Monday, 29 June 2015

కంటితుడుపు చర్యలతో ప్రయోజనం లేదు..

- ప్రభుత్వ తీరుపై అంగన్‌వాడీల ఆగ్రహం 
- ఐసిడిఎస్‌ కార్యాలయం ముందు ధర్నా

 ఏళ్ల తరబడి కష్టపడి పనిచేస్తున్న అంగన్‌వాడీల సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న కంటితుడుపు చర్యల వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని అంగన్‌వాడీ, సిఐటియు నాయకులు స్పష్టం చేశారు. సమస్యల పరిష్కారం కోరుతూ ఎపి అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ నాయకులు జిల్లా కేంద్రంలోని ఐసిడిఎస్‌ పీడీ కార్యాలయం ముందు సోమవారం ధర్నా నిర్వహించారు. పెద్ద ఎత్తున కార్యకర్తల కార్యాలయం ముందు బైఠాయించారు. సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు నల్లప్ప, నగర కార్యదర్శి నాగేంద్రకుమార్‌, సిఐటీయు నగర కార్యదర్శి నాగరాజు మాట్లాడుతూ అంగన్‌వాడీ వర్కర్స్‌, హెల్పర్లకు పదవీవిరమణ సదుపాయలు కంటితుడుపు చర్యగా చేసి చేతులు దులుపుకోవాలని ప్రభుత్వం చూస్తోందన్నారు. వర్కర్లకు రూ.50వేలు, హెల్పర్లకు రూ.20వేలు ఇచ్చి వదిలించుకోవాలని చూస్తోందన్నారు. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా వర్కర్లకు రూ.రెండు లక్షలు, హెల్పర్లకు రూ.లక్ష రూపాయలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. వేతనాలు పెంచుతామని హామీ ఇచ్చి నాలుగు నెలలు గడుస్తున్నా దాని గురించి అతీగతీ లేదన్నారు. కమిటీల పేరుతో కాలయాపన చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణం సమస్యలను పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని లేని పక్షంలో ఆందోళన చేపడతామని హెచ్చరించారు. అనంతరం పీడీ షెహనాజ్‌బీకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగమణి, రైతు సంఘం జిల్లా కార్యదర్శి పెద్దిరెడ్డి, సిఐటియు నాయకులు వెంకటేష్‌తో పాటు జిల్లాలోని అంగన్‌వాడీలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

'అరబిందో'ను దిగ్బంధిస్తాం..

- కాంట్రాక్టు కార్మికుల పరిష్కరించాలి
- సిఐటియు నేతల డిమాండ్‌

అరబిందో కార్మికుల సమస్యలను పరిష్కరించకపోతే పరిశ్రమను దిగ్బంధిస్తామని సిఐటియు నేతలు హెచ్చరించారు. ఆ సంఘం ఆధ్వర్యాన అరబిందో ఫార్మా కార్మికులు పరిశ్రమ గేటు వద్ద సోమవారం భారీ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి డి గోవిందరావు, డివిజన్‌ ప్రధాన కార్యదర్శి పి తేజేశ్వరరావు మాట్లాడుతూ.. పరిశ్రమలో సుమారు మూడు వేల మంది కాంట్రాక్టు కార్మికులు అతి తక్కువ వేతనాలతో దుర్భర జీవితాలు అనుభవిస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. వీరిని యాజమాన్యం తీవ్రంగా దోపిడీ చేస్తోందని విమర్శించారు. మూడునెలలుగా కార్మికులు వారి సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నా యాజమాన్యం నుంచి ఎటువంటి స్పందనా లేదన్నారు. పెరిగిన ధరలకనుకుణంగా వేతనాలు పెరగడం లేదన్నారు. చట్టాలను ఉల్లంఘిస్తున్న యాజమాన్యంపై కార్మిక శాఖ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. కాంట్రాక్టు కార్మికులను రెగ్యులరైజ్‌ చేయాలని, డిఎ పాయింట్‌కు రూ.10 చొప్పున ఇవ్వాలని, రెండు జతల యూనిఫారాలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ధర్నాలో అరబిందో వర్కర్స్‌ యూనియన్‌ నాయకులు కె గురునాయుడు, బి శ్రీనివాసరావు, ఎస్‌ సీతారామరాజు, డి రాము తదితరులు పాల్గొన్నారు.

కదంతొక్కిన అంగన్‌వాడీలు...

జిల్లాల యంత్రాంగం..... తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ అంగన్‌వాడీ కార్యకర్తలు రాష్ట్రవ్యాప్తంగా సోమవారం రోడ్డెక్కారు. వేతనాల పెంపునకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీని అమలు చేయాలని నినదించారు. పౌష్టికాహారం పేరుతో లబ్ధిదారులకు ఇస్తున్న గుడ్లును రెండు నెలలుగా ఇవ్వకపోవడం అన్యాయమని పేర్కొన్నారు. అంగన్‌వాడీ హెల్పర్స్‌ అండ్‌ వర్కర్సు యూనియన్‌ ఆధ్వర్యాన శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని ఐసిడిఎస్‌ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఐసిడిఎస్‌ పీడీ చక్రధరరావుకు వినతిపత్రం అందజేశారు. విజయనగరం కలెక్టరేట్‌ వద్ద ఎపి అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ (సిఐటియు) ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం చేపట్టారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ కలెక్టరేట్‌ వద్ద సుమారు వెయ్యి మంది మహిళలు ధర్నా నిర్వహించారు. అనంతరం కలెక్టర్‌కూ, ఐసిడిఎస్‌ పీడీకీ వినతిపత్రాలు అందజేశారు. ఏలూరులో జిల్లా కలెక్టర్‌ కార్యాలయాన్ని స్థానిక అంగన్‌వాడీ సిబ్బంది ముట్టడించారు. కర్నూలు జిల్లాలో అంగన్‌వాడీ కార్యకర్తలు కలెక్టరేట్‌ ఎదుట ఆందోళన నిర్వహించారు. పెన్షన్‌తో సహా రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. అనంతపురంలో ఐసిడిఎస్‌ పీడీ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. పెద్ద ఎత్తున కార్యకర్తలు బైఠాయించారు. ఒంగోలులోని ఐసిడియస్‌ పీడీ కార్యాలయం వద్ద అంగన్‌వాడీలు ధర్నా నిర్వహించారు. కడప కలెక్టరేట్‌ ఎదుట అంగన్‌వాడీలు నిరసన తెలుపుతూ సమస్యల్ని తక్షణమే పరిష్కాలించాలని నినాదాలు చేశారు. చిత్తూరు కలెక్టరేట్‌ ఎదుట భారీ ఆందోళన కొనసాగింది. ప్రభుత్వాలు అవలంబిస్తున్న విధానాలను మార్చుకోకుంటే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని సిఐటియు, అంగన్‌వాడీ వర్కర్స్‌, హెల్పర్స్‌ యూనియన్‌ నేతలు హెచ్చరించారు. గుంటూరు స్త్రీ శిశు సంక్షేమ శాఖ కార్యాలయం వద్ద అంగన్‌వాడీలు ధర్నా నిర్వహించారు. తొలుత కలెక్టరేట్‌ నుంచి పీడీ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ధర్నాకు ఎపి అంగన్‌వాడీ వర్కర్స్‌ యూనియన్‌(సిఐటియు) జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్‌ జ్యోతిరాణి అధ్యక్షత వహించారు. ఎమ్మెల్సీ బొడ్డు నాగేశ్వరరావు, కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షులు మక్కెన మల్లిఖార్జునరావు ఆందోళనకు మద్దతుగా ప్రసంగించారు. అనంతరం పిడి నిర్మలకు సమస్యలపై వినతిపత్రం అందచేశారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి వై.నేతాజి, సిహెచ్‌ ప్రమీల తదితరులు పాల్గొన్నారు. కృష్ణాజిల్లా కలెక్టరేట్‌ వద్ద ఎపి అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. ఈ సందర్భంగా సంఘం కార్యదర్శి ఎ.కమల, అధ్యక్షురాలు పి.రజీనారాణి మాట్లాడారు.

