Saturday, 22 August 2015

కార్మిక వ్యతిరేక చట్టాలను ఉపసంహరించుకోవాలి...

- సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు వి.ఉమామహేశ్వరరావు

 కార్మికుల చట్టాలను కుదించేందు కు మోడీ ప్రభుత్వం చేస్తున్న యత్నాలను ఉపసంహరించుకోవాలని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు వి.ఉమామహేశ్వరరావు డిమాం డ్‌ చేశారు. సెప్టెంబర్‌ 2న అన్ని కేంద్ర, కార్మిక సంఘాలు తలపెట్టిన సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని కోరుతూ అన్ని కార్మిక సంఘాలూ నిర్వహిస్తున్న బస్సుయాత్ర శనివా రం నూజివీడులో ప్రారంభమై హనుమాన్‌ జంక్షన్‌ మీదుగా పశ్చిమ గోదావరి జిల్లాకు చేరింది. ఈ జాతాకు జంక్షన్‌లో సిఐటియు కార్యకర్తలు, నాయకులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు వి.ఉమామహేశ్వరరావు మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం కార్మికులను భానిసలుగా మార్చేం దుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. కార్పొరేట్‌ కంపెనీలకు ఊడిగం చేస్తూ దశా బ్ధాల తరబడి సాధించుకున్న కార్మిక చట్టాలను మార్చి కార్మికులకు తీవ్ర అన్యాయం చేయడా నికి పూనుకుంటోందన్నారు. కార్మిక వ్యతిరేక సంస్కరణలను వేగంగా అమలు చేస్తోంద న్నారు. ఎఐటియుసి రాష్ట్ర అధ్యక్షులు చలసాని రామారావు మాట్లాడారు. కార్మిక సంఘాలు కోరుతున్న కనీసవేతనం రూ.15వేలు, సమాన పనికి సమాన వేతనం, కాంట్రాక్ట కార్మికుల రెగ్యులైజేషన్‌, కనీస పింఛన్‌ రూ.3వేలు అమలు చేయాలని కోరారు. కార్మికులు పెద్దఎత్తున పోరాటాలు సాగించకపోతే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దిగిరావన్నారు. ఈ యాత్రలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి డివి కృష్ణ, జిల్లా అధ్యక్షులు ఎన్‌సిహెచ్‌ శ్రీనివాస్‌, కార్యదర్శులు పి.కమల, ఎఐటియుసి రాష్ట్ర నాయకులు ఆర్‌.రవీంద్ర, సిహెచ్‌.రామారావు, మండల కార్యదర్శి జి.రాజు, జిల్లా నాయకులు జరబన నాగేశ్వరరావు, ఐఎఫ్‌టియు నాయకులు పోలార్‌ పాల్గొన్నారు. స్వాగతం పలికిన వారిలో సిఐటియ గన్నవరం డివిజన్‌ కార్యదర్శి పి.మహేష్‌, బాపులపాడు మండల కార్యదర్శి నల్లి ఆంజనేయులు, డివిజన్‌ నాయకులు అబ్దుల్‌బారీ, ఎఎస్‌ఎఫ్‌ జిల్లా సంయుక్త కార్యదర్శి జోజిబాబు, స్థానిక ముఠా, బిల్డింగ్‌, ప్రయివేటు ఎలక్ట్రీషియన్లు, కార్పెంటర్లు, షాపు ముఠా వర్కర్లు పాల్గొన్నారు.

కార్మిక సంఘాల ఐక్యగళం...

- సమ్మెను జయప్రదం చేయాలని పిలుపు రాజమండ్రి చేరిన బస్సు జాతా

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సెప్టెంబర్‌ 2న దేశ వ్యాప్తంగా జరుగుతున్న సార్వత్రిక సమ్మెను కార్మికులు, ఉద్యోగులు, ప్రజలు జయప్రదం చేయాలని వివిధ కార్మిక సంఘాల నాయకులు పిలుపు నిచ్చారు. ఆగస్టు 17న హిందూ పురం నుంచి బయలుదేరిన బస్సు జాతా శనివారం రాత్రి రాజమండ్రికి చేరుకుంది. ఈ సందర్భంగా బొమ్మన రామచంద్రరావు ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ ట్రస్ట్‌ హాల్లో జరిగిన సభలో వివిధ కార్మిక సంఘాల నాయకులు, ఉద్యోగ సమాఖ్య నాయకులు మాట్లాడారు. కేంద్రంలో బిజెపి, రాష్ట్రంలో టిడిపి ప్రభుత్వం కార్మిక, ఉద్యోగ, ప్రజావ్యతిరేక విధానాలను అవలంభిస్తున్నాయన్నారు. ఈ విధానాలను సమ్మె ద్వారా తిప్పికొట్టాలన్నారు. సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు వి.ఉమా మహేశ్వరరావు మాట్లాడుతూ దేశ అభివృద్ధి కోసం సెప్టెంబర్‌ 2న జరగనున్న దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. కార్మికుల హక్కులను ప్రభుత్వాలు కాలరాస్తున్నాయన్నారు. ఈ కుట్రను భగం చేయాలని కోరారు. కార్మిక చట్ట సవరణలను తక్షణం ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. ప్రజలు, కార్మికులు ఇళ్లల్లో కూర్చోకుండా రోడ్డుపైకి రావాలన్నారు. ఎఐటియుసి రాష్ట్ర డిప్యూటీ జనరల్‌ సెక్రటరీ రవీంద్రనాథ్‌ మాట్లాడుతూ సింగపూర్‌ టీమ్‌ను రాష్ట్రంలో తిప్పి వారికి రాయితీలు ఇచ్చేందుకు చంద్రబాబు నానా ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. అసంఘటిత రంగంలో కార్మికుల వేతనాలను పెంచేందుకు ఎందుకు కృషి చేయట్లేదని 
ప్రశ్నించారు. సంక్షేమ చట్టాలను ఎందుకు అమలు చేయట్లేదన్నారు. యాజమాన్యాలకు హక్కులు కల్పించి కార్మికుల హక్కులను కాలరాసే కార్మిక సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు. హుదూద్‌ తుపానులో ఎయిర్‌టెల్‌, ఐడియా వంటి సంస్థలు మూగబోయాయని, బిఎస్‌ఎన్‌ఎల్‌ ఒక్కటే పనిచేసిందనే విషయాన్ని గుర్తు చేశారు. బ్యాంకులు, ఎల్‌ఐసి ఉండబట్టే ప్రజల పొదుపునకు రక్షణ ఉందన్నారు. ఇవి ప్రయివేటు పరం చేస్తే ప్రజల సొమ్ముకు ఎవరు బాధ్యత వహిస్తారన్నారు. ప్రజాధనాన్ని కార్పొరేట్‌, విదేశీ సంస్థలకు కట్టబెట్టాలని చూస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కుట్రను సమ్మె ద్వారా ప్రజలు భగం చేయాలన్నారు. సమ్మె చేస్తే రూ.6లక్షలు జరిమానా లేదా ఆరు నెలలు జైలు శిక్ష విధించే చట్టాలు రాబోతున్నాయన్నారు. అందువల్ల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు. కార్మిక శాఖను నిర్వీర్యం చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కుట్ర పన్నుతున్నాయన్నారు. కార్మికులను బానిసలుగా మార్చేందుకు కుట్రలు పన్నితే కార్మికవర్గం చూస్తూ ఊరుకోదన్నారు. తొలుత సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు టి.అరుణ్‌ వివిధ కార్మిక సంఘాల నాయకులను వేదికపైకి ఆహ్వానించారు. ఈ సభలో వివిధ కార్మిక సంఘాల నాయకులు మీసాల సత్యనారాయణ, బిబి.నాయుడు, జి.వెంకటేశ్వర్లు, ఎడి కామాచార్యులు, జెవి సుందరరామరాజు, కె.రామారావు, వి.వెంకటేశ్వరరావు, సత్యకుమార్‌, దాసరి ప్రసాదరావు, వి.సతీష్‌, కిర్ల కృష్ణ, ఎస్‌ఎస్‌ మూర్తి, గణపతి, సత్యానందం, లకీëపతి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజానాట్యమండలి కళాకారులు ఆలపించిన అభ్యుదయ గీతాలు ఆహుతులను ఆకట్టుకున్నాయి.

Friday, 21 August 2015

కార్మిక సంక్షేమ నిధికి ప్రభుత్వం చేస్తున్న సహకారం ఏమిటి?

గత మార్చిలో ప్రభుత్వం చట్టాన్ని సవరించి కార్మిక సంక్షేమ నిధికి ప్రస్తుతం నెలకు రూ.2గా ఉన్న కార్మిక వాటాను నెలకు రూ.30గా నిర్ణయించింది. అలాగే యజమానులు చెల్లించే వాటాను నెలకు రూ.5 నుంచి రూ.70కి పెంచింది. ఈ మొత్తం నిధులు ప్రభుత్వం దగ్గర జమ అవుతాయి. ప్రభుత్వం ఈ నిధికి ఒక్క పైసా కూడా చెల్లించదు. కానీ ఆధిపత్యం మొత్తం ప్రభుత్వానిదే. తమిళనాడులో ఈ సంక్షేమ నిధికి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆర్థిక సహాయం చేసి పని చేయలేని పరిస్థితుల్లో ఉన్న రిటైర్డ్‌ కార్మికులందరికీ నెలకు రూ.1,000 పెన్షన్‌ చెల్లిస్తున్నది. ఈ తరహాలో అనేక వృత్తుల వారికి సహాయం చేసే పథకాలు కేరళ, బెంగాల్‌, తదితర రాష్ట్రాల్లో అనేకం అమలు జరుగుతున్నాయి. మన రాష్ట్రంలో మాత్రం చంద్రబాబుకు కార్మికుల జేబులు కత్తిరించడమే తప్ప వారికి సహాయం చేయాలనే ఆలోచన ఏకోశానా లేదు.
డ్రైవర్ సోదరులకి 5 లక్షల ప్రమాద భీమా ఇస్తున్నట్లు ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటున్నది . పై ఆర్టికల్ లో రాసినట్లు 5 లక్షల ప్రమాద భీమా అమలుచేయడానికి ఇన్సూరెన్స్ కంపెనీలకి కట్టవలసిన ప్రీమియం మొత్తం 11 కోట్లు మన బిల్డింగ్ కార్మికుల సంక్షేమ నిధి నుండి తిసి ఇన్సూరెన్స్ కంపెనీలకు కట్టింది..... సొమ్ము కార్మికులది .....సోకు చంద్రబాబుది......మన నిధులు కాపాడుకోవడానికి సెప్టెంబర్ 2 సమ్మె మరింత పట్టుదలతో చేద్దాం...

