Thursday, 9 July 2015

ఏపిలో ఆందోళన బాటపట్టిన మున్సిపల్ కార్మికులు...

తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులు సమ్మె చేపట్టారు. విజయవాడలో మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం వద్ద కార్మికులు నిరవధిక సమ్మె చేపట్టారు. వీరికి మద్దతుగా సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి. మధు, సిఐటియు, ఏఐటియూసీ, ఐఎన్ టీయూసీ, బీఎంఎస్ సంఘాల నేతలు పాల్గొన్నారు. ధర్నాకు మున్సిపల్ కార్మికులు భారీ సంఖ్యలో హాజరయ్యారు.
తిరుపతిలో కొనసాగుతున్న ఆందోళన
తిరుపతిలో కార్పొరేషన్ కార్యాలయం ముందు మున్సిపల్ ఉద్యోగులు ధర్నా చేస్తున్నారు. సిఐటియు నేత వీరికి మద్దతు తెలిపారు ఈ సందర్భంగా యాన మాట్లాడుతూ... మున్సిపల్ కార్మికులు చేసిన సేవ ఎవరూ చేయలేరని కార్మికులు కోరుతున్న న్యాయమైన సమస్యలు పరిష్కరించి సమ్మె విరమింప చేయాలని డిమాండ్ చేశారు. కార్మిక మంత్రిగా ఉన్న నారాయణ తుళ్లూరు మంత్రి.. ఇప్పుడు జపాన్ మంత్రి అయిపోయారు. ప్రజారోగ్యం నష్టపోక ముందే ప్రభుత్వం కళ్లు తెరవాలని డిమాండ్ చేశారు.
విశాఖ లో..
జీవీఎం సీ ఎదుట కార్మికులు ఆందోళనకు దిగారు. రేపటి లోగా తమ సమస్యలు పరిష్కరించపోతే ఆందోళన మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
గుంటూరులో
నగర కార్పొరేషన్ పరిధిలో పని చేస్తున్న 2500 మంది కార్మికులు సమ్మె బాట పట్టారు. పదో పీఆర్సీ అమలు అయిన తరువాత కనీస వేతనం చెల్లించాలని వుంది. దానిని అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

No comments:

Post a Comment