వేతనాలు పెంచకపోతే సమ్మె బాట..

- మున్సిపల్‌ కార్మికుల నోటీసులు
- రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు

 వేతనాలు పెంచాలని కోరుతూ మున్సిపల్‌ కార్మికులు రాష్ట్రవాప్తంగా సోమవారం ఆందోళన బాట పట్టారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా మున్సిపల్‌ కార్మికులకు పిఆర్‌సి అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. లేని పక్షంలో జులై 1వ తేదీ నుంచి విధులు బహిష్కరిచి సమ్మెలో పాల్గొంటామని స్పష్టంచేశారు. తూర్పుగోదావరి జిల్లా మండపేట మున్సిపల్‌ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. అనంతరం అధికారులకు వినతిపత్రాలు అందజేశారు. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు కార్పొరేషన్‌ కార్యాలయం వద్ద సిఐటియు ఆధ్వర్యాన ధర్నా నిర్వహించారు. నగరపాలక సంస్థలో గార్బేజ్‌ కార్మికులుగా పనిచేస్తున్న తమ సమస్యలు పరిష్కరించాలని కార్మికులు ఆందోళన చేపట్టారు. కార్పొరేషన్‌ కార్యాలయం ఎదుట చేపట్టిన రిలేదీక్షలు ఏడో రోజూ కొనసాగాయి. ఒంగోలు నగరపాలక సంస్ధ కార్యాలయం వద్ద మున్సిపల్‌ సంఘాల జేఏసి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. వచ్చే నెల ఒకటి తరువాత రాష్ట్ర వ్యాప్తింగా సమ్మె జరపాలని నిర్ణయించిన నేపధ్యంలో యూనియన్‌ నాయకులు ఒంగోలు నగరపాలక సంస్ధ కార్యాలయ మేనేజర్‌ శ్రీహరిని కలిసి సమ్మె నోటీసు అందజేశారు. తమకు కనీస వేతనం ఇవ్వాలని కోరుతూ నెల్లూరు కార్పొరేషన్‌ పారిశుధ్య కార్మికులు నిరసన ప్రదర్శన చేశారు. గాంధీబొమ్మ నుంచి కార్పొరేషన్‌ కార్యాలయం వరకూ ప్రదర్శన నిర్వహించారు. నగర కమిషనర్‌ పివివిఎస్‌ మూర్తికి సమ్మె నోటీసు ఇచ్చారు. సమస్యల పరిష్కారం కోసం మున్సిపల్‌ కార్మికులు కడప జిల్లా వ్యాప్తంగా నిరసన చేశారు. ర్యాలీలు నిర్వహించారు. కార్మికుల డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించని కారణంగా జులై 1 తర్వాత ఏ రోజైనా సమ్మెలోకి వెళ్తామని ఎపి రాష్ట్ర మున్సిపల్‌ ఉద్యోగులు, కార్మికు ఐక్య కార్యాచరణ కమిటి హెచ్చరించింది. కమిటీ తరఫురన సిఐటియు కడప నగర ప్రధాన కార్యదర్శి బి.మనోహర్‌ ఆధ్వర్యంలో సోమవారం నగరపాలక సంస్థ కమిషనర్‌ చల్లా ఓబులేసుకు సమ్మె నోటిసు అందజేశారు. శ్రీకాకుళం మున్సిపల్‌ కార్యాలయం వద్ద మున్సిపల్‌ కాంట్రాక్టు కార్మికులు ధర్నా చేపట్టారు. అనంతరం మున్సిపల్‌ కార్యాలయంనుంచి పట్టణంలోని ఏడు రోడ్ల కూడలి వరకూ ర్యాలీ నిర్వహించారు. 
గుంటూరు జిల్లా సత్తెనపల్లి, నరసరావుపేట మున్సిపల్‌ కార్యాలయం ఎదుట కార్మికులు ధర్నా నిర్వహించారు. అనంతరం కమిషనర్‌కు వినతి పత్రం ఇచ్చారు. మున్సిపల్‌ కార్మిక సంఘాల నాయకులతో ప్రభుత్వం జరిపే చర్చలు సఫలం కాకపోతే జులై 1వతేదీ తర్వాత ఏరోజునుండైనా సమ్మెలోకి వెళతామని ధర్నాలో నాయకులు తెలిపారు. విజయవాడ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ప్రధాన కార్యాలయం గేటు వద్ద మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ (సిఐటియు), ఎఐటియుసి అనుబంధ సంఘం సంయుక్తంగా ధర్నా నిర్వహించాయి. వినతిపత్రాన్ని, సమ్మె నోటీసును కమిషనర్‌ జి వీర్యపాండ్యన్‌కు అందజేశారు. కార్యక్రమంలో రెండుయూనిన్లకు చెందిన నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు.

అంగన్‌వాడీల ఆందోళన...