సొమ్ము కార్మికులది....సోకు చంద్రబాబుది

ప్రమాదంలో చనిపోయే డ్రైవర్లందరికీ రూ.5 లక్షల పరిహారం చెల్లించేట్లు ముఖ్యమంత్రి గొప్ప నిర్ణయం తీసుకున్నామని రాష్ట్రవ్యాప్తంగా బస్సులపైన అడ్వర్టైజ్‌మెంట్లు, హోర్డింగ్స్‌ ద్వారా ఊదరగొట్టుడు ప్రచారం ప్రభుత్వం చేస్తున్నది. కానీ ఆచరణలో ఈ పథకానికి డ్రైవింగ్‌ లైసెస్సుతో పాటు, బ్యాడ్జి కూడా ఉండాలనే నిబంధన పెట్టడంతో నూటికి 70 మంది డ్రైవర్లకు ఇది వర్తించడం లేదు. ప్రమాద బీమాలో గాయపడి ఆస్ప్రతిలో ఉన్నవారికి కూడా ఖర్చులు భరించేట్లుగా పథకం ఉండాలని కార్మికులు కోరుతూ ఉంటే చనిపోతేనే పరిహారం వచ్చేలా ప్రభుత్వం స్కీంను తయారు చేసింది. సహజ మరణానికి ఏ సహాయం ఉండదు. కార్మికులు బతకడం కంటే తొందరగా చచ్చిపోవాలని కోరుతున్నట్లుగా ప్రభుత్వ పథకం ఉన్నది. ఈ పథకానికి ప్రభుత్వం నిధులు ఇచ్చింది లేదు. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధి నుంచి రూ.11 కోట్లు డ్రా చేసి బీమా కంపెనీ ప్రీమియంను ప్రభుత్వం చెల్లించింది. అంటే డబ్బు కార్మికులది ప్రచారం చంద్రబాబుది. ఇంతే కాదు చంద్రబాబు నియోజకవర్గం అయిన కుప్పంలో భవన నిర్మాణ రంగానికి సంబంధించిన కేంద్రం ఏర్పాటుకు రూ.17.50 కోట్లు ఈ నిధుల నుంచే విడుదల చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమానికి కాకుండా పాలకుల ప్రచారానికి ఈ విధంగా నిధులు వాడటం దుర్వినియోగం కాదా?

కార్మిక శాఖ సలహా కమిటీ లేవీ!!

కార్మిక శాఖకు సలహాలు ఇచ్చేందుకు, కనీస వేతనాలను నిర్ణయించేందుకు చట్టబద్ధంగా సలహా కమిటీ ఉండాలి. సంవత్సర కాలంగా ఆ కమిటీ నియామకానికి ప్రభుత్వం ప్రయత్ని ంచలేదు. ఈ కమిటీ లేకుండా రాష్ట్రంలో కనీస వేతనాల షెడ్యూల్‌లో ఉండే లక్షలాది మంది కార్మికులకు వేతనం పెంచే వీలు లేదు. బహశా ఈ ఉద్దేశంతోనే రాష్ట్ర ప్రభుత్వం ఈ కమిటీని వేయడం లేదు. అలాగే ఎవాల్యూయేషన్‌, ఇంప్లిమెంటేషన్‌ కమిటీని కేంద్ర కార్మిక సంఘాల ప్రతినిధులతో ఏర్పాటు చేయడం సంప్రదాయం. అటువంటి కమిటీ ఇంతవరకూ తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాటు చేయలేదు. రాష్ట్ర ప్రభుత్వం వద్ద సుమారు రూ.1,100 కోట్ల నిధులు భవన నిర్మాణ కార్మిక సంక్షేమానికై నిల్వ ఉన్నాయి. పనిచెయ్యలేని దశలో, 60 సంవత్సరాల వయస్సు దాటిన వారికి ఈ నిధుల నుంచి పెన్షన్‌, ప్రమాదంలో గాయపడిన వారికి వైద్య ఖర్చులు ఇమ్మని కోరుతున్నా ప్రభుత్వం స్పందించడం లేదు. ఈ నిధుల నుంచి వచ్చే వడ్డీలు పాలనాపరమైనా ఖర్చుల పేరుతో అధికారులు, మంత్రివర్యులు జల్సాలు చేయడానికి వాడుతున్నారు తప్ప నిజంగా కష్టాలలో ఉన్న భవన నిర్మాణ కార్మికులకు ఈ నిధిని ఖర్చు చేయడంలేదు. ఈ నిధిని పర్యవేక్షించేందుకు కార్మిక సంఘాల ప్రతినిధులతో కమిటీని వేయడం ప్రభుత్వ బాధ్యత. ఇంతవరకు అటువంటి కమిటీ ఏర్పాటు చేయలేదు. ఇవే కాక అనేక చట్టాల పరిధిలో ఇటువంటి సలహా కమిటీలు ఏర్పాటు చేయవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉన్నది. ముఖ్యమంత్రి అటువంటి ఆదేశాలు ఇవ్వరు. సంబంధిత మంత్రికి ఈ విషయం పట్టదు. కేవలం అధికారుల ఇష్టారాజ్యంగా వ్యవహారం నడుస్తున్నది.


ఉపాధి హామీలో ఊడిగం.... గ్యారంటీలేని జీవితం

ఉపాధి హామీలో ఊడిగం గ్యారంటీలేని జీవితం అధికార పార్టీ అనుగ్ర‌హానికి అంకితం స‌ర్కారీ సేవ‌లో అనునిత్యం అయినా స‌మ‌స్య‌లే ఆసాంతం మేట్లు నుంచి ఫీల్డ్ అసిస్టెంట్ ఏ పేరుమాత్రం చాకిరీకి గిట్టేది అంతంత‌మాత్రం అందుకే అంద‌రూ పాటించాలి జ‌ట్టుమంత్రం ఉద్య‌మిస్తేనే ద‌క్కేది ఏమాత్రం సెప్టెంబ‌ర్ 2 స‌మ్మెకు సిద్ధంకావాలి నువ్వు మాత్రం

ట్రాన్స్ పోర్ట్ కార్మికులు.... తెల‌వార‌ని జీవితాలు

ట్రాన్స్ పోర్ట్ కార్మికులు తెల‌వార‌ని జీవితాలు మోటార్ల‌తో కుస్తీలు అనునిత్యం సుస్తీలు అమ‌లుకాని చ‌ట్టాలు బ‌తుకంతా క‌ష్టాలు రోడ్డు మీద ర‌క్ష‌ణ లేదు ఇంట్లో బిక్ష‌కు గ్యారంటీ లేదు అందుకే అన్న‌ద‌మ్ములు ఐక్యం కావాలి మ‌న‌కు హ‌క్కుల‌కై ఉద్య‌మించాలి స‌ర్కారుకు బుద్ధిచెప్పాలి సెప్టెంబ‌ర్ 2 స‌మ్మెకు సిద్ధంకావాలి

స‌మ్మె చేద్దాం... స‌ర్కారు సంగ‌తి చూద్దాం

స‌మ్మె చేద్దాం
స‌ర్కారు సంగ‌తి చూద్దాం
స‌మ‌ర‌శంఖం పూరిద్దాం
స‌మ‌స్య‌ల‌ను సాదిద్ధాం
ఐక్య‌త చాటుదాం
అధికారం మ‌త్తు వ‌దిలిద్దాం
కార్పోరేట్ సేవ‌ల‌కు క‌ళ్లు తెరిపిద్దాం
క‌ష్ట‌జీవుల‌ స‌త్తా చూపిద్దాం
ప్రైవేటీక‌ర‌ణ ప‌నిబ‌డ‌దాం
ప్ర‌భుత్వ సంప‌ద కాపాడుకుందాం
కార్మికులంతా క‌ట్టుక‌డ‌దాం
పాల‌కుల క‌ళ్లుతెరిపిద్దాం
కార్మిక ఐక్య‌త వ‌ర్ధిల్లాలి
సెప్టెంబ‌ర్ 2 స‌మ్మె విజ‌య‌వంతం కావాలి

కార్మికుల క‌ష్టాలు మ‌న‌కు గిట్ట‌వు.....

జ‌నం బాధ‌లు ప‌ట్ట‌వు
ఉల్లి ధ‌ర‌ల లొల్లి మాక‌వ‌స‌రం లేదు
కార్మికుల క‌ష్టాలు మ‌న‌కు గిట్ట‌వు
అవినీతిని క‌ప్పెట్టాయాలి
అరాచ‌కాల‌ను దాచేయాలి
అడ్డూఅదుపులేని అడ్డ‌గోలు త‌నాన్ని తెలియ‌కుండా చేయాలి
ప్ర‌భుత్వ ఆస్తులు కొల్ల‌గొడుతుంటే మాట్లాడం
ప్ర‌భుత్వ‌రంగాన్ని తాక‌ట్టు పెడుతుంటే నోరుమెద‌పం
దేశీయ సంస్థ‌ల‌ను దోపిడీ చేస్తుంటే ప‌ల్లెత్తుమాట కూడా అనం
కానీ కులాల కుంప‌టి రాజేయ‌డానికి రిజ‌ర్వేష‌న్లు అంటాం
మ‌త మార‌ణ‌హామం కోసం మ‌త విష‌యాలు మాట్లాడ‌తాం
మందిని మ‌ళ్లీ మ‌ళ్లీ మ‌భ్య‌పెట్ట‌డ‌నికి ఎన్ని వేషాల‌యినా వేస్తాం
అందుకే మేము స్వ‌యం సేవ‌కులు
ఫాసిజ‌పు వార‌సులం
దేశానికి ప‌ట్టిన చీడ‌పురుగులం
ఆల్ ట్రేడ్ యూనియన్ బస్ జాతా సందర్భంగా సదస్సు లో మాట్లాడుతున్న సి ఐ టి యు రాష్ట్ర కార్యదర్శి వి. ఉమామహేశ్వరావు గారు...

Thursday, 20 August 2015

చ‌ట్టాల్లో స‌వ‌ర‌ణ‌లు తెస్తారు... కార్మిక హ‌క్కులు కాల‌రాస్తారు



చ‌ట్టాల్లో స‌వ‌ర‌ణ‌లు తెస్తారు
కార్మిక హ‌క్కులు కాల‌రాస్తారు
క‌సాయ‌పోడు మొద‌లెడితే
చంద్ర‌బాబు అనుస‌రిస్తాడు
ప్ర‌పంచ‌బ్యాంకు ఒత్తిడితో
మ‌న కార్మికుల‌ ఉసురు తీస్తారు
సంఘం పెట్టుకునే హ‌క్కు
స‌వ‌రిస్తే ఎవ‌రు కార్మికుడికి దిక్కు
పోరాడే హ‌క్కు నిలువ‌రిస్తే
ప్ర‌శ్నించే హ‌క్కును కాల‌రాస్తే
క‌డుపుమండిన క‌ష్ట‌జీవులు ఊరుకోరు
కార్పోరేటోడి కాప‌లాదారుల‌ను త‌రిమికొడ‌తారు
ఐక్య ఉద్య‌మాల‌తో మెడ‌లు వంచుతారు
సెప్టెంబ‌ర్ 2 స‌మ్మెతో స‌మాధానం చెబుతారు
ఖ‌బ‌డ్దార్ కార్మిక వ్య‌తిరేకులారా
కార్మికుల స‌మ్మెట దెబ్బ‌కు సిద్దంకండి

కార్మిక శక్తిని నిరూపించాలి......

