- కార్మికుల, ఉద్యోగుల పాలిట శాపాలు
- ఆ విధానాలను ఐక్యంగా తిప్పికొట్టాలి - శాసనమండలి సభ్యులు, పిడిఎఫ్ ఫ్లోర్ లీడర్ విఠపు బాలసుబ్రమణ్యం
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబి స్తున్న విధానాలు ఉద్యోగుల, కార్మికుల పాలిట శాపాలుగా మారుతున్నాయని శానసమండలి పిడిఎఫ్ ప్లోర్ లీడర్ విఠపు బాలసుబ్రమణ్యం పేర్కొన్నారు. సిఐటియు రాష్ట్ర కౌన్సిల్ సమావేశాల సందర్భంగా శనివారం సివిఎన్ రీడింగ్‌రూమ్ ఆవరణలో 'కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఏడాది పాలన-ఉద్యోగ, కార్మికులపై ప్రభావం' అంశంపై సెమినార్ జరిగింది. సిఐటియు నగర అధ్యక్షులు దామా శ్రీనివాసులు అధ్యక్షతన జరిగిన సెమినార్‌లో బాలసుబ్రమణ్యం ముఖ్యఅతిథిగా మాట్లాడారు. అవినీతి లేని రాజ్యం తీసుకొస్తామని మోడీ, జాబు కావాలంటే బాబు రావాలంటూ ఎన్నికల్లో ఊదరగొట్టారన్నారు. మోడీ, చంద్రబాబు మాటలు నమ్మిన ప్రజలు ఓట్లేసి అధికారాన్ని కట్టబెట్టారన్నారు. అధికారంలోకి వచ్చిన ఏడాది పాలనలో ప్రజలకు, కార్మికులకు కష్టాలు ఎదురయ్యాయన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రభుత్వరంగ సంస్థలను అమ్మేందుకు కృషి చేస్తున్నారని విమర్శించారు. కార్మికుల శ్రమను కార్పొరేట్లకు అమ్ముతున్నారని చెప్పారు. గతంలో 55 మంది శత కోటీశ్వరులు ఉంటే ప్రస్తుతం వంద మందికి చేరారన్నారు. 49 శాతం దేశ సంపద వంద మంది చేతుల్లోనే ఉందన్నారు. కార్మికచట్టాలలో కార్మిక హక్కులను కాలరాసే విధంగా మార్పులు తీసుకొస్తున్నారని దుయ్యబట్టారు. కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల పరిస్థితి దారుణంగా ఉందన్నారు. రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా పనిచేస్తున్నా కనీసవేతనాలు అమలు కావడం లేదన్నారు. నేటికీ కాంట్రాక్ట్ ఉద్యోగులకు రెన్యువల్ ఉత్తర్వులు ప్రభుత్వం ఇవ్వలేదన్నారు. అయినా కూడా కాంట్రాక్ట్ ఉద్యోగులు ఏదొక రోజు రెన్యువల్ చేస్తారని వెట్టిచాకిరీ చేస్తున్నారని తెలిపారు. చంద్రబాబు ఉద్యోగుల, కార్మికుల ఉద్యమాలను అణిచివేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు గానీ సమస్యల పరిష్కారానికి కాదన్నారు. ఉద్యోగులు, కార్మికులు ఇలాంటి విధానాలను తిప్పికొట్టేందుకు ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు.
సెమినార్‌లో ఎపిఎన్‌జిఓ అసోసియేషన్ అధ్యక్షులు బండి శ్రీనివాసరావు, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి చీకటి శ్రీనివాసరావు, పెన్షనర్స్ నాయకులు ఆదినారాయణ, పోస్టల్ యూనియన్ నాయకులు వెంకటేశ్వర్లు, బిఎస్‌ఎన్‌ఎల్ యూనియన్ నాయకులు వెంకయ్య, సిఐటియు నగర కార్యదర్శి బి వెంకట్రావు మాట్లాడారు.
- ఆ విధానాలను ఐక్యంగా తిప్పికొట్టాలి - శాసనమండలి సభ్యులు, పిడిఎఫ్ ఫ్లోర్ లీడర్ విఠపు బాలసుబ్రమణ్యం
సెమినార్‌లో ఎపిఎన్‌జిఓ అసోసియేషన్ అధ్యక్షులు బండి శ్రీనివాసరావు, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి చీకటి శ్రీనివాసరావు, పెన్షనర్స్ నాయకులు ఆదినారాయణ, పోస్టల్ యూనియన్ నాయకులు వెంకటేశ్వర్లు, బిఎస్‌ఎన్‌ఎల్ యూనియన్ నాయకులు వెంకయ్య, సిఐటియు నగర కార్యదర్శి బి వెంకట్రావు మాట్లాడారు.
No comments:
Post a Comment