- ఐసిడిఎస్‌ను ప్రయివేటు పరం చేసే ఆలోచనకు నిరసనగా 

నెల్లూరు నిరుపేద బిడ్డలు, గర్భిణులు, బాలింతలకు ఎంతో ఆసరాగా ఉంటున్న ఐసిడిఎస్‌ను ప్రయివేటు పరం చేసే ఆలోచనను విరమించుకోవాలని కోరుతూ అంగన్‌వాడీలు సోమవారం స్థానిక దర్గామిట్టలోని ఐసిడిఎస్‌ జిల్లా కార్యాలయం వద్ద ధర్నా చేశారు. ఈ ఆందోళన అంగన్‌వాడీ వర్కర్స్‌, హెల్పర్స్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో జరిగింది. ఈసందర్భంగా ఆ యూనియన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి స్వరూపరాణి మాట్లాడుతూ రాష్ట్రంలో 127 ప్రాజెక్టులను ప్రభుత్వం మిషన్‌ మోడ్‌ కింద స్వచ్ఛంద సంస్థలకిచ్చే యోచన చేస్తుందని తెలిపారు. ఇదే జరిగితే బాలింతలు, గర్భిణులకు, చిన్నారులకు పౌష్టికాహారం అందదన్నారు. ఐసిడిఎస్‌ నిర్వీర్యమవుతుందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఇలాంటి ఆలోచనలు విరమించుకోవాలని కోరారు. ధర్నాకు మద్దతు పలికిన ఐద్వా నగర ప్రధాన కార్యదర్శి మస్తాన్‌బీ మాట్లాడుతూ ఐసిడిఎస్‌ను ప్రయివేటు పరం కాకుండా కాపాడుకునేందుకు పోరాటంలోకి రావాలన్నారు. సంస్థాగతంగానే ప్రాజెక్టులను నడపాలన్నారు. సిడిపిఒలు, పి.డి.లు అంగన్‌వాడీ మహిళలను బెదిరించి దోచుకుంటున్న అవినీతి సంపదకు అడ్డు కట్టవేయాలని డిమాండ్‌ చేశారు. పెన్షన్‌తో కూడిన రిటైర్మంట్‌ బెనిఫిట్‌ను ప్రవేశపెట్టాలని డిమాండ్‌ చేశారు. సర్వీసు అనంతరం వర్కర్‌కు రూ.2లక్షలు, హెల్పర్‌కు రూ.లక్షను అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం జిల్లా అధ్యక్షులు ఎల్‌.వి.శేషమ్మ, ఆదిలక్ష్మి, మంజుల తదితర పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు.

డిఎంహెచ్‌ఒ ఆఫీసు వద్ద ధర్నా...

- కాంట్రాక్టు మెడికల్‌ సిబ్బందిని రెగ్యులర్‌ చేయాలని...

నెల్లూరు వైద్యశాఖలో పనిచేస్తున్న కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులను వెంటనే రెగ్యులర్‌ చేయాలని కోరుతూ ఎపి కాంట్రాక్టు, ఔట్‌ సోర్సింగ్‌ ఎంప్లాయిస్‌ ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో సోమవారం స్థానిక డిఎంహెచ్‌ఒ(జిల్లా వైద్యశాఖాధికారి కార్యాలయం) వద్ద ధర్నా జరిగింది. ఈసందర్భంగా ఆ సంఘం గౌరవాధ్యాక్షులు నరమాల సతీష్‌ మాట్లాడుతూ గత ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు కాంట్రాక్టు, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులను వెంటనే రెగ్యులర్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. పదో పిఆర్‌సిని వర్తింప చేయాలని, ప్రతి నెల 7వ తేదీలోపు జీతాలు ఇవ్వాలని , గర్భవతులకు 180 రోజుల ప్రసూతి సెలవులు ఇవ్వాలని కోరారు. హెల్త్‌ కార్డులు, బస్‌పాస్‌లు ఇవ్వాలని కోరారు. కాంట్రాక్ట్‌ పద్దతిలో పనిచేస్తున్న డ్రైవర్లకు హెవి వెహికల్‌, హెవి లైసెన్సు హోల్డర్‌ లకు జిఒ 3 ప్రకారం జీతాలు ఇవ్వాలని కోరారు. అలాగే బడ్జెట్‌ను సకాలంలో విడుదల చేయాలని కోరారు . తమ డిమాండ్లు పరిష్కరించకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఆసంఘం అధ్యక్ష, కార్యదర్శిలు ఎ.వి.శేషయ్య, బి.జయరాం నాయకులు సంధాని బాష , ఉమారాణి, జ్యోతి, నరసింహులు తదితరులు పాల్గొన్నారు.

కనీస వేతనం ఇవ్వకుంటే సమ్మె తప్పదు...

- కమిషనర్‌కు పారిశుధ్య కార్మికులు నోటీసు 

నెల్లూరు తమకు కనీస వేతనం ఇవ్వకుంటే సమ్మె తప్పదని కార్పొరేషన్‌ పారిశుధ్య కార్మికులు హెచ్చరించారు. ఎపి మున్సిపల్‌ వర్కర్స్‌, ఎంప్లాయీస్‌ యూనియన్‌ ఆధ్వర్యాన వారు సోమవారం స్థానిక గాంధీబొమ్మ వద్ద ప్రదర్శన నిర్వహించారు. అనంతరం నగన కమిషనర్‌ పివివిఎస్‌ మూర్తిని కలసి సమ్మె నోటిసు అందజేశారు. ఈ సందర్భంగా ఆ సంఘం జిల్లా కార్యదర్శి కె. పెంచలనరసయ్య మాట్లాడుతూ నగర పాలక సంస్థలని పారిశుధ్య కార్మికులకు కనీస వేతనం రూ. 15,432గా అమలు చేయాలన్నారు. అలాగే కార్మికులకు, పర్మినెంట్‌ ఉద్యోగులకు జిపిఎఫ్‌ అకౌంట్లు ఏర్పాటు చేయాలని, 010 పద్దు ద్వారా జీతాలు చెల్లించాలని, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులను పర్మినెంట్‌ చేయాలని, కార్మికులకు 5లక్షల ప్రమాద బీమా కల్పించాలని, ఇళ్ల స్థలాలు కేటాయించాలని డిమాండు చేశారు. కార్మికుల సమస్యలు పరిష్కరించని పక్షంలో జూలై 1 తరువాత ఎప్పుడైనా సమ్మె చేపడ్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఆ సంఘ నగర కార్యదర్శి అల్లాడి గోపాల్‌ ,ఏ దేశయ్య, నాగరాజమ్మ, జి మల్లికార్జున ,అప్పారావు తదితరులు పాల్గొన్నారు.