- సిఐటియు రాష్ట్ర కార్యదర్శి ఏవి. నాగేశ్వరరావు


కార్మికుల డిమాండ్‌ల సాధనకు సెప్టెంబర్‌ 2న జరిగే దేశవ్యాపిత సార్వత్రిక సమ్మెను జయప్రదం చేసి కార్మిక వర్గ ఐక్యతను, శక్తిని ప్రపంచానికి చాటాలని సిఐటియు రాష్ట్ర కార్యదర్శి ఏవి. నాగేశ్వరరావు అన్నారు. గురువారం బస్సు యాత్రలో కార్మిక సంఘాల నాయకులతో వచ్చిన ఆయన కావలిలో బస్సును ఆపి కార్మికునుద్దేశించి మాట్లాడారు. గత 24 ఏళ్లలో భారత శ్రామికవర్గం ఇప్పటి వరకు 15 సార్వత్రిక సమ్మెను చేపట్టి విజయం సాధించిందన్నారు. 16వ సార్వత్రిక సమ్మెను కూడా జయప్రదం చేయాలని కోరారు. కార్మికులకు ఎంతో కాలంగా పెండింగ్‌లోని సమస్యలైన ధరల నియంత్రణ, కనీస వేతనం నెలకు రు.15 వేలు, కార్మిక చట్టాల సక్రమ అమలు, చట్ట సవరణల నిలుపుదల, కాంట్రాక్టు, క్యాజువల్‌, ఔట్‌సోర్సింగ్‌ నియామకాల క్రమబద్దీకరణ, సమాన పనికి సమాన వేతనం, అందరికి పింఛన్‌ల వర్తింపు, వ్యవసాయ కూలీలతో సహా అసంఘటిత కార్మికులందరికి సాంఘిక భద్రత కల్పించాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వ రంగ పరిశ్రమలలో పెట్టుబడుల ఉపసంహరణ రద్దు, రోడ్డు రవాణా, భద్రతా బిల్లు ఉపసంహరణ, అన్ని స్కీంల కార్మికుల క్రమబద్దీకరణ, భూసేకరణ బిల్లు రద్దు, రక్షణ, రైల్వే, ద్రవ్య, చిల్లర వర్తకాలలో విదేశీ పట్టుబడుల నిలుపుదల ప్రధాన డిమాండ్ల ఈ సార్వత్రిక సమ్మె కొనసాగుతుందన్నారు. కార్మిక హక్కులను ప్రభుత్వాలు హరిం చవచ్చుగానీ వారి పోరాట శక్తిని హరించే శక్తి ఎవరికీ లేదన్నారు. ఈ బస్సు యాత్రలో ఏఐటియుసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఓబులేసు, రాష్ట్ర కార్యదర్శి మనోహరమాణిక్యం, ఐఎఫ్‌టియు నాయకులు రామారావు, ప్రసాద్‌, టియుసిసి నాయకులు పివి సుందరరామ రాజులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, సిఐటియు జిల్లా నాయకులు ఎస్‌కె. రెహనాబేగం, కాకాని రామయ్య, తాళ్ళూరు మాల్యాద్రి, పఠాన్‌ కాలేషా, విఎంకే రావ్‌, జి. రవికుమార్‌, అంగన్‌వాడీ కార్యకర్తలు, ఏఐటియుసి నాయకులు దామా అంకయ్య, ఎన్‌. వెంకటేశ్వర్లు, డేగా సత్యనారాయణ, ఎం. బాలకోటయ్య, ఐఎఫ్‌టియు నాయకులు కె. భాస్కర్‌, మున్సిపల్‌ వర్కర్లు, పలు ట్రేడ్‌ యూనియన్‌ల కార్మికులు పాల్గొన్నారు.

కష్టజీవుల పక్షమా..కార్పొరేట్‌ పక్షమా...


- మోడీ, చంద్రబాబు ఏ పక్షమో తేల్చుకోవాలి
- సెప్టెంబర్‌ రెండు సమ్మె ప్రారంభం మాత్రమే...
- విధానాలు మారకుంటే మరిన్ని సమ్మెలు
- బస్సు యాత్రలో కేంద్ర కార్మిక సంఘాల నేతల హెచ్చరిక
కేంద్రంలో మోడీ, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు కార్పొరేట్‌ వ్యాపారుల పక్షమో, కష్టజీవుల పక్షమో తేల్చుకోవాల్సిన సమయం ఆసన్నమైందని సిఐటియు రాష్ట్ర కార్యదర్శి ఏవి నాగేశ్వరరావు తెలిపారు. సెప్టెంబర్‌ రెండున జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె జయప్రదం చేయాలని కోరుతూ రాష్ట్రమంతా పర్యటిస్తున్న బస్సుయాత్ర గురువారం రాత్రి ఒంగోలుకు చేరుకుంది. బస్సుయాత్రకు స్ధానిక దక్షిణ బైపాస్‌ వద్ద ఉన్న జిల్లా పరిషత్‌కార్యాలయం వద్ద వివిధ సంఘాల నేతలు ఘన స్వాగతం పలికారు. అక్కడ నుండి నెల్లూరు బస్టాండ్‌, కలెక్టరేట్‌, చర్చి సెంటర్‌, మిరియాలపాలెం సెంటర్‌, పాత కూరగాయల మార్కెట్‌ నుండి అద్దంకి బస్టాండ్‌ వరకు బైక్‌లతో ర్యాలీ నిర్వహించారు. అనంతరం అద్దంకి బస్టాండ్‌ సెంటర్‌లో సభ నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు రాష్ట్ర కార్యదర్శి ఏవి నాగేశ్వరరావు మాట్లాడుతూ అధికారంలోకి వచ్చీరాగానే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కార్మికవర్గంపై కక్షగట్టి వ్యవహరిస్తున్నాయన్నారు. అనేక సంవత్సరాలుగా పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను నిర్వీర్యం చేసేందుకు పూనుకున్నాయని విమర్శించారు. ఎంపీలు, ఎమ్మెల్యేలకు లక్ష రూపాయల జీతం పెంచుతున్న ప్రభుత్వాలు కార్మికులకు కనీస వేతనం రూ.15 వేలు ఇవ్వమంటే డబ్బులు లేవని చెపుతున్నాయన్నారు. ఈ కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా సెప్టెంబర్‌ రెండున జరిగే సమ్మె ప్రారంభం మాత్రమేనని, ప్రభుత్వాలు విధానాలను మార్చుకోకుంటే మరిన్ని సమ్మెలు జరుగుతాయని హెచ్చరించారు. సెప్టెంబర్‌ రెండున జరిగే సమ్మెను జిల్లాలో విజయవంతంగా నిర్వహించాలని నేతలు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఏఐటియుసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి ఓబులేసు, టియుసిసి రాష్ట్ర కార్యదర్శి పివి సుందరరావు, ఐఎఫ్‌టియు రాష్ట్ర అధ్యక్షులు పి ప్రసాద్‌, కె రామారావులు ప్రసంగించారు. కార్యక్రమంలో ఏఐటియుసి, సిఐటియు, ఐఎన్‌టియుసి, ఐఎఫ్‌టియు జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఎస్‌ సర్ధార్‌, పివిఆర్‌ చౌదరి, సిహెచ్‌ మజుందార్‌, చీకటి శ్రీనివాసరావు, కె రామస్వామి, కె వీరాస్వామిరెడ్డి, ఆర్‌ మోహన్‌లు అధ్యక్షవర్గంగా వ్యవహరించగా, వివిధ సంఘాల నాయకులు దామా శ్రీనివాసులు, బి వెంకట్రావు, ఎస్‌కె మస్తాన్‌, కె వెంకటేశ్వర్లు, కోటేశ్వరరావు, ఆర్‌ శ్రీనివాసరావు, తంబి శ్రీనివాసులు, ఎస్‌డి హుస్సేన్‌ తదితరులు పాల్గొన్నారు.

Wednesday, 19 August 2015

సమ్మె సమరానికి సిద్ధం కావాలి: సిఐటియు


సెప్టెంబర్‌ 2న జరిగే దేశ వ్యాప్త సమ్మె జయప్రదం చేయాలని సంబంధిత సిఐటియు నాయకులు ఓబుల్‌రాజు పిలుపునిచ్చారు. స్థానిక సిఐటియు కార్యాలయంలో డివిజన్‌ స్థాయి సమావేశం ఆ సంఘం పట్టణ కార్యదర్శి గిరిధర్‌ గుప్తా అధ్యక్షతన మంగళవారం జరిగింది. ఈ సందర్భంగా డివిజన్‌ నాయకులు ఓబుల్‌రాజు మాట్లాడుతూ 'సమ్మె సమరానికి సై' అనే నినాదంతో కార్మికులు సిద్ధం కావాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలు తిప్పికొట్టడమే ప్రధాన ధ్యేయమన్నారు. కార్మిక హక్కులకు భంగం వాటిల్లకుండా రక్షించుకోవడం ముఖ్యమన్నారు. దాంతోపాటు కార్మిక చట్టాల రక్షణతోపాటు వేతనం రూ.15 తప్పనిసరి కార్మికులకు ప్రభుత్వం అందించే వరకు ఈ సమ్మెతోపాటు పోరాటాలు ఆగవని ఆయన హెచ్చరించారు. అనంతరం స్థానిక ఐసిడిఎస్‌ కార్యాలయం అధికారి సిడిపిఓకు సమ్మె నోటీసు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆయనతోపాటు శ్రామిక మహిళా డివిజన్‌ కన్వీనర్‌ భువనేశ్వరి, అంగన్‌వాడీ అధ్యక్ష, కార్యదర్శులు వాణిశ్రీ, సరస్వతి, అరుణ, ధనలక్ష్మి, రాజేశ్వరి, అబిద, శ్యామల, సాకమ్మ, భారతి, ప్రేమావతి, యశోద, అక్తర్‌, సభ్యులు టి.మునిరత్నం పాల్గొన్నారు.

కార్మికుల హక్కులను కాలరాస్తే సహించం సిఐటియు హెచ్చరిక.....


కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బడాకంపెనీల మెప్పుకోసం కార్మిక హక్కులను కాలరాస్తే సహించబోమని సిఐటియు రాష్ట్ర అధ్యక్షురాలు పుణ్యవతి హెచ్చరించారు. బుధవారం అనంతపురం జిల్లా గుంతకల్లులో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆమె మాట్లాడారు. ప్రధానమంత్రి మోడీ బడా పారిశ్రామికవేత్తల కోసం కార్మిక చట్టాల సవరణకు శ్రీకారం చుట్టారన్నారు. చట్టాలు సవరిస్తే కార్మికులు మరింత శ్రమదోపిడీకి గురవుతారన్నారు. బడా కంపెనీలకు లక్షల కోట్ల రూపాయలు రాయితీలు ఇస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికులను బానిసలుగా చేయాలనుకోవడం దారుణమన్నారు. ఇప్పటికే అసంఘటిత రంగ కార్మికులు వెట్టిచాకిరీ చేస్తూ చాలీచాలనీ వేతనాలతో జీవితం గడుపుతున్నారన్నారు. ప్రభుత్వాల తీరును వ్యతిరేకిస్తూ వామపక్ష ట్రేడ్‌యూనియన్లతో పాటు అన్ని కార్మిక సంఘాల ఆధ్వర్యంలో సెప్టెంబరు 2న దేశవ్యాప్త సమ్మె చేపట్టనున్నట్టు తెలిపారు. ప్రజలు, కార్మికులు, ఉద్యోగులు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సిఐటియు జిల్లా ప్రధానకార్యదర్శి జి.ఓబులు, సిపిఎం డివిజన్‌ కార్యదర్శి డి.శ్రీనివాసులు, పట్టణ కార్యదర్శి శ్రీనివాసులు ఉన్నారు.
September 2 Desa vyapita saravatrika samme jayapradamcheyalani Bus yatra kadapa ki cherindi,karmikulatho matladuthunna citu rastra nayakulu Kandharapu Murali

Tuesday, 18 August 2015

Gafoor fires on Chandrababu Government | 10TV

https://www.youtube.com/watch?v=qrCuX8BflPM

https://www.youtube.com/watch?v=qrCuX8BflPM

సెప్టెంబరు 2 సార్వత్రిక సమ్మె డిమాండ్- 6.......

