివృద్ధి గురించి ఎలాంటి చర్యలూ తీసుకోవడం లేదని విమర్శించారు. వెలుగొండ, గుండ్లకమ్మ ప్రాజెక్ట్‌లను పూర్తి చేయాలన్నారు. కాళహస్తి, నడికుడి రైల్వేలైన్ నిర్మాణం చేపట్టాలన్నారు. ఇవన్నీ జరిగితేనే ప్రకాశం జిల్లా అభివృద్ధి జరుగుతుందన్నారు. ఉద్యోగుల, కార్మికుల సమస్యలపై సెప్టెంబర్ రెండున సమ్మె శంఖారావం పూరించాలన్నారు.
No comments:
Post a Comment