జీతాలపెంపు, రెగ్యులరైజేషన్‌కోసం పోరాటం : సిఐటియు

జీతాలపెంపు, రెగ్యురైజేషన్‌ కోసం రాష్ట్రంలోని కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌, కంటింజెంట్‌ ఉద్యోగులు పోరాటాలకు సిద్ధంకావాలని సిఐటియు రాష్ట్ర కోశాధికారి ఎవి నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. స్థానిక సిఐటియు కార్యాలయంలో ఆదివారం షేక్‌ హుస్సేన్‌ అధ్యక్షతన ఏర్పాటుచేసిన జిల్లా మెడికల్‌ అండ్‌ హెల్త్‌ యూనియన్‌ల సమన్వయకమిటీ సమావేశంలో ఆయన ప్రసంగించారు. నాగేశ్వరరావు మాట్లాడుతూ ప్రభుత్వం అధికారంలోకొచ్చి ఏడాది గడిచినా కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించలేదన్నారు. కాంట్రాక్ట్‌ ఉద్యోగుల రెగ్యులరైజేషన్‌ కోసం చట్టాలు ఆటంకంగా ఉన్నాయని ప్రభుత్వం చెబుతోందని, తానే చేసిన చట్టం ఆటకం అయితే చట్టాన్ని సవరించి కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులందరినీ రెగ్యులరైజ్‌ చేయాలని డిమాండ్‌చేశారు. నాలుగేళ్లుగా కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు రూపాయి కూడా జీతం పెంచలేదని, ధర పెరుగుదలతో ఉద్యోగులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. వేలాది పర్మినెంట్‌ ఉద్యోగాలు ఖాళీగావున్నా వాటిని భర్తీకి ప్రభుత్వం నేటికీ ఆలోచన చేయడంలేదని, దీంతో ప్రస్తుత ఉద్యోగులపై తీవ్రపనిభారం పెరిగిందని చెప్పారు. పోరాటాలు చేయకుంటే ఏ ఉద్యోగుల సమస్యల పరిష్కారంగురించి ప్రభుత్వం ఆలోచించటంలేదన్నారు. అంగన్‌వాడీలు, ఆర్‌టిసి కార్మికులు వారి సమస్యల పరిష్కారానికి పోరాటమార్గాన్ని ఎంచుకున్నారని, కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు కూడా అదే దారిలో పయనించాలని నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. కాంట్రాక్ట్‌ మేల్‌ హెల్త్‌అసిస్టెంట్ల రాష్ట్ర నాయకులు విజరు మాట్లాడుతూ 12ఏళ్లకుపైగా పనిచేస్తున్న ఉద్యోగులను ప్రభుత్వం తొలగించాలని చూస్తోందని, ఇది సరైందికాదన్నారు. యునైటెడ్‌ మెడికల్‌ అండ్‌ హెల్త్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి జె.శ్యామ్‌ మాట్లాడుతూ జిల్లాలోని వైద్య, ఆరోగ్యరంగ ఉద్యోగులందరినీ ఒకేతాటిపైకి తెచ్చేందుకు తమ యూనియన్‌ శక్తివంచనలేకుండా కృషిచేస్తోందన్నారు. సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి వై.నేతాజి, మెడికల్‌ అండ్‌ హెల్త్‌ యూనియన్‌ జిల్లా వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ఎస్‌కె కరిముల్లా, అర్బన్‌హెల్త్‌ సెంటర్స్‌ యూనియన్‌ జిల్లాఅధ్యక్షులు ఎస్‌.బసవదేవి, యూరోపియన్‌ ఎఎన్‌ఎంల యూనియన్‌ కన్వీనర్‌ కె.అన్నమ్మ, సెకెండ్‌ ఎఎన్‌ఎంల యూనియన్‌ నాయకులు పరమేశ్వరి, అంజలీదేవి, హైర్డ్‌ ఎఎన్‌ఎంల యూనియన్‌ నాయకులు కుమారి తదితతరులు ప్రసంగించారు.

'సర్వీసు కొనసాగింపు ఉత్తర్వులివ్వాలి'...


శ్రీకాకుళంలో వైద్య ఆరోగ్యశాఖలో కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు సర్వీసును కొనసాగిస్తూ తక్షణం ఉత్తర్వులు ఇవ్వాలని యునైటెడ్‌ మెడికల్‌ అండ్‌ హెల్త్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ అధ్యక్ష, కార్యదర్శులు కె.సోమసుందరరావు, డి.సాయిప్రసాద్‌ డిమాండ్‌ చేశారు. యూనియన్‌ ఆధ్వర్యాన సోమవారం డిఎంఅండ్‌హెచ్‌ఒ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శాశ్వత ఖాళీల్లో కాంట్రాక్టు ఉద్యోగులను భర్తీ చేయాలని, మృతిచెందిన కాంట్రాక్టు ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల కుటుంబాల్లో ఒక్కరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. తొమ్మిదో పిఆర్‌సి ద్వారా వేతనాలు పొందుతున్న కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు పదో పిఆర్‌సి అమలు చేయాలన్నారు. టిఎ, డిఎ, హెచ్‌ఆర్‌ఎ, ఎఫ్‌టిఎ ఇవ్వాలని, మహిళా ఉద్యోగులకు ప్రసూతి సెలవులు మంజూరు చేయాలని డిమాండ్‌ చేశారు. అనంతరం డిఎంఅండ్‌హెచ్‌ఒ ఆర్‌.శ్యామలకు వినతిపత్రం సమర్పించారు. సిఐటియు సీనియర్‌ నాయకులు విజికె.మూర్తి వీరి ధర్నాకు సంఘీభావం తెలిపారు.

Sunday, 28 June 2015

కనీస వేతనం రూ.15,432 ఇంజినీరింగ్ కార్మికులకు స్కిల్డ్, సెమీ స్కిల్డ్ వేతనాలు పెంపు కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులరైజ్ పర్మినెంట్ ఉద్యొగులకు జి.పి.ఎఫ్ డిమాండ్లపై మున్సిపల్ జే.ఏ.సి నాయకులతో మున్సిపల్ మినిస్టర్ నారాయణ తో 29.06.2015 న చర్చలు....

పదవ వేతన సవరణ కమిటీ సిఫార్సుల అమలుకోసం రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెకు సిద్దమవుతున్న మున్సిపల్‌ ఉద్యోగులు, కార్మికులను రాష్ట్ర ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించింది. భాగంగా సోమవారం అన్ని పట్టణాల్లో ప్రదర్శనలు నిర్వహించి అధికారులకు సమ్మె నోటీసుల ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర మున్సిపల్‌ ఉద్యోగులు, కార్మికుల ఐక్య కార్యాచరణ కమిటీ (జెఎసి) పిలుపునిచ్చింది. జెఎసి నేతలు ఇచ్చిన పిలుపుతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రదర్శనలకు ఎక్కడికక్కడ ఉద్యోగులు, కార్మికులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపధ్యంలో చర్చలకు రావాలని రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానించింది. సోమవారం సాయంత్రం సచివాలయంలోని పురపాలన, పట్టణాభివృద్దిశాఖ మంత్రి డాక్టర్‌ పి. నారాయణ ఆధ్వర్యంలో ఈ చర్చలు జరగనున్నాయి. చర్చల్లో సానుకూల ఫలితం రాకపోతే జులై ఒకటవతేది తరువాత నిరవధిక సమ్మె చేపడతామని జెఎసి ప్రకటించింది. పదవ వేతన సవరణ కమిటీ సిఫార్సుల అమలుతో పాటు వివిధ ఇతర సమస్యల పరిష్కారం రాష్ట్ర వ్యాప్తంగా కొంతకాలంగా సిఐటియు నేతృత్వంలో పలు పట్టణాల్లో పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్న సంగతి తెలిసిందే. పలు కార్మిక సంఘాలు కూడా ఇదే డిమాండ్‌తో నిరసనలు ఆందోళనలు కొనసాగించాయి. అన్ని కార్మిక సంఘాలు ఆందోళన బాట పట్టినా ప్రభుత్వం నుండి స్పందన శూన్యం. దీంతో అన్ని కార్మిక సంఘాలు ఐక్యకార్యాచరణ కమిటీగా ఏర్పాటయ్యా యి.'మున్సిపల్‌' ఆందోళనల్లో ఇదో కీలక పరిణామ ం. జెఎసిగా ఏర్పాటైన కార్మిక సంఘాలు ఈ నెల 18 వ తేదిన రాష్ట్ర ప్రభుత్వానికి సమ్మెనోటీసు ఇచ్చాయి. జులై ఒకటిలోపు పరిష్కరించకపోతే ఆ తరువాత నిరవధిక సమ్మెకు దిగుతామని ఈ నోటీసులో హెచ్చరించాయి. అయినా ప్రభుత్వంలో స్పందన లేకపోవడంతో ఈ నెల 26న విజయవాడలో రాష్ట్ర సదస్సు నిర్వహించి భవిష్యత్‌ కార్యాచరణకు ప్రణాళికను జెఎసి సిద్దం చేసింది. కార్మికసంఘాలన్నీ ఏకతాటిపై కదులుతుండట ంతో స్పందించక తప్పనిస్థితి రాష్ట్ర ప్రభుత్వానికి ఏర్పడింది. ఈ నేపధ్యంలో సోమవారం జరగ నున్న చర్చలు ఎటువంటి ఫలితానిస్తాయన్న ది ఆసక్తి కరంగా మారింది. వేతన సంఘం సిఫార్సుల అమలుతో పాటు, ఇంజినీరింగ్‌ కార్మికులకు స్కిల్డ్‌, సెమి స్కిల్డ్‌ జీతాలు చెల్లించా లని, ఎన్‌ఎంఆర్‌, కాంట్రాకు, అవుట్‌ సోర్సింగ్‌ కార్మికుల రెగ్యులరైజేషన్‌, పర్మినెంటు ఉద్యోగులకు జిపిఎఫ్‌ ఖాతాలు, హెల్త్‌కార్డులు, 010 పద్దు ద్వారా జీతాల చెల్లింపు, స్కూల్‌ స్వీపర్స్‌ ఇతర పార్ట్‌టైమ్‌ ఉద్యోగులకు కనీస వేతనాలు చెల్లించాలని కార్మిక సంఘాలు కోరుతున్నాయి.