కార్మికులందరికి రు.3000/-కు తగ్గకుండా పెన్షన్ ఇవ్వాలి. పెన్షన్ చెల్లింపు గ్యారంటీగా జరిగే విధముగా చూడాలి.
ప్రస్తుతం2004 కి ముందు రిక్రూట్ అయిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు, డి ఓ టి నుండి బి ఎస్ ఎన్ ఎల్ లో విలీనమయిన ఉద్యోగులకు ప్రభుత్వ పెన్షన్ వస్తున్నది. బిఎస్ఎన్ఎల్ లో రిక్రూట్ అయిన వారికి,అనేక ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులకు , ప్రయివేటు కంపెనీల ఉద్యోగులకు ఇపిఎఫ్ ఎవరికయితే వర్తిస్తుందో వారికి ఇపిఎఫ్ స్కిములో భాగముగా ఇపిఎస్ (ఎంప్లాయిస్ పెన్షన్ స్కీం) ప్రకారం పెన్షన్ వర్తిస్తుంది. కాని అనేక రంగాలలో ఈ ఇపిఎస్ క్రింద వచ్చె పెన్షన్ రు.1000 కన్నా చాలా తక్కువగా వుంటూ వచ్చింది. కార్మికోద్యమ పోరాటాల వలన ఈ ఇపిఎస్ స్కీం ప్రకారం వచ్చే పెన్షన్ కనీసం రు.1000 కి తగ్గకూడదని ప్రభుత్వము అంగికరించి ఆర్దర్సు ఇచ్చింది. కాని అత్యధిక సంఖ్యలో వున్నఅసంఘటిత కార్మికులకు ఈ స్కీము వర్తించదు. కేంద్ర, రాష్ట్రప్రభుత్వ ఉద్యోగులలో 1.1.2004 నుండి రిక్రూట్ అయిన వారికి ప్రభుత్వము పెన్షన్ చెల్లించదు. వారికి నూతన పెన్షన్ విధానం అమలులోకి తెచ్చారు. దదీని ప్రకారం వారు ప్రతినెలా తమ జీతం నుండి 10 శాతం పెన్షన్ కంట్రిబ్యుషన్ చెల్లించాలి. ప్రభుత్వము కుడా 10 శాతం చెల్లిస్తుంది. ఈ మొత్తాన్ని ఉద్యోగి ఎంపిక చేసుకున్న ఒక పెన్షన్ ఫండ్ కంపెనీకి జమ చేస్తారు. రిటైర్ అయిన తరువాత ఆ ఉద్యోగికి పెన్షన్ ఎంత వస్తుంది, అసలు వస్తుందా రాదా అనేది ఆ పెన్షన్ ఫండ్ కంపెని లాభ నష్టాల ప్రకారం వుంటుంది. ప్రభుత్వ పెన్షన్ పొందుతున్న వారిని కుడా ఈ నూతన పెన్షన్ విధానం లోకి ఎప్పుడు కావాలని అనుకుంటే అప్పుడు తరలించి ప్రభుత్వము తన బాధ్యతను వదిలించుకునేందుకు వీలుగా నూతన పెన్షన్ చట్టం (పెన్షన్ ఫండ్ రేగ్యులేతరి & డెవలప్మెంట్ అథారిటి చట్టం) ను పార్లమెంటులో కాంగ్రెస్, బి జె పి లు కలిసి ఆమోదించాయి. ఈ విధముగా ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన్ కు ముప్పు తేబడింది.
బిఎస్ఎన్ఎల్ రిక్రుటిస్ కు డిపిఇ గైడ్ లైన్స్ ప్రకారం వారి బేసిక్ పె లో 30 శాతం మేరకు రిటైర్మెంట్ బెనిఫిట్సు కు మేనేజిమెంటు ఖర్చు చేయాలి. కాని మేనేజిమెంటు ఇప్పటివరకు 18 శాతమే ఖర్చు చేస్తున్నది. మిగతా 12 శాతాన్ని మేనేజిమెంటు ఎల్ఐసి కి జమ చేసి దానిద్వారా వారికి ఒక పెన్షన్ స్కిమును ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నాము. కాని మేనేజిమెంటు ఆర్ధిక పరిస్థితి బాగు లేదనే పేరుతొ 12 శాతం కాదు, 3శాతమే ఇస్తానంటున్నది.
2013 సెప్టెంబరులో పార్లమెంటరి కమిటి చేసిన సిఫార్సు ప్రకారం ఇపిఎస్ స్కీము క్రింద ఇచ్చే కనీస పెన్షన్ ను రు. 3000 కు పెంచాలని,ఇందుకు ఇపిఎస్ స్కిముకు ప్రభుత్వ కంట్రిబ్యుషన్ నుబేసిక్ పె లో 1.16 శాతం నుండి 8.33 శాతం కు పెంచాలని2013 సెప్టెంబరులో పార్లమెంటరి కమిటి చేసిన సిఫార్సు చేసింది. కాని యుపిఎ ప్రభుత్వము ఇందుకు అంగీకరించలేదు. ఇది అన్యాయమని,తాము ఈ కనీస పెన్షన్ రు.3000 వుండాలని కోరుతున్నామని బిజెపి ఎన్నికలకి ముందు అన్నది. కాని ఎన్నికలలో గెలిచి అధికారం లోకి వచ్చిన తరువాతరు.3000 కనీస పెన్షన్ అమలు సాధ్యం కాదంటున్నది.ప్రభుత్వోద్యోగుల పెన్షన్ కు ప్రమాదం తెస్తున్న నూతన పెన్షన్ విధానాన్ని రద్దు చేసే బదులు మరింత పట్టుదలగా అమలు చేస్తున్నది. ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులందరికీ డిపిఇ గైడ్ లైన్స్ ప్రకారం అమలు చేయాల్సిన 30 శాతం రిటైర్మెంట్ బెనిఫిట్సు అమలుకు నిరాకరిస్తున్నది.
కార్మికులందరికీ గ్యారంటి పెన్షన్ విధానం వుండాలని, సంఘటిత అసంఘటిత కార్మికులందరికీ అది వర్తించాలని, ఇపిఎస్ కాని మరి ఏ ఇతర పథకం ప్రకారం కాని ఇచ్చే పెన్షన్ కనీసం రు.3000కు తగ్గకుండా వుండాలని, 1.1.2004 తరువాత రిక్రూట్ అయినప్రభుత్వ ఉద్యోగులకు నూతన పెన్షన్ విధానం రద్దు చేసి వారికి కూడా ప్రభుత్వ పెన్షన్ విధానం వర్తింపజేయాలని, తద్వారా ప్రభుత్వ పెన్షన్ విధానానికి గ్యారంటి ఇవ్వాలని, బిఎస్ఎన్ఎల్ మరియు ఇతర ప్రభుత్వ రంగ సంస్థల్లో రిక్రూట్ అయిన వారికి డిపిఇ గైడ్ లైన్స్ ప్రకారం 30 శాతం రిటైర్మెంట్ బెనిఫిట్సు వర్తింపజేసే విధముగా పెన్షన్ విధానం రూపొందించాలని కార్మిక సంఘాలు కోరుతున్నాయి.

సమ్మె హక్కు కోసం సమ్మె....


తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు 12 లక్షల మంది 16 డిమాండ్ల సాధన కోసం 2003 జులై 3 నుంచి నిరవధిక సమ్మెకు పిలుపునిచ్చారు. జూన్‌ 30 అర్ధరాత్రి నుండే జయలలిత ప్రభుత్వం కార్మిక, ఉద్యోగ నాయకులందరినీ అరెస్టు చేసింది. సమ్మె చేస్తున్న వారి స్థానంలో కొత్త వారిని రిక్రూట్‌ చేసే ప్రయత్నం జరిగింది. హైకోర్టు సమ్మె ప్రారంభించినందుకు ఉద్యోగులను క్షమాపణ చెప్పాలని కోరింది. సుప్రీంకోర్టు ఉద్యోగులు సమ్మె చేయడం తప్పని తమిళనాడు ప్రభుత్వ నిరంకుశ చర్యలను అభినందించింది. దోపిడీదార్లు, వారి తాబేదార్లయిన పాలక వర్గాలు ఆనందం వ్యక్తం చేశాయి. దీనిపై దేశవ్యాప్తంగా కార్మిక వర్గం ఆగ్రహం వ్యక్తం చేసింది. 2004 ఫిబ్రవరి 24న మరో దేశవ్యాప్త సమ్మె జరిగిన నేపథ్యమది. సమ్మె హక్కు జన్మహక్కనే నినాదంతో దేశంమంతా హోరెత్తింది. బియంఎస్‌ మినహా మిగిలిన కార్మిక సంఘాలు ఈ సమ్మెలో పాల్గొన్నాయి. 2003 సెప్టెంబర్‌ 26న ఢిల్లీలో కేంద్ర కార్మిక సంఘాల సదస్సులో ఈ నిర్ణయం జరిగింది. 2004 జనవరి మొదటి వారంలో ఐయన్‌టియుసి కార్యాలయంలో దాని జాతీయ అధ్యక్షులు సంజీవరెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో సమ్మె నిర్ణయం చేసినా, తరువాత ఐఎన్‌టియుసి ప్లేటు ఫిరాయించింది. ఐఎన్‌టియుసి, టిఎన్‌టియుసి, హెచ్‌ఎంఎస్‌, బియంఎస్‌ ఈ సమ్మెలో పాల్గొనక పోయినా జయప్రదంగా దేశవ్యాప్త సమ్మె జరిగింది. ఐదు కోట్ల మంది ఈ సమ్మెలో పాల్గొనడం విశేషం.

* * ** సెప్టెంబరు 02 న * * * * * * * అఖిల భారత కార్మిక సమ్మెను జయప్రదం చేయండి



* * ** సెప్టెంబరు 02 న * * * * * * * అఖిల భారత కార్మిక సమ్మెను జయప్రదం చేయండి కదలండోయి - కదలండోయి అఖిల భారత సమ్మె నగారా మ్రోగింది కల్సి మెల్సి రారండోయి కార్మికులంతా ఒకటని చాటండి కులములు వద్దు, మతములు వద్దు ఐక్యం గుంటే మనమే ముందు కలవండోయి - కలవండోయి అఖిల భారత సమ్మె నగారా మ్రోగింది పెరిగే ధరలు - మండే గుండెలు కాలే కడుపులు - ఖాళీ జేబులు కాలేవా కత్తి కటారులు కదలండోయి - కదలండోయి అఖిల భారత సమ్మె నగారా మ్రోగింది చాలీ చాలని జీతాలు -తీరీ తీరని రోగాలు రగిలించవా నీలో నిప్పు కణాలు కదలండోయి - కదలండోయి అఖిల భారత సమ్మె నగారా మ్రోగింది తెరిపిద్దాం - సర్కారు కళ్లు తెరిపిద్దాం మోడీ మంత్రాలయంలో పిడుగులు కురిపిద్దాం. . . . . . . . . . . . . . . . . . . . . . . . . అఖిలభారత కార్మిక సమ్మె అంటే భారత కార్మికవర్గ చైతన్యానికి నిదర్శనం. ................................................ ' పని చేసే వాడికి ఎవ్వడూ పది రూకలు ఎక్కువ ఇవ్వడు పది రోజులు విశ్రాంతి ఇవ్వడు పని చేసే వాడే అడగాలి .... అది వాడి హక్కుగా పొందాలి. .. అందుకు సమ్మెలే ఆయుధం కావాలి.

హక్కులు కాపాడేందుకే సమ్మె : గఫూర్‌

- కర్నూలు చేరిన కార్మిక సంఘాల బస్సు యాత్ర

కార్మికుల హక్కులను కాపాడుకునేందుకు సెప్టెంబర్‌ 2న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంఏ గఫూర్‌ పిలుపునిచ్చారు. సమ్మె విజయవంతానికి అనంతపురం జిల్లా హిందూపురంలో ప్రారంభమైన కార్మిక సంఘాల బస్సు యాత్ర మంగళవారం కర్నూలు జిల్లా కేంద్రా నికి చేరింది. సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పిఎస్‌ రాధాకృష్ణ, ఎఐటియుసి జిల్లా కార్యదర్శి మునెప్ప అధ్యక్షతన జరిగిన సభలో గఫూర్‌ మాట్లాడారు. కార్మికుల హక్కులు కాలరాస్తే కార్మికులు పిడికిలి బిగించి పోరాడాలన్నారు. ఎఐటియుసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఓబులేసు మాట్లాడుతూ, ఈ సమ్మె నరేంద్రమోడీకి హెచ్చరిక కావాలన్నారు. సభలో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు టి.షడ్రక్‌, కందారపు మురళి, జిల్లా కార్యదర్శి కె.ప్రభాకర్‌రెడ్డి పాల్గొన్నారు.

