- ఎపి మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ డిమాండ్
- మున్సిపల్ కార్యాలయం వద్ద ధర్నా
- కమిషనర్‌కు వినతి
స్థానిక మున్సిపాల్టీలో పని చేస్తున్న కాంట్రాక్టు కార్మికుల బకాయి వేతనాలు చెల్లించి వారి సమస్యలు పరిష్కరించాలని ఎపి మున్సిపల్‌వర్కర్స్‌్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి టివి రమణ డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం స్థానిక మున్సిపల్ కార్యాలయం వద్ద కార్మికులు ధర్నా చేశారు. ఈ ధర్నాను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ మున్సిపాల్టీలో వివిధ విభాగాల్లో పని చేస్తున్న ఔట్‌సోర్సింగ్ కార్మికులకు ఎపిఎల్‌ఐ నుంచి వేతనాలు చెల్లించలేదన్నారు. 3నెలలుగా వేతనాలు చెల్లించకపోవడంతో కార్మికులు అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. పని చేసిన కాలానికి వెంటనే వేతనాలు చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. రెగ్యులర్ కార్మికులకు ఇంక్రిమెంట్లు సమస్యను పరిష్కరించాలన్నారు. మేలో రెగ్యులర్ కార్మికులు చేసిన 4 రోజుల సమ్మె కాలాన్ని సెలవుగా పరిగణించాలన్నారు.
10నుంచి రాష్ట్ర వ్యాప్త సమ్మెలో పాల్గొంటాం...
రాష్ట్ర వ్యాప్తంగా కనీస వేతనం రూ.15 వేలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈనెల 10న జరిగే రాష్ట్ర వ్యాప్త మున్సిపల్ కార్మికుల సమ్మెలో తామంతా పాల్గొంటున్నామని కమిషనర్‌కు తెలిపారు. ఈ మేరకు సమ్మె నోటీసు కమిషనర్‌కు అందజేశారు. ఈ సందర్భంగా టివి రమణ మాట్లాడుతూ జీవో3 ప్రకారం కనీస వేతనాలు ఇవ్వాలని కోరుతూ అనేక మార్లు ప్రభుత్వానికి వినతిని అందజేశామన్నారు. సమస్యకు నిర్ధిష్టమైన హామీ నేటికీ అమలు కాలేదన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈనెల 10 నుంచి సమ్మె చేయనున్నామని ఈ సమ్మెలో మున్సిపాల్టీల్లో పని చేస్తున్న ఔట్‌సోర్సింగ్ కార్మికులంతా పాల్గొంటారని పిలుపునిచ్చారు.
- మున్సిపల్ కార్యాలయం వద్ద ధర్నా
- కమిషనర్‌కు వినతి
స్థానిక మున్సిపాల్టీలో పని చేస్తున్న కాంట్రాక్టు కార్మికుల బకాయి వేతనాలు చెల్లించి వారి సమస్యలు పరిష్కరించాలని ఎపి మున్సిపల్‌వర్కర్స్‌్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి టివి రమణ డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం స్థానిక మున్సిపల్ కార్యాలయం వద్ద కార్మికులు ధర్నా చేశారు. ఈ ధర్నాను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ మున్సిపాల్టీలో వివిధ విభాగాల్లో పని చేస్తున్న ఔట్‌సోర్సింగ్ కార్మికులకు ఎపిఎల్‌ఐ నుంచి వేతనాలు చెల్లించలేదన్నారు. 3నెలలుగా వేతనాలు చెల్లించకపోవడంతో కార్మికులు అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. పని చేసిన కాలానికి వెంటనే వేతనాలు చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. రెగ్యులర్ కార్మికులకు ఇంక్రిమెంట్లు సమస్యను పరిష్కరించాలన్నారు. మేలో రెగ్యులర్ కార్మికులు చేసిన 4 రోజుల సమ్మె కాలాన్ని సెలవుగా పరిగణించాలన్నారు. 10నుంచి రాష్ట్ర వ్యాప్త సమ్మెలో పాల్గొంటాం...
రాష్ట్ర వ్యాప్తంగా కనీస వేతనం రూ.15 వేలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈనెల 10న జరిగే రాష్ట్ర వ్యాప్త మున్సిపల్ కార్మికుల సమ్మెలో తామంతా పాల్గొంటున్నామని కమిషనర్‌కు తెలిపారు. ఈ మేరకు సమ్మె నోటీసు కమిషనర్‌కు అందజేశారు. ఈ సందర్భంగా టివి రమణ మాట్లాడుతూ జీవో3 ప్రకారం కనీస వేతనాలు ఇవ్వాలని కోరుతూ అనేక మార్లు ప్రభుత్వానికి వినతిని అందజేశామన్నారు. సమస్యకు నిర్ధిష్టమైన హామీ నేటికీ అమలు కాలేదన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈనెల 10 నుంచి సమ్మె చేయనున్నామని ఈ సమ్మెలో మున్సిపాల్టీల్లో పని చేస్తున్న ఔట్‌సోర్సింగ్ కార్మికులంతా పాల్గొంటారని పిలుపునిచ్చారు.
No comments:
Post a Comment