Saturday, 27 June 2015

కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, ఉద్యోగ వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ మోడీ ప్రభుత్వానికి హెచ్చరికగా సెప్టెంబరు 2న దేశవ్యాప్తంగా జరగనున్న సార్వత్రిక సమ్మె జయప్రదం చేయాలని సి.ఐ.టి.యు రాష్ట్ర కార్యదర్శి కె. ఉమామహేశ్వరరారవు పేర్కొన్నారు.


మద్యం పాలసీని ఉపసంహరించుకోవాలి...

- ఐద్వా డిమాండ్‌

                         
రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నూతన ఎక్సైజ్‌ పాలసీని వెంటనే ఉపసంహ రించుకోవాలని ఐద్వా రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు బి.ప్రభావతి, డి.రమాదేవి డిమాండ్‌ చేశారు. టిడిపి నిజంగా మహిళా సాధికారిత కోరుతున్న పార్టీ అయితే తాము సంధించిన పది ప్రశ్నలకు ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రికి పది ప్రశ్నలతో కూడిన పత్రాలను ప్రదర్శించారు. దుర్గాపురంలోని సిఐటియు నగర కార్యాలయంలో ఐద్వా రాష్ట్ర కమిటీ సమావేశం శనివారం నిర్వహించారు.

ఈ సందర్భంగా సహాయ కార్యదర్శి కె.శ్రీదేవితో పాటు ప్రభావతి, రమాదేవి విలేకరులతో మాట్లాడుతూ, సమావేశం తీసుకున్న నిర్ణయాలను వెల్లడించారు.10 శాతం ఆదాయ పెంపు కోసం ప్రభుత్వం ప్రకటించిన ఎక్సైజ్‌ పాలసీ మహిళలపై హింసాకాండను మరింత పెంచేలా ఉందని పేర్కొన్నారు. శాంతిభద్రతల పరిరక్షణకు హామీ ఇచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం, మద్యాన్ని పెంచుతూ అత్యాచారాల నుండి మహిళలకు ఎలాంటి రక్షణ ఇస్తుందో చెప్పాలన్నారు. రాజధానిగా ప్రకటించిన విజయవాడ నగరంలోనే మహిళలపై దాడులు పెరిగాయని, గన్నవరంలో యాసిడ్‌ దాడిని ఉదహరిస్తూ.. దీనిపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. రానున్న కాలంలో మద్యాన్ని మాల్స్‌లోనూ, టెట్రాప్యాక్‌లలోనూ విస్తారంగా అందుబాటులోకి తెస్తే మహిళలకు రక్షణ ఉండదని తదితర తీర్మానాలు చేసినట్లు వివరించారు. 

వివేక్‌ దేబ్‌రారు కమిటీ సిఫార్సులను కేంద్రం తిరస్కరించాలి...

- రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో వక్తలు

భారతీయ రైల్వేలకు ఉరితాడుగా ఉన్న వివేక్‌ దేబ్‌రారు కమిటీ సిఫార్సులను కేంద్ర ప్రభుత్వం తిరస్కరించాలని రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో పలువురు వక్తలు డిమాండ్‌ చేశారు. భారత ప్రజలకు చౌక ప్రయాణాన్ని అందిస్తూ 150 సంవత్సరాల నుండి సేవలందిస్తున్న భారతీయ రైల్వేను కుదేలు చేసేలా, ప్రయివేటు వ్యక్తుల గుప్పెట్లోకి వెళ్లేలా దేబ్‌రారు కమిటీ సిఫార్సులు ఉన్నాయన్నారు. తక్షణమే వాటిని తిరస్కరించని పక్షంలో రైల్వే రంగంలోని అన్ని కేటగిరిల ఉద్యోగులతో పాటు ప్రజలు, ప్రజాతంత్రవాదులు సంఘటిత పోరాటం చేసి భారతీయ రైల్వేను కాపాడుకోవాల్సి ఉందన్నారు. రైల్వే కాంట్రాక్ట్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయిస్‌ యూనియన్‌ (సిఐటియు) ఆధ్వర్యంలో వివేక్‌ దేబ్‌రారు కమిటీ సిఫార్సులను నిరసిస్తూ గాంధీనగర్‌లోని ప్రెస్‌క్లబ్‌లో శనివారం రౌండ్‌ టేబుల్‌ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు వి.ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ దేశంలో వేగంగా అమలు చేస్తున్న సరళీకరణ ఆర్థిక విధానాల్లో భాగంగానే దేవ్‌రారు సిఫార్సులు ఉన్నాయన్నారు. రైల్వేల పునర్వవ్యవస్తీకరణ కోసం ఏర్పాటు చేసిన ఈ కమిటీ భారత ప్రజలకు చౌకగా సేవలు అందిస్తుండగా వ్యవస్థ మొత్తాన్ని బడా పెట్టుబడి దారులకు కట్టబెట్టే రీతిలో సిఫార్సులు ఉన్నాయన్నారు. కేంద్ర ప్రభుత్వం కేవలం సలహా ఇచ్చేదిగానూ, రైల్వేబోర్డు కార్పేరేట్‌ ఆఫీస్‌గానూ, బోర్డు ఛైర్మన్‌ దానికి సిఇవోగానూ వ్యవహరించాలని కమిటీ సూచించిందన్నారు. ప్రత్యేక రెగ్యులేటరీ ఏర్పాటు చేసి ప్రయాణ, రవాణా ఛార్జీలు మొదలగు వాటిని పెంచాలని, ప్రైవేటు వారికి రాయితీలు ఇచ్చి ప్రొత్సహించాలని, రైలు పట్టలు, స్టేషన్లు, రూట్లు, పాసింజర్‌, రవాణా, పార్సిల్‌ తదితర సేవలను ఉత్పాదక యూనిట్‌లను ప్రయివేటు పరం చేయాలనే రైల్వే విచ్ఛిన్నకర సిఫార్సులను కమిటీ చేసిందన్నారు. రెగ్యులేటరీ బోర్డు ద్వారా ఎప్పటికప్పుడు ప్రయాణ, రవాణా ఛార్జీలను పెంచాలని, ప్రయాణికులకు అందించే మంచినీరు, ఆహార సరఫరా వంటి వాటిని పూర్తిగా ప్రవేటు పరం చేయాలని పేర్కొందని, ఇటువంటి సిఫార్సులను తిప్పికొట్టాల్సి ఉందని అన్నారు. దక్షిణ మధ్య రైల్వే మజ్దూర్‌ యూనియన్‌ జోనల్‌ ఉపాధ్యక్షులు జి.రాంగోపాల్‌ మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా రైల్వే ఉద్యోగులకు సేవలందిస్తున్న రైల్వే స్కూళ్లను, హాస్పటల్స్‌ను మూసివేసి ప్రయివేటుకు వెళ్లేలా నగదు సబ్సిడీ ఇవ్వాలని కమిటీ సూచించడం సరికాదన్నారు. రైల్వేలకు కేంద్ర ప్రభుత్వ అజమాయిషీలో ప్రస్తుతం పార్లమెంట్‌ బడ్జెట్‌ ఆమెదించే పరిస్థితిని పూర్తిగా రద్దు చేయాలని కమిటి సిఫార్సు చేసిందంటే రానున్న కాలంలో రైల్వే పూర్తిగా ప్రయివేటు రంగ సంస్థగా మారిపోతోందన్నారు. ఓబిసి ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ నాయకులు సత్యనారాయణ మాట్లాడుతూ రైల్వేలోని కార్మిక సంఘాలన్నీ ఐక్య పోరాటం చేయాలన్నారు. ఎఐటియుసి రాష్ట్ర నాయకులు రమణమూర్తి మాట్లాడుతూ రైల్వే ఉద్యోగ, కార్మికులతో పాటు ప్రజలను కలుపుకుని సంఘటితంగా పోరాటం చేయాల్సి ఉందన్నారు. టియుసిసి రాష్ట్ర కార్యదర్శి పివి సుందరరామరాజు మాట్లాడుతూ భారత ప్రజలకు ,రైల్వే ఉద్యోగ, కార్మికులకు పూర్తిగా వ్యతిరేకంగా ఉన్న వివేక్‌ దేబ్‌రారు సిఫార్సులను తిప్పికొట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

కార్మికుల పట్ల దుర్మార్గంగా వ్యవహరించడం అన్యాయం

 కాళ్లలో నీతివాక్యాలు వల్లిస్తూ పెద్దమనుషులుగా చలామణి అవుతున్న వారు కార్మికులపట్ల దుర్మార్గంగా వ్యవహరించడం ఎంత వరకు సబబు అని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి గొర్ల రామకృష్ణ ప్రశ్నించారు. జక్కరం గ్రామంలో మల్లికార్జున కెమికల్‌ ఫ్యాక్టరీ వద్ద కార్మికులు చేస్తున్న నిరసన కార్యక్రమాలు శనివారానికి 70వ రోజుకు చేరాయి. ఈ సందర్భంగా భీమవరం-జువ్వపాలెం జాతీయ రహదారిపై కోపల్లె వంతెన వద్ద కార్మికులు యాజమాన్య దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. రోడ్డుపై రాస్తారోకో చేసి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 70 రోజులుగా కార్మికులు నిరసన తెలుపుతున్నా యాజమాన్యం పట్టించుకోకపోవడం దుర్మార్గమన్నారు. యాజమాన్యం కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు. కార్మికులు యూనియన్‌ ఏర్పాటు చేసుకోవడం తప్పుగా భావించి 14 మంది కార్మికులను తొలగించడం అన్యాయమన్నారు. 70 రోజుల నుండి 14 కుటుంబాల వారు ఆర్థిక ఇబ్బందులతో పోరాటం చేస్తున్నారన్నారు. ఉన్నతాధికారులు స్పందించి కార్మికులకు న్యాయం చేయాలని కోరారు. చట్టబద్దంగా యూనియన్‌ ఏర్పాటు చేసుకునే అవకాశం రాజ్యాంగం కల్పించిందన్నారు. యాజమాన్యం కార్మికులను అణగదొక్కే చర్యలు మానుకోవాలని ఆయన హెచ్చరించారు. యాజమాన్యం స్పందించి కార్మికులను విధుల్లోకి తీసుకోకపోతే ఉద్యమాన్ని ఉదృతం చేస్తామని ఆయన హెచ్చరించారు. రాబోయే రోజుల్లో అన్ని కార్మిక సంఘాలతో సిఐటియు ఆధ్వర్యంలో ఉద్యమాన్ని మరింత ఉదృతం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు డివిజన్‌ కార్యదర్శి వాసుదేవరావు, కార్మికులు భూసారావు, విష్ణుమూర్తి, సత్యనారాయణ, టివిఎం సత్యనారాయణ, ప్రసాద్‌, కృష్ణ, సుబ్బరాజు, తమ్మయ్య, శ్రీను, ఇతర కార్మికులు పాల్గొన్నారు.

నూతన మద్యం పాలసీపై ఐద్వా నిరసన...

గాజువాక టిడిపి ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన మద్యం పాలసీపై ఐద్వా గాజువాక, స్టీల్‌ డివిజన్‌ కమిటీలు శుక్రవారం నిరసన తెలిపాయి. వీధుల్లో ర్యాలీ చేపట్టాయి. ఈ సందర్భంగా సంఘం స్టీల్‌ డివిజన్‌ కార్యదర్శి ఎంబి సత్యవతి మాట్లాడుతూ నూతన మద్యం పాలసీ వల్ల ప్రజల జీవితాలు గుల్లబారుతాయన్నారు. చంద్రబాబు సర్కారు జనాన్ని మందుబాబులుగా మారుస్తోందని విమర్శించారు. మద్యం విచ్చలవిడి అమ్మకాల వల్ల నేరాలు పెరుగుతున్నాయన్నారు. మహిళలపై దాడులు రోజురోజుకూ పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో గాజువాక జోన్‌ కార్యదర్శి కె మంగవేణి, కె లక్ష్మీ ప్రసన్న, ఎం శ్రీదేవి, జి లక్ష్మి, ఎల్‌ రాధ, వేణు, నూకరత్నం, మంగ, జివై నాయుడు, తదితరులు పాల్గొన్నారు.

సెప్టెంబర్‌ 2 సమ్మెను జయప్రదం చేయండి...