సంస్కరణల పేరుతో కార్మిక హక్కులు హరిస్తే సహించం

  కేంద్ర ప్రభుత్వం సంస్కరణల పేరుతో కార్మిక హక్కులను హరిస్తే సహించేదిలేదని సిఐటియు రాష్ట్ర నాయకులు మురళీ, ఎఐటియుసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఓబులేసు హెచ్చరించారు. అన్ని కార్మిక సంఘాల రాష్ట్ర నాయకుల ఆధ్వర్యంలో చేపట్టిన బస్సుయాత్ర మంగళవారం ఆళ్లగడ్డకు చేరుకుంది. ఈ బస్సుయాత్రకు కార్మికులు నాలుగు రోడ్ల కూడలిలో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ప్రభుత్వ విధానాలపై 24 ఏళ్లలో భారత శ్రామికవర్గం ఇంతవరకూ 15 సార్వత్రిక సమ్మెలను చేపట్టిందని తెలిపారు. ఈఏడాది సెప్టంబరు 2న తలపెట్టిన 16వ సార్వత్రిక సమ్మె మరో స్వాతంత్య్ర పోరాటంగా ఉంటుందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక, ప్రజావ్యతిరేక విధానాలను అవలంభిస్తున్నాయన్నారు. టియుసిసి నాయకులు సుందర రామరాజు, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పిఎస్‌ రాధాకృష్ణ, ఐఎఫ్‌టియు రాష్ట్ర అధ్యక్షులు ప్రసాద్‌, ఎఐటియుసి జిల్లా ఉప ప్రధాన కార్యదర్శి మురళీధర్‌, యుఇఇయు జిల్లా ఉపాధ్యక్షులు శ్రీనివాసులు, సిఐటియు ఆళ్లగడ్డ నాయకులు శ్రీధర్‌, వైఎస్‌ఆర్‌టియు నాయకులు రమణ, ఆటో యూనియన్‌ నాయకులు మౌలాలి, నగర పంచాయతీ పారిశుధ్య సంఘం నాయకులు రత్నం, జయరాముడు, నరసరాముడు, ఆశావర్కర్లు వరలకిë, చిన్నక్క బేగం పాల్గొన్నారు.

కార్మిక వేతిరేఖ విధానాలపై గుంతకల్లులో మాట్లాడుతున్నా CITU రాష్ట్ర కార్యదర్శి MAగఫూర్ గారు



Monday, 17 August 2015

ప్రభుత్వాల కార్మిక వ్యతిరేక విధానాలపై పోరాటం...



కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆర్థిక వ్యతిరేక విధానాలకు నిరసనగా 12 డిమాండ్ల సాధనకే కేంద్ర కార్మిక సంఘాలు, ఉద్యోగ సమస్యల పిలుపు మేరకు సెప్టెంబర్‌ 2న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెతో పోరాటం చేపట్టనున్నట్లు కార్మిక సంఘాల రాష్ట్ర నాయకులు పిలుపునిచ్చారు. సోమవారం పట్టణంలోని అంబేద్కర్‌ సర్కిల్‌ వద్ద బస్సుయాత్ర చేరుకుంది. ఈ సందర్భంగా కార్మికులు పెద్దఎత్తున స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గఫూర్‌ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, కార్మికుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని చెప్పారు. ముఖ్యంగా ధరల నియంత్రణ, నెలకు కనీస వేతనం రూ.15వేలు, కార్మిక చట్టాల అమలు, చట్ట సవరణల నిలుపుదల, కాంట్రాక్ట్‌, క్యాజువల్‌ ఔట్‌ సోర్సింగ్‌ నియామకాల క్రమ బద్ధీకరణ, చిల్లర వర్తకంలో విదేశీ పెట్టుబడులను వ్యతిరేకిస్తూ తదితర డిమాండ్లతో సమ్మె నిర్వహిస్తున్నామన్నారు. ఈ సమ్మెకు పెద్దసంఖ్యలో కార్మికులు పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా నాయకులు ఓబులు, హరి, రమేష్‌, వైసిపి నాయకులు హుసేన్‌పీరా, ఆదినారాయణ రెడ్డి, ఐఎన్‌టియుసి నాయకులు రమణ, మాణిక్యం మనోహర్‌, ఎఐటియుసి నాయకులు ఓబులేశు, రాజారెడ్డి, శకుంతలమ్మ, శ్రీనివాసులు, ఎఐటి యుసి నాయకులు సుధీర్‌, ఐఎఫ్‌టియు నాయకులు ప్రసాద్‌, స్థానిక నాయకులు నాగరాజు, ఓబులేశు, బావమ్మ, ఎఐటియుసి డివిజన్‌ నాయకులు శ్రీరాములు, అంగన్‌వాడీ కార్యకర్తలు, గ్రామ పంచాయతీ కార్మికులు, ఎస్‌ఎఫ్‌ఐ విద్యార్థి సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్‌ నాయకుడు సిక్బతుల్లా మద్దతు పలికారు.

సిఐటియు ఆధ్వర్యంలో వేతనాలు సాధింకున్న కార్మికులు...

 సిఐటియు ఆధ్వర్యంలో ఆర్‌డబ్ల్యుఎస్‌ బాపురం స్కీం కాంట్రాక్టు కార్మికులు పెండింగ్‌ వేతనాలను సోమవారం సాధించుకున్నారు. ఈ సందర్భంగా సిఐటియు అధ్యక్ష కార్యదర్శులు సత్యనారయణ, కెపి నాయరణలు మాట్లాడారు. కాంట్రాక్టు కార్మికుల చేపట్టిన ఆందోళనకు, ఉద్యమాకు సిఐటియు అండగా నిలిచి పోరాడినందునే ఈ రోజు పెండింగ్‌లో ఉన్న వేతనాలు సాధించుకున్నారన్నారు. ప్రస్తుతం 5 నెలల వేతనాలు 30 మంది కార్మికులు పంపిణీ చేశారన్నారు. మిగత రెండు నెలల వేతనాలు బిల్లులు మంజూరు అయ్యాక పంపిణీ చేస్తామని చెప్పారన్నారు. సిఐటియు సమ్మెతోనే ప్రభుత్వం దిగొచ్చింద న్నారు. జీవో ప్రకారం ఖచ్చితంగా వేతనాలు అందేలా చూడాలన్నారు. కార్మికుల ఇవ్వాల్సిన అన్ని ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో నాయకులు రమేష్‌బాబు, కాజీ లింగప్ప, రామకృష్ణ కార్మికులు ఉన్నారు.

మరో స్వాతంత్య్ర పోరాటానికి సిద్ధం కండి....

- సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గఫూర్‌  - అనంతకు చేరిన కార్మిక సంఘాల రాష్ట్ర బస్సుజాతా

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికులకు వ్యతిరేకంగా చేస్తున్న చట్ట సవరణలను నిరసిస్తూ మరో స్వాతంత్య్ర పోరాటానికి సిద్ధం కావాలని ప్రజలకు సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గఫూర్‌, ఎఐటియుసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఓబులేషులు పిలుపునిచ్చారు. సోమవారం సెప్టెంబరు రెండో తేదీన జరిగే దేశ వ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని చేపట్టిన బస్సుజాతాను సోమవారం అనంతపురం జిల్లా హిందూపురానికి చేరుకుంది. ఈ బస్సుజాతాను అనంపురం జిల్లా సిఐటియు ప్రధాన కార్యదర్శి ఓబులు, ఎఐటియుసి ప్రధాన కార్యదర్శి రాజారెడ్డిలు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో వారు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొస్తున్నకార్మిక చట్ట సవరణలకు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా ఉన్న జాతీయ కార్మిక సంఘాలతోపాటు ఆయా రాష్ట్రాల్లో ఉన్న కార్మిక సంఘాలు, సమైక్యం చేసుకుని సెప్టంబర్‌ 2వ తేదీన దేశ వ్యాప్త సమ్మె 



స్వాతంత్య్రోద్యమంలా సెప్టెంబర్‌ 2 సమ్మె....

- సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గఫూర్‌
- కార్మికచట్టసవరణను వ్యతిరేకించాలని పిలుపు
- హిందూపురంలో రాష్ట్ర బస్సుజాతా ప్రారంభం

దేశవ్యాప్తంగా సెప్టెంబర్‌2న చేపట్టే సార్వత్రిక సమ్మెను మరో స్వాతంత్య్ర పోరాటంలా నిర్వహించాలని సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంఏ గఫూర్‌ పిలుపునిచ్చారు. సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని కోరుతూ చేపట్టిన బస్సుజాతా సోమవారం అనంతపురం జిల్లా హిందూపురంలో ప్రారంభమైంది. అనంతపురం జిల్లా సిఐటియు ప్రధాన కార్యదర్శి ఓబులు, ఎఐటియుసి ప్రధాన కార్యదర్శి రాజారెడ్డి హిందూపురంలో జాతాను జెండా ఊపి ప్రారంభించారు. పెనుకొండ, 
అనంతపురం, గుత్తి, గుంతకల్లు మీదుగా యాత్ర కర్నూలు జిల్లాలోకి ప్రవేశించింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో గఫూర్‌ మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల సమస్యలను విస్మరించాయని ధ్వజమెత్తారు. ఈ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా ఉన్న జాతీయ కార్మిక సంఘాలన్నీ ఐక్యమై సెప్టెంబర్‌ 2న నిర్వహించే సమ్మెను జయప్రదం చేయాలని కోరారు. 24 యేళ్లలో భారత శ్రామిక వర్గం 15 సార్లు సార్వత్రిక సమ్మేచేపట్టిందన్నారు. ఈ ఏడాది సెప్టెంబర్‌ 2న తలపెట్టిన 16వ సార్వత్రిక సమ్మె మరో స్వాతంత్య్ర పోరాటంగా ఉంటుందన్నారు. మొత్తం 16 డిమాండ్లతో సమ్మె తలపెట్టినట్టు తెలిపారు. ధరల నియంత్రణ, కనీసవేతనం నెలకు రూ.15వేలు, కార్మిక చట్టాల సక్రమ అమలు, చట్ట సవరణలు చేయవద్దని, తదితర డిమాండ్లు ఉన్నాయని చెప్పారు. ఎఐటియుసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఓబులేషు మాట్లాడుతూ రాష్ట్రంలోనే హిందూపురం నియోజకవర్గానికి ఒక ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు. ఇక్కడ పారిశ్రామికవాడలోని ఏ పరిశ్రమలోనూ కార్మిక చట్టాలు అమలు కావడం లేదన్నారు. స్థానిక శాసన సభ్యులు నందమూరి బాలకృష్ణ ఈ విషయాలను ముఖ్యమంత్రి దృష్టికి ఎందుకు తీసుకెళ్లడంలేదని ప్రశ్నించారు. మహిళా కార్మికులతో వెట్టిచాకిరీ చేయించుకుంటున్నారని, జిల్లాలో మహిళా మంత్రి ఉన్నప్పటికీ వీటిపై స్పందించటం లేదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్‌టియు నాయకులు ఉపేంద్ర, టియుసిసి సుందర్‌ రామరాజు, ఐఎన్‌టియుసి రమణ, వైఎస్‌టియుసి కొర్రపాడు హుసేన్‌, ఎపియుడబ్ల్యుజెఎఫ్‌ మల్లికార్జున ప్రసాద్‌, వైఎస్సార్‌టియుసి ఆదినారాయణరెడ్డి పాల్గొన్నారు.