- సిఐటియు మద్దిలపాలెం జోన్‌ మహాసభలో ఆర్‌కెఎస్‌వి కుమార్‌

కేంద్రంలోని మోడీ ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక చర్యలకు వ్యతిరేకంగా సెప్టెంబర్‌ 2న అఖిల పక్ష సంఘాల ఆధ్వర్యాన జరుగు సమ్మెను కార్మికవర్గ మంతా జయప్రదం చేయాలని సిఐటియు నగర కార్యదర్శి ఆర్‌కెఎస్‌వి కుమార్‌ విజ్ఞప్తి చేశారు. శనివారం నగరంలో జరిగిన సిఐటియు మద్దిలపాలెం జోన్‌ మహాసభకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. కార్మికవర్గం ఎన్నో పోరాటాలు సాగించి సాధించుకున్న కార్మిక చట్టాలను బిజెపి ప్రభుత్వం మార్చివేసి కార్మికులకు నష్టం కలిగిస్తుందని తెలిపారు. ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటాలను విక్రయిస్తూ ఈ సంస్థలను నిర్వీర్యం చేస్తుందని విమర్శించారు. పిఎఫ్‌ సొమ్మును షేర్‌ మార్కెట్‌లో పెడుతుందని, ఇది అత్యంత దుర్మార్గమైన చర్య అని విమర్శించారు. అసంఘటిత కార్మికులకు సమగ్రచట్టం చేయాలని డిమాండ్‌ చేశారు. సిమెంట్‌, ఇసుక ధరలను తగ్గించి, నిర్మాణ రంగంలో ఉపాధిని కాపాడాలన్నారు. సెప్టెంబరు 2న జరిగే సమ్మెకు అన్ని కార్మిక సంఘాలు సహకరించాలన్నారు. సిఐటియు సీనియర్‌ నాయకులు అనపర్తి అప్పారావు అధ్యక్షతన జరిగిన సభలో ఎ.సింహాచలం, జె.నాయుడు, డి.అప్పలరాజు, తులసీరాం, సిహెచ్‌ఎన్‌వి సత్యనారాయణ తదితరులు మాట్లాడారు. ఈ సభలో తోపుడు బండ్లు, ముఠా, ఆటో, జివిఎంసి, ఆర్టీసీ, బిల్డింగ్‌, యూనివర్శిటీ కార్మిక సంఘాలకు చెందిన 200 మంది కార్మికులు పాల్గొన్నారు. అనంతరం సిఐటియు జోన్‌ కమిటీని 28 మందితో ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా ఎ.సింహాచలం, ప్రధాన కార్యదర్శిగా జె.నాయుడు ఎన్నికయ్యారు.

కార్మిక సంక్షేమానికి 'గాలి' ఎనలేని కృషి...

- సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు సిహెచ్‌ నర్సింగరావు


  కార్మిక సంక్షేమానికి గాలి అప్పారావు ఎనలేని కృషిచేశారని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు సిహెచ్‌ నర్సింగరావు అన్నారు. కెవిపిఎస్‌ నగర ఉపాధ్యక్షులు, డాక్‌యార్డు ఉద్యోగి, సిఐటియు నాయకులు గాలి అప్పారావు సంస్కరణ సభనును వడ్లపూడి ఆర్‌ హెచ్‌కాలనీలోని లక్ష్మీపురం జంక్షన్‌లో శనివారం నిర్వహించారు. దీనికి నర్సింగరావు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. 1978లో డాక్‌యార్డ్డు ఇంజనీరింగ్‌ విభాగంలో ఉద్యోగిగా చేరినప్పటినుంచి అప్పారావు సిఐటియులోనే కొనసాగారని అన్నారు. కార్మికుల సంక్షేమానికి, హక్కుల రక్షణ కోసం నిరంతరమూ పని చేశారని చెప్పారు. 1998లో కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం నిర్మాణంలో జిల్లాలోనూ, గాజువాక మండలంలోనూ ఎంతగానో కృషి చేశారని తెలిపారు. నీతికి, నిజాయితీకి, కృషి, పట్టుదలకు అప్పారావు మారు పేరు అన్నారు. అంబేద్కర్‌ ఆశయ సాధనలోనూ, దళిత హక్కుల రక్షణలోనూ నిరంతరం కృషి చేసేవారని కొనియాడారు. చిన్నతనం నుంచీ అన్యాయాలు, అక్రమాలపై తనదైన శైలిలో పోరాడేవారని తెలిపారు. ప్రధానంగా రక్షణ రంగంలో సిఐటియు నిర్మాణానికి ఎంతగానో శ్రమించారని పేర్కొన్నారు. వడ్లపూడి ప్రాంతంలో భూబకాసురుల ఆగడాలకు వ్యతిరేకంగా దళితుల భూమికోసం పోరాటం నిర్వహించారని చెప్పారు. కెవిపియస్‌ జిల్లా నాయకులు చిరంజీవులు మాట్లాడుతూ, దళిత, బడుగు, బలహీన వర్గాల హక్కుల కోసం నిరంతరం పోరాడిన యోధుడు అప్పారావు అన్నారు. సిఐటియు జిల్లా నాయుకులు రెడ్డి వెంకటరావు మాట్లాడుతూ, డాక్‌యార్డులో అప్పారావు గ్రేడ్‌-2లో చేరి ఎంసిఎం గా ఉద్యోగోన్నతి పొందారని చెప్పారు. త్వరలో సూపర్‌వైజర్‌గా ప్రమోషన్‌ వచ్చే ముందు అప్పారావు మృతిచెందడం కార్మికవర్గానికి తీరని లోటన్నారు. ముందుగా అప్పారావు చిత్ర పటానికి సిహెచ్‌ నర్సింగరావు పూలమాల వేసి నివాళులర్పించారు. డాక్‌యార్డ్డు యూనియన్‌ నాయకులు ఇ.శ్రీనివాసరావు అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో ఎం.ప్రకాశ్‌, వేణుగోపాలరావు, రాజారావు, మత్యరాజు, వడ్లపూడి సిఐటియు నాయకులు ఎ.విశ్వనాధం, కె.జగ్గారావు, ఎం.దానయ్య, కె.వీరస్వామి, అప్పారావు కుంటంబసభ్యులు పాల్గొన్నారు.