సెప్టెంబర్ 2న సమ్మెలో గళమెత్తాలి..........

హిందూపూర్ బస్ జాతాలో సి ఐ టి యు రాష్ట ప్రదాన కార్యదర్శి ఎంఎ గఫూర్‌......
సరళీకరణ ఆర్థిక విధానాలకూ, ప్రభుత్వ రంగ సంస్థల వాటాల విక్రయానికీ, ఎఫ్‌డిఐ వంటి వాటికి వ్యతిరేకంగానూ, కార్మిక హక్కుల పరిరక్షణ కోసమూ 2న ఈ సమ్మె జరుగుతుందన్నారు. పెట్టుబడిదారులకు ఇప్పటివరకూ కలగా ఉన్న కార్మిక చట్టాల మార్పుపైనే మోడీ ప్రభుత్వం ప్రధాన దృష్టిని కేంద్రీకరించిందని, ఉద్యోగుల నియామకం, తొలగింపులో పూర్తి స్వేచ్ఛను యాజమాన్యాలకు ధారదత్తం చేసే నిర్ణయాలు చేసిందనీ విమర్శించారు.

Friday, 14 August 2015

సెప్టెంబర్‌ 2న దేశ వ్యాప్త సమ్మె సందర్భంగా 'శ్రామిక జన శంఖారావం' ప్రచార గీతాలు

అఖిల భారత సమ్మెలు సంస్కరణలకు బ్రేకులు...

- కారుసాల శ్రీనివాసరావు 

''ఇప్పటి వరకూ జరిగిన మానవ చరిత్ర అంతా వర్గ పోరాటాల చరిత్రే'' అని మార్క్ప్‌ మహానీయుడు నిర్వచించాడు. బానిసలు-బానిస యజమానులు, ప్యూడల్‌ ప్రభువులు-రైతాంగానికి మధ్య జరిగిన పోరాటాలు చరిత్రగతినే మార్చివేశాయి. ప్రస్తుతం నడుస్తున్న పెట్టుబడి దారీయుగంలోనూ కార్మిక వర్గపోరాటాలకు అత్యంత ప్రాధాన్యత ఉంది. భారత కార్మికవర్గం కూడా ఉన్నత పోరాట లెన్నింటినో నిర్వహించింది. 1862 హౌరా రైల్వే కార్మికులు ఎనిమిది గంటల పనికోసం ప్రారంభించిన తొలి సమ్మెతో కార్మిక వర్గం దుర్భరమైన పని పరిస్థితులపై సమరశంఖం పూరించింది. 1908లో స్వాతంత్య్ర సమరయోధుడు బాలగంగాధర తిలక్‌ అరెస్టుకు నిరసనగా బొంబాయిలో ఆరు రోజులు జరిగిన సమ్మె నుంచి ప్రారంభించి నేటి వరకూ తమ ఆర్థిక కోర్కెల పైనే కాక దేశ ప్రయోజనాల పరిరక్షణ కోసం కార్మికవర్గ పోరాడుతూ వచ్చింది. 1990 నుంచి ప్రారంభమైన నూతన ఆర్థిక విధానాలపై నిర్వహించిన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెల్లో కూడా అదే పోరాట స్ఫూర్తి కనపడుతుంది.
1990లో తొలి సోషలిస్టు రాజ్యం కూలిపోవటంతో ప్రపంచ కార్మికోద్యమానికి పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. సామ్రాజ్యవాదం బహుళజాతి సంస్థల ప్రయోజనాల కోసం ప్రపంచీకరణ పేరుతో కార్మికవర్గంపై దోపిడీకి తెగబడింది. ప్రపంచ కార్మికవర్గానికి నూతన సవాల్‌ ఎదురైన సమయంలో భారత కార్మికవర్గం ఆ సవాలును స్వీకరించి పోరాటాలకు సన్నద్ధమైంది. 1990వ దశకంలో మారిన ప్రపంచ పరిస్థితుల్లో మన దేశంలో సరళీకరణ విధానాలు అమలు జరుగుతున్నాయి. ఈ విధానాలపై భారత కార్మికవర్గం తిరుగుబాటు చేస్తూనే ఉంది. సంస్కరణలు ప్రారంభించిన తొలి సంవత్సరంలోనే అఖిల భారత సమ్మెకు కార్మిక వర్గం ప్రచారం చేస్తున్నా తన ప్రయోజనాలతోపాటు దేశంలోని ఇతర కష్టజీవుల ప్రయోజనాల కోసం కూడా అఖిల భారత సమ్మెలు ఉపయోగపడ్డాయి. సమ్మె డిమాండ్లు ప్రజల చైతన్యం పెంపుదలకు, సంస్కరణలపై చర్చకు దోహదపడ్డాయి.
పివి రాగం మన్మోహన్‌ తాళం
1991 జూన్‌ 21న పివి నరసింహారావు ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. మన్మోహన్‌సింగ్‌ను ఐఎంఎఫ్‌ నుంచి దిగుమతి చేసి ఆర్థిక మంత్రిగా నియమించారు. జూన్‌ 25న నూతన పారిశ్రామిక విధాన ప్రకటనతో కార్మికవర్గంపై దాడి ప్రారంభమైంది. ప్రైవేటీకరణ తారకమంత్రంగా ప్రచారం మొదలు పెట్టింది. దీని ఆచరణకు ప్రారంభంగా ఉత్తరప్రదేశ్‌లోని దల్లా సిమెంటు ఫ్యాక్టరీని దాల్మియా కంపెనీకి అమ్మకానికి ప్రయత్నం జరిగింది. రూ.700 కోట్ల విలువైన ఆ పరిశ్రమను రూ.26 కోట్లకు అమ్మడానికి ప్రభుత్వం ప్రయత్నించగా కార్మికులు తీవ్రంగా ప్రతిఘటించారు. ఆరు వేల మంది కార్మికులు పోరాటంలో పాల్గొన్నారు. పోలీసు కాల్పుల్లో 14 మంది మరణించారు. ప్రైవేటీకరణకు తొలి బ్రేకు పడింది. ప్రభుత్వం తన నిర్ణయాన్ని ఉపసంహరించుకుంది. కార్మిక వర్గం తొలి విజయం సాధించింది. 1991 సెప్టెంబర్‌ 21న తొలిసారిగా సంస్కరణలపై భారత కార్మిక సంఘాలు సమర భేరీ మోగించాయి. కోటి మంది ఈ సమ్మెలో పాల్గొన్నారు. 1992 జూన్‌ 16న మరో దేశవ్యాప్త సమ్మె జరిగింది. ఇందులో కోటీ 40 లక్షల మంది పాల్గొన్నారు. 1992 నవంబర్‌ 11న న్యూఢిల్లీలో అతి పెద్ద కార్మిక ప్రదర్శన జరిగింది. 1993 ఆగస్టు 19న జైల్‌భరో కార్యక్రమం జరిగింది. ఏప్రిల్‌ 15న జరిగిన జాతీయ సదస్సులో 1993 సెప్టెంబర్‌ 9న దేశవ్యాప్త సమ్మెకు పిలుపుఇవ్వబడింది. 1994లో ప్రజాసంఘాల ఐక్యవేదిక సారథ్యంలో ఆగస్టు 15న ప్రతిజ్ఞా దినం పాటించబడింది. ఆ మరురోజే శాసనోల్లంఘన ఉద్యమం జరిగింది. సెప్టెంబర్‌ 29 సమ్మెలో దేశవ్యాప్త కార్మికవర్గం పాల్గొంది. 1996 ఫిబ్రవరి 23న నూతన పెన్షన్‌ పథకానికి వ్యతిరేకంగా సమ్మె జరిగింది.
బిజెపి ప్రభుత్వ హయాంలో...
దేశంలో అనేక ప్రాంతాలలో మత ఉద్రిక్తతలు రెచ్చగొట్టటం ద్వారా 1998 మార్చి 19న కేంద్రంలో ఎన్‌డిఎ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్‌ అనుసరించిన విధానాలలో మార్పువస్తుందని ఆశించిన కార్మికవర్గ ఆశలు వమ్మయ్యాయి. ఏకంగా ప్రభుత్వ రంగం సంస్ధల అమ్మకానికి ఒక మంత్రినే కేటాయించిన ఘనత బిజెపి ప్రభుత్వానిది. 1998 డిశంబర్‌ 11న సమ్మె జరిగింది. నాలుగు కోట్ల మంది ఆ సమ్మెలో పాలొన్నారు.1999 అక్టోబరు 28న బీమా రంగాన్ని ప్రైవేయిటీకరించే ఐఆర్‌డిఎ బిల్లు లోక్‌సభలో ప్రవేశపెట్టింది. బీమారంగ ఉద్యోగులు దీనికి వ్యతిరేకంగా వినూత్న పోరాటాన్ని నిర్వహించారు. 200 మంది లోక్‌సభ సభ్యులతో పాటు కోటీ యాభై లక్షల సంతకాలు ప్రజల నుంచి సేకరించి స్పీకర్‌కు సమర్పించారు. 1993లో మల్హోత్రా కమిటీ సిఫారసులను పాక్షికంగా తిప్పికొట్టారు. 2000 మే 11న దేశవ్యాప్త సమ్మె జరిగింది. దీనికి ముందుగా 56 జాతీయ ప్రజాసంఘాల ఐక్యవేదిక పిలుపు మేరకు మార్చి 9న ఢిల్లీలో మహా ప్రదర్శన జరిగింది. 2002 ఏప్రిల్‌ 16న జరిగిన జాతీయ సమ్మెకు ఏడు కేంద్ర కార్మిక సంఘాలు, 55 ఫెడరేషన్లు పిలుపునిచ్చాయి. 2002 మార్చి 5న ఢిల్లీలో జరిగిన సమావేశంలో సమ్మె నిర్ణయం జరిగింది. ప్రజాసంఘాల జాతీయ ఐక్యవేదిక(ఎన్‌పిఎంఒ) ఈ సమ్మెను బలపర్చింది. కోటిన్నర మంది ఈ సమ్మెలో పాల్గొన్నారు. రెండవ దశ సంస్కరణల పేరుతో ప్రభుత్వం రంగ సంస్థల పెట్టుబడుల ఉపసంహరణ, ఉద్యోగాల కుదింపు, విఆర్‌ఎస్‌, తొలగింపులు, పిఎఫ్‌ వడ్డీరేటు తగ్గింపు, ట్రేడ్‌ యూనియన్ల హక్కుల నిరాకరణ మొదలగు సమస్యలపై ఈ సమ్మె ప్రధాన డిమాండ్లు. 2003 మే 21న మరో దేశవ్యాప్త సమ్మె జరిగింది. దానికి ముందుగా ఫిబ్రవరి 26న చలో ఢిల్లీ కార్యక్రమం జరిగింది. ఐఎన్‌టియుసి, బియంఎస్‌ ఈ సమ్మెకు దూరంగా ఉన్నాయి. లాభాలను ఆర్జిస్తున్న ప్రభుత్వరంగం సంస్థల ప్రైవేటీకరణ ఆపాలని, యాజమాన్యాలకు అనుకూలంగా కార్మిక చట్టాల్లో మార్పులు చేయరాదని, వ్యవసాయ కార్మికుల కోసం సమగ్ర చట్టం చేయాలని, దిగుమతులపై ఆంక్షలు విధించాలని, బోనస్‌ సీలింగ్‌ ఎత్తివేయాలని, పిఎఫ్‌ వడ్డీరేటు 12 శాతానికి పెంచాలని కార్మిక సంఘాలు డిమాండ్‌ చేశాయి.
సమ్మె హక్కు కోసం సమ్మె
తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు 12 లక్షల మంది 16 డిమాండ్ల సాధన కోసం 2003 జులై 3 నుంచి నిరవధిక సమ్మెకు పిలుపునిచ్చారు. జూన్‌ 30 అర్ధరాత్రి నుండే జయలలిత ప్రభుత్వం కార్మిక, ఉద్యోగ నాయకులందరినీ అరెస్టు చేసింది. సమ్మె చేస్తున్న వారి స్థానంలో కొత్త వారిని రిక్రూట్‌ చేసే ప్రయత్నం జరిగింది. హైకోర్టు సమ్మె ప్రారంభించినందుకు ఉద్యోగులను క్షమాపణ చెప్పాలని కోరింది. సుప్రీంకోర్టు ఉద్యోగులు సమ్మె చేయడం తప్పని తమిళనాడు ప్రభుత్వ నిరంకుశ చర్యలను అభినందించింది. దోపిడీదార్లు, వారి తాబేదార్లయిన పాలక వర్గాలు ఆనందం వ్యక్తం చేశాయి. దీనిపై దేశవ్యాప్తంగా కార్మిక వర్గం ఆగ్రహం వ్యక్తం చేసింది. 2004 ఫిబ్రవరి 24న మరో దేశవ్యాప్త సమ్మె జరిగిన నేపథ్యమది. సమ్మె హక్కు జన్మహక్కనే నినాదంతో దేశంమంతా హోరెత్తింది. బియంఎస్‌ మినహా మిగిలిన కార్మిక సంఘాలు ఈ సమ్మెలో పాల్గొన్నాయి. 2003 సెప్టెంబర్‌ 26న ఢిల్లీలో కేంద్ర కార్మిక సంఘాల సదస్సులో ఈ నిర్ణయం జరిగింది. 2004 జనవరి మొదటి వారంలో ఐయన్‌టియుసి కార్యాలయంలో దాని జాతీయ అధ్యక్షులు సంజీవరెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో సమ్మె నిర్ణయం చేసినా, తరువాత ఐఎన్‌టియుసి ప్లేటు ఫిరాయించింది. ఐఎన్‌టియుసి, టిఎన్‌టియుసి, హెచ్‌ఎంఎస్‌, బియంఎస్‌ ఈ సమ్మెలో పాల్గొనక పోయినా జయప్రదంగా దేశవ్యాప్త సమ్మె జరిగింది. ఐదు కోట్ల మంది ఈ సమ్మెలో పాల్గొనడం విశేషం.
మన్మోహన్‌ ప్రభుత్వ హయాంలో...
2005 సెప్టెంబర్‌ 29న మరో జాతీయ సమ్మె జరిగింది. అసంఘటితరంగ కార్మికుల సమగ్ర చట్టం చేయాలని, గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఉపాధి హామీ పథకం అమలు చేయాలని, నియామకాలపై నిషేధం ఎత్తి వేయాలని, కాంట్రాక్టీకరణ నిలుపుదల చేయాలని, లైంగిక వేధింపలుు అరికట్టాలని, ప్రభుత్వరంగ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణ నిలిపివేయాలని, విద్యుత్‌ బోర్డులను విడగొట్టడం ఆపాలని, సమ్మె హక్కు చట్టబద్ధం చేయాలనే డిమాండ్లతో ఈ సమ్మె జరిగింది. 124 విమానాశ్రయాల్లో పని చేసే ఉద్యోగులు కొత్తగా ఈ సమ్మెలో కలవడం గమనించదగ్గ విషయం. 2006 డిసెంబరు 14న జరిగిన జాతీయ సమ్మెలో అత్యధికంగా 10 కోట్ల మంది పాల్గొన్నారు. 2008 ఆగస్టు 20న ట్రేడ్‌ యూనియన్ల స్పాన్సరింగ్‌ కమిటీ పిలుపు మేరకు జరిగిన ఈ సమ్మెలో ఐఎన్‌టియుసి, బిఎంఎస్‌ మినహా మిగిలిన కార్మిక సంఘాలన్నీ పాల్గొన్నాయి. 2010 సెప్టెంబరు 7వ దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె జరిగింది. 2012 ఫిబ్రవరి 28న మరో జాతీయ సమ్మె జరిగింది. ఐఎన్‌టియుసి, బియంఎస్‌తో సహా దేశవ్యాప్తంగా కార్మికవర్గం సమ్మెలో పాల్గొంది.
2013 ఫిబ్రవరి 20, 21 తేదీల్లో రెండు రోజుల పాటు జరిగిన అఖిల భారత సమ్మె మరొక ముఖ్య ఘటన. కేంద్ర కార్మిక సంఘాలన్నీ ఐఎన్‌టియుసి, బిఎంఎస్‌లతో సహా సమ్మెకు పిలుపునివ్వటం ఒక ప్రత్యేకత. అప్పటి వరకు జరిగిన 14 సార్వత్రిక సమ్మెలను మించి దేశ చరిత్రలో మొదటిసారిగా రెండు రోజుల సమ్మెకు పిలుపునిచ్చాయి. పైగా కార్మికుల వేతనాలు, సౌకర్యాలకు సంబంధించిన కోర్కెలకు పరిమితం కాకుండా ప్రభుత్వ విధానాలను ప్రశ్నించాయి. ఏమైనా ఈ అఖిల భారత సమ్మెలు సంస్కరణల వేగాన్ని అడ్డుకున్నాయి. అనేక ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడాయి. ఇప్పుడు మరోసారి కార్మికుల, కష్టజీవుల, రైతుల, కూలీల, సామాన్య ప్రజల హక్కుల కోసం సాగుతున్న పోరాటంలో సెప్టెంబర్‌ 2 సమ్మె ఒక పెద్ద ముందడుగుగా ఉండబోతోంది.

'శ్రామిక జన శంఖారావం' సిడి ఆవిష్కరణ....

సెప్టెంబర్‌ 2న దేశ వ్యాప్త సమ్మె సందర్భంగా సిఐటియు రాష్ట్ర కమిటీి 'శ్రామిక జన శంఖారావం' ప్రచార గీతాల సిడిని శుక్రవారం ఆవిష్కరించింది. యూనియన్‌ ఉపాధ్యక్షురాలు పి. రోజా, కోశాధికారి ఎవి నాగేశ్వరరావుతో కలిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంఏ గఫూర్‌ ఈ సిడిని ఆవిష్కరించారు. అనంతరం గఫూర్‌ విలేకరులతో మాట్లాడుతూ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు, రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ విధానాలపై 10 పాటలను రూపొందించి ఈ సిడిలో ఉంచామన్నారు. ప్రచార గీతాలతో రాష్ట్ర వ్యాప్తంగా సెప్టెంబర్‌ 2 సమ్మె ఆవశ్యకతను కార్మిక వర్గంలో పెద్ద ఎత్తున ప్రచారం చేయాలని సిఐటియు నిర్ణయించిందని, అందులో భాగంగానే ప్రజా నాట్యమండలి సహకారంతో ఈ పాటలను రూపొందించామని చెప్పారు. సెప్టెంబర్‌ 17 నుంచి 25 వరకు రాష్ట్ర వ్యాప్తంగా బస్సు జాతా నిర్వహించాలని కార్మిక సంఘాల ఐక్య వేదిక నిర్ణయించిందన్నారు. కేంద్ర ప్రభుత్వం అధికారంలో వచ్చిన్నప్పటి నుంచీ కార్మికులపై యుద్ధం ప్రకటించిన్నట్లుగా వ్యవహరిస్తోందని విమర్శించారు.. ఇఎస్‌ఐ, పిఎఫ్‌ వంటి పథకాలకు కోత పెట్టాలని కేంద్రం ఆలోచిస్తుందని, ట్రేడ్‌ యూనియన్లు ఏర్పాటు చేయకుండా, సమ్మె చేసే హక్కు లేకుండా చేసేందుకు యత్నిస్తోందని తెలిపారు. సమ్మె చేస్తే రూ.50 వేల నుంచి రూ. 6 లక్షలు జరిమానా విధించే విధంగా చట్టం చేయాలనే దుర్మార్గపు ఆలోచన కేంద్రం చేస్తుందన్నారు. అంగన్‌వాడీ, ఆశా, మధ్యాహ్న భోజనం, ఐకెపి తదితరాల్లో స్కీంల వర్కర్ల చేత అతి తక్కువ వేతనాలతో పని చేయించుకుంటోందన్నారు. దేశ వ్యాప్తంగా కార్మికులకు రూ.15వేలు కనీస వేతనం చెల్లించాలని, స్కీం వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, అసంఘటిత కార్మికులకు సామాజిక భద్రత కల్పించాలని, పథకాలకు అవసరమైన నిధులు కేటాయించాలని, అందరికీ పెన్షన్‌ కల్పించాలని, ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటాల ఉపసంహరణ ఆపాలి.. తదితర డిమాండ్లతో సెప్టెంబర్‌ 2న కేంద్ర కార్మిక సంఘాలు, వైెఎస్‌ఆర్‌టియు తదితర ఉద్యోగ సంఘాలు నిర్వహిస్తున్న సమ్మెలో కార్మిక వర్గం పాల్గొని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు.



Thursday, 6 August 2015

మున్సిపల్‌ కార్మికులు గొంతెమ్మ కోర్కెలు కోరుతున్నారా బాబూ..?

- న్యాయపరమైన డిమాండ్లు పరిష్కరించాల్సిందే.
- పుష్కరాల్లో వేలకోట్లు మింగేశారు
- మున్సిపల్‌ జాతాలో యూనియన్‌ నాయకులు 

 ఏళ్ల తరబడి గొడ్డి చాకిరి చేస్తూ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటూ అనారోగ్యాలపాలౌవుతున్నారు. న్యాయబద్ధంగా కనీస వేతనం రూ.15వేలు ఇవ్వాలి అంటూ వేడుకుంటున్నా కనికరించట్లేదు. ఏం కార్మికులు ఏమైనా గొంతెమ్మ కోర్కెలు కోరారా..? అంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును 'ఎ.పి. మునిసిపల్‌ వర్కర్స్‌, ఎంప్లాయీస్‌ యూనియన్‌ (సిఐటియు) రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు సామ్రాజ్యం, ఉమామ హేశ్వరరావు, నాయకులు శంకరరావు, వెంకట్‌రెడ్డిలు ప్రశ్నించారు. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న జాతా గురువారం గుడివాడకు చేరుకుంది. ఈ సందర్భంగా స్థానిక మునిసిపల్‌ కార్యాలయం వద్ద నిర్వహించిన సభలో వారు మాట్లాడారు. ప్రజానికాని ఆరోగ్యాన్ని కాపాడుతూ కార్మికులు తమ ఆరోగ్యాన్ని పాడుచేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్డులపై, డ్రైయిన్‌లపై మురుగును, చెత్తను చేతులతో తొలగించి సస్యామలంగా ఉంచుతున్న కార్మికులపై రాష్ట్ర ప్రభుత్వం జాలి చూపడం లేదన్నారు. 10వ పిఆర్‌సికి అనుగుణంగా ప్రతి ఒక్క కార్మికుడికి న్యాయ బద్ధంగా కనీస వేతనం రూ.15వేలు ఇవ్వాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేస్తామంటూ ప్రభుత్వానికి లేఖ ఇచ్చినా స్పందించలేదన్నారు. ప్రభుత్వం స్పందించకపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 45వేల మంది కార్మికులు సమ్మెలో వెళ్లడం జరిగిందన్నారు. సమ్మెను భగం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం పోలీసులతో లాఠీఛార్జీ, తెలుగు తమ్ముళ్లతో అరువు జగడాలు సృష్టించి అల్లర్లకె తెగబడిందన్నారు. వీటన్నింటిని లెక్కచేయకుంగా కార్మిక సంఘాల ఆధ్వర్యంలో సమ్మెను కొనసాగించడంతో ప్రభుత్వం వెన్నులో వణుకుపుట్టిందన్నారు. కార్మికులకు కనీస వేతనం రూ.15వేలు ఇస్తే కేవలం రూ.350కోట్లు చెల్లించినట్లేనన్నారు. ఈ రూ.350కోట్లు లేవని చెప్పే ప్రభుత్వం గోదావరి పుష్కరాలకు రూ.2 వేల కోట్లు ఖర్చు చేశామని దొంగ లెక్కలు పలికి ఆ డబ్బును ముఖ్యమంత్రి బాబు, స్థానిక నాయకులు మింగేశారని ఆరోపించారు. వచ్చే ఏడాది కృష్ణా పుష్కరాల కోసం దేశం నేతలు ఆవురావురమంటూ ఎదురు చూపులు చూస్తున్నారని పేర్కొన్నారు. మునిసిపల్‌ కార్మికుల న్యాయపరమైన సమస్యలను పరిష్కరించకపోతే సెప్టెంబర్‌ 2వ తేదీన జరిగే దేశవ్యాప్త ఉద్యమంలో ప్రభుత్వం మెడలు వంచడం ఖాయమని తేల్చిచెప్పారు. ఈ కార్యక్రమంలో డివిజన్‌ కార్యదర్శి ఆర్‌.సి.పి.రెడ్డి, పట్టణ కార్యదర్శి కైలా సుబ్బారావు, మునిసిపల్‌ కార్మికుల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

అంగన్‌వాడీ వేతనాల పెంపు....

అంగన్‌వాడీలు చేస్తున్న పోరాటం ఫలించింది. అంగన్‌వాడీ వర్కర్లకు, హెల్పర్లకు జీతాలు పెంచుతున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. వర్కర్లకు రూ. 4200 నుంచి రూ. 7100 వరకు, హెల్పర్లకు రూ. 2200 నుంచి రూ. 4600 వరకు, మినీ అంగన్‌వాడీలకు రూ. 2950 నుంచి రూ. 4600 వరకు పెంచినట్టు వెల్లడించింది. కొత్త వేతనాలు సెప్టంబర్‌ 1 నుంచి అమలులోకి రానున్నాయి. తీవ్ర సమస్యలతో కొట్టుమిట్టాడుతూ జీవనం సాగిస్తున్న తమకు వేతనాలు కనీసం రూ. 15 వేలకు పెంచాలని, ఇతర సమస్యలు పరిష్కరిం చాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్‌ అంగన్‌వాడీ వర్కర్స్‌, హెల్పర్స్‌ యూనియన్‌ (సిఐటియు) ఆధ్వర్యంలో రాష్ట్రంలోని అంగన్‌వాడీ వర్కర్లు, హెల్పర్లు ఉధృత పోరాటం సాగించిన సంగతి తెలిసిందే. అసెంబ్లీ సమావేశాల సమయంలో చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రభుత్వం ఎన్నో అడ్డంకులను, ఆంక్షలను విధించినప్పటికీ లెక్క చేయకుండా వేలాది మంది అంగన్‌వాడీలు హైదరాబాద్‌లో కదం తొక్కారు. పోరాటం ఉదృతంగా సాగుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వేతనాలు పెంచుతామని అసెంబ్లీ సమావేశాల్లో ప్రకటించారు. అంగన్‌వాడీ నేతలతో చర్చలు కూడా జరిపి సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ఆర్థిక మంత్రి యనమల నేతృత్వంలో మంత్రులు అచ్చెన్నాయుడు, పీతల సుజాత సభ్యులుగా ఒక కమిటీనే ఏర్పాటు చేశారు. ఈ కమిటీ గతంలో రెండు సార్లు భేటీ అయినా ఆశించిన ఫలితాలు వెలువడలేదు. కమిటీలతో ప్రభుత్వం కాలయాపన చేస్తోందని, వీలైనంత త్వరగా సమస్యను పరిష్కరించాలని అంగన్‌వాడీలు మరోమారు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేప ట్టారు. బుధవారం కూడా ఇదే అంశం మీద సిఎంవో అధికారులను, స్త్రీ శిశు సంక్షేమ అధికారులను కలిసి వినతి పత్రం కూడా సమర్పించారు. సమస్యలు పరిష్కరించకపోతే ఈ నెల 17న ఛలో విజయవాడ కార్యక్రమాన్ని చేపడుతామని హెచ్చరించారు. ఈ నేపధ్యంలో గురువారం భేటీ అయిన మంత్రి వర్గ ఉపసంఘం వేతనాలు పెంచుతున్నట్టు ప్రకటిం చింది. అయితే హెల్పర్లకు ఇవ్వాల్సిన రూ. 2950 ల్లో రూ. 750 గత కొన్ని నెలలుగా చెల్లించడం లేదు. ఈ బకాయిల మీద ప్రభుత్వం ఎలాంటి హామీ ఇవ్వ లేదు. 

రిటైర్‌మెంట్‌ బెనిఫిట్స్‌ తర్వాత చూద్దాం :మంత్రులు
అంగన్‌వాడీలకు రిటైర్‌మెంట్‌ బెనిఫిట్స్‌ గురించి ప్రస్తుతం ఏమీ ఆలోచన చేయలేదని, దాని మీద కూడా త్వరలో చర్చలు జరుపుతామని మంత్రులు అచ్చెన్నాయుడు, పీతల సుజాత తెలిపారు. భేటీ అనంతరం వారు సచివాలయంలో మాట్లాడుతూ అంగన్‌వాడీ వర్కర్లకు రూ. 4200 నుంచి రూ. 7100 వరకు, హెల్పర్లకు రూ. 2200 నుంచి రూ. 4600 వరకు, మినీ అంగన్‌వాడీ వర్కర్లకు రూ. 2950 నుంచి రూ. 4600 వరకు పెంచుతున్నట్టు ప్రకటించారు. కొత్తగా పెంచిన వేతనాలు సెప్టంబర్‌ 1వ తేదీ నుంచి అమలులోకి వస్తాయన్నారు. పెరిగిన వేతనాల వల్ల ప్రభుత్వానికి రూ. 317 కోట్లు భారం అధనంగా పడుతుం దన్నారు. అయితే చెల్లించాల్సిన బకాయిల మీద మంత్రులు మాట్లాడకపోవడం గమనార్హం. 

పెంచిన వేతనాలు గత ఏప్రిల్‌ నుంచి ఇవ్వాలి
అంగన్‌వాడీ వర్కర్స్‌, హెల్పర్స్‌ యూనియన్‌
అంగన్‌వాడీ కార్యకర్తల వేతనాల పెంపుదల పట్ల ఆంధ్రప్రదేశ్‌ అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ హర్షం వ్యక్తం చేసింది. ప్రభుత్వం ఇప్పటికైనా వాస్తవాలను గ్రహించిందని, యూనియన్‌ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జి బేబిరాణి, పి రోజా గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. మార్చిలో ఆందోళన చేసిన సందర్భంగా ముఖ్యమంత్రి హామీ ఇచ్చినందున 2015 ఏప్రిల్‌ నుంచి అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. వేతనాల పెంపులో మినీ వర్కర్లకు కేవలం రూ.1650 మాత్రమే పెంచారని, మెయిన్‌ వర్కర్స్‌కు మాదిరిగానే వారికీ వేతనం పెంచాలని కోరారు. రిటైర్‌మెంట్‌ బెనిఫిట్స్‌పైనా పునరాలోచించాలని విజ్ఞప్తి చేశారు. అంగన్‌వాడీలపై పెరిగిన పని భారం, ఐసిడిఎస్‌తో సంబంధంలేని అదనపు పనులు తదితర సమస్యలున్నందున యూనియన్లను చర్చలకు పిలిచి, వాటినీ పరిష్కరించాలని, పెరిగిన వేతనాలకు వెంటనే ఉత్తర్వులు జారీ చేయాలని వారు కోరారు.

Wednesday, 5 August 2015

'మున్సిపల్‌' సమస్యలపై నిర్లక్ష్యం తగదు

మున్సిపల్‌ కార్మికుల సమస్యలపౖౖె ప్రభుత్వ నిర్లక్ష్యం తగదని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు దడాల సుబ్బారావు పేర్కొన్నారు. బుధవారం కాకినాడలోని మున్సిపల్‌ కార్యాలయం వద్ద కార్మికుల జాతాను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం వేల కోట్ల రూపాయలను పుష్కరాల పేరుతో వృథా చేసిందన్నారు. మున్సిపల్‌ కార్మికులకు కనీస వేతనాలిచ్చేందుకు వెనకాడడం సరికాదన్నారు. మున్సిపల్‌ వర్కర్స్‌ యూనియన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ కాంట్రాక్టు వర్కర్లను రెగ్యులర్‌ చేయాలని కోరారు. పదో పిఆర్‌సి ప్రకారం జీతాలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. తొలుత సిఐటియు పతాకాన్ని యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షులు కె.సామ్రాజ్యం ఆవిష్కరించారు.

యాజమాన్యం మొండివైఖరి వీడాలి

- సిఐటియు డిమాండ్‌


 కెమికల్‌ పరిశ్రమ యాజమాన్యం మొండివైఖరి వీడాలని సిఐటియు రాష్ట్ర కార్యదర్శి వి.ఉమామహేశ్వరరావు డిమాండ్‌ చేశారు. పశ్చిమగోదావరి జిల్లా కాళ్ల మండలం జక్కరం మల్లికార్జున కెమికల్స్‌ పరిశ్రమలో తొలగించిన కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని కోరుతూ చేపట్టిన నిరవధిక నిరాహార దీక్ష బుధవారం మూడో రోజుకు చేరింది. శిబిరాన్ని సందర్శించిన ఉమామహేశ్వ రరావు మాట్లాడుతూ.. కార్మికుల వల్లే లాభాలు ఆర్జిస్తున్న యాజమాన్యం వారిని నిర్లక్ష్యం చేయడం తగదన్నారు. అదే వైఖరి కొనసాగితే అంతకంటే గట్టి పట్టుదలతో కార్మికులు తమ హక్కులను సాధించుకుంటా రని పేర్కొన్నారు. బాధితులకు సంఘీభావం తెలిపేందుకు వచ్చిన వివిధ యూనియన్లకు చెందిన సుమారు 500మంది కార్మికులను అభినందించారు. ఈ సందర్భంగా కార్మికులకు ఆయా కార్మిక సంఘాల ఆధ్వర్యాన రూ.12 వేలు ఆర్థిక సహాయాన్ని అందజేశారు. సిఐటియు జిల్లా నాయకులు జెఎన్‌వి గోపాలన్‌ మాట్లాడారు. 
మద్దతుగా రాస్తారోకో, నేతల అరెస్టు
దీక్షకు మద్దతుగా సిఐటియు ఆధ్వర్యాన జాతీయ రహదారిపై రాస్తారోకో చేశారు. పోలీసులు బలవంతంగా కార్మిక నేతలను ఈడ్చు కుంటూ తీసుకెళ్లి అరెస్టు చేశారు. సిఐటియు నాయకులు జెఎన్‌వి గోపాలన్‌, వాసు దేవరావు, ఆంజనేయులును పోలీసు లు కాళ్ల పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.