నూతన మద్యం పాలసీని రద్దు చేయాలి : ఐద్వా

విజయనగరంలో మద్యాన్ని విచ్చలవిడిగా అమ్మించే నూతన మద్యం పాలసీని వెంటనే రద్దు చేయాలని ఐద్వా జిల్లా అధ్యక్షులు రెడ్డిశ్రీదేవి డిమాండ్‌ చేశారు. టిడిపి ప్రభుత్వం ప్రకటించిన నూతన ఎక్సైజ్‌ పాలసీని వ్యతిరేకిస్తూ ఐద్వా ఆధ్వర్యంలో పార్వతీపురం, విజయనగరం పట్టణాల్లో జీవో కాపీలను దహనం చేశారు. పార్వతీపురంలోని బెలగాం చర్చివీధి జంక్షన్‌ వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో ఐద్వా జిల్లా అధ్యక్షులు రెడ్డి శ్రీదేవి మాట్లాడుతూ రాష్ట్రాన్ని మద్యాంధ్రప్రదేశంగా మార్చేలా మద్యంపాలసీ ఉందని విమర్శించారు. మద్యం ద్వారా వచ్చే ఆదాయమే ప్రధాన ఆదాయంగా తెలుగుదేశం ప్రభుత్వం చూస్తుందని, ఇది సిగ్గుచేటని అన్నారు. షాపింగ్‌ మాల్స్‌లో కూడా మద్యం దొరికే విధంగా ఈ పాలసీలో పేర్కొనడం దుర్మార్గమన్నారు. దీనివల్ల మహిళలపై దాడులు పెరుగుతాయన్నారు. కావున నూతన ఎక్సైజ్‌ పాలసీని రద్దుచేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో ఐద్వా నాయకులు వాడాడ సత్యమ్మ, బోడమ్మ, కొమ్ము గౌరి, దొగ్గ సత్తమ్మ తదితరులు పాల్గొన్నారు. ఆందోళనకు ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు సిహెచ్‌ ముఖేష్‌ మద్దతు తెలిపారు. గాంధీ విగ్రహం వద్ద నిరసన
మద్యం పాలసీని నిరసిస్తూ విజయనగరం పట్టణంలోని కన్యకాపరమేశ్వరి ఆలయం వద్ద గల గాంధీ విగ్రహం వద్ద ఐద్వా ఆధ్వర్యాన మహిళలు నిరసన తెలిపారు. జీవో కాపీలను దహనం చేశారు. ఈ సందర్భంగా ఐద్వా ఉపాధ్యక్షులు పి.రమణమ్మ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆదాయం పెంచుకునేందుకు మద్యాన్ని విచ్చలవిడిగా అమ్మాలని ప్రభుత్వమే షాపులను ఏర్పాటు చేయడం దారుణమని అన్నారు. ఇప్పటికే మద్యం బారినపడి అనేక కుటుంబాలు వీధిన పడ్డాయన్నారు. మద్యం ప్రభావంవల్ల యువత అనేక పెడధోరణులు పడుతున్నారన్నారు. ఎన్నో కుటుంబాలను రోడ్డుపాలు చేసి, మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలకు కారణమైన మద్యం పాలసీని వెంటనే విరమించుకోవాలని ఆమె డిమాండ్‌ చేశారు. లేదంటే రానున్న కాలంలో ఉద్యమాన్ని మరింత ఉదృతం చేస్తామని ఆమె హెచ్చరించారు. కార్యక్రమంలో ఐద్వా నాయకులు ఆదిలక్ష్మి పాల్గొన్నారు.

కార్మిక హక్కులు హరిస్తున్న ప్రభుత్వాలు...

- సిఐటియు రాష్ట్ర కార్యదర్శి ఎవి నాగేశ్వరరావు
కార్మిక హక్కులను అమలు చేయకపోగా ఉన్న హక్కులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు హరిస్తున్నాయని సిఐటియు నగర కార్యదర్శి ఎవి.నాగేశ్వరరావు అన్నారు. సిఐటియు విజయవాడ నగర కమిటీ విస్తృత సమావేశం దుర్గాపురంలోని సిఐటియు నగర కార్యాలయంలో గురువారం రాత్రి జరిగింది. సిఐటియు నగర కార్యదర్శి టి.ప్రభుదాస్‌ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పాల్గొన్న నాగేశ్వరరావు మాట్లాడుతూ బిజెపి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ముందు కార్మిక సంక్షేమమే ధ్యేయమని ప్రకటించిన నాయకులు పదవీ చేపట్టిన తర్వాత కార్మికులపై దాడి చేస్తున్నారని మండిపడ్డారు. ప్రధాని నరేంద్రమోడీ కార్మికులకు సంబంధించిన అన్ని సంక్షేమ పధకాలను తొలగించి కార్మికులకు ఉపాధి, భద్రత లేకుండా చేస్తున్నారన్నారు. ప్రవేటు రంగంలోని ఎల్‌ఐసి, బిఎస్‌ఎన్‌ఎల్‌ వంటి సంస్థలను ప్రవేటీకరణ చేసేందుకు చూస్తున్నారని తెలిపారు. స్వదేశీ పేరు చెప్పిన బిజెపి ప్రభుత్వం నేడు విదేశీ కంపెనీలకు దేశ సంపదనను కట్టబెట్టే చర్యలకు దిగిందని ఎద్దేవా చేశారు. సిఐటియు నగర ప్రధానకార్యదర్శి ముజఫర్‌ అహ్మద్‌ మాట్లాడుతూ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు కార్మిక హక్కులను కాలరాసే చర్యలు చేపడుతున్నారు. దొడ్డిదారిన కార్మిక చట్ట సవరణలు చేశారని, దీనికి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. కార్మిక వర్గంపై జరుగుతున్న ముప్పేట దాడులు, కార్మిక వ్యతిరేఖ విధానాలను నిరసిస్తూ సెప్టెంబర్‌ 2న జరిగే దేశ వ్యాప్త సమ్మెలో, జులై 5న జరిగే రాష్ట్ర సదస్సుల్లో పెద్ద సంఖ్యలో కార్మికులు పాల్గొనాలని కోరారు. అందుకు సిఐటియుగా కార్మికులను చైతన్య పరిచి సమాయత్తం చేయాలని పిలుపునిచ్చారు. 

మధ్యాహ్న భోజన పథకం కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

- యూనియన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్వరూపరాణి

 ప్రభుత్వ పథకంగా ఉన్న మధ్యాహ్న భోజన పధకాన్ని అమలు చేస్తున్న కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వాలు తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నాయని మభ్యాహ్న భోజన పధకం కార్మికుల యూనియన్‌ (సిఐటియు) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.స్వరూపరాణి అన్నారు. మధ్యాహ్న భోజన పధకం కార్మికుల నగర కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం దుర్గాపురంలోని సిఐటియు నగర కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో స్వరూపరాణి పాల్గొని మాట్లాడుతూ విద్యార్థులకు భోజనం పెట్టే పధకాన్ని సక్రమంగా నిర్వహించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులు రాష్ట్రాలకు ఒకేసారి అందుతున్నా ఆ నిధులను రాష్ట్ర ప్రభుత్వం పక్కదాని పట్టిస్తూ ఏజెన్సీలకు బిల్లులు నెలల తరబడి చెల్లించడం లేదని తెలిపారు. ఏడు నెలలకు పైగా ఏజెన్సీలకు ఇవ్వాల్సిన బిల్లులు పెండింగ్‌లో ఉండటంతో ఏజెన్సీల నిర్వాహకులు చేసిన అప్పులు తీర్చలేక ఆత్మహత్యలకు పాల్పడే పరిస్థితులు నెలకొంటున్నాయని తెలిపారు. బిల్లులు చెల్లించక పోగా మధ్యాహ్న భోజన పధకాన్ని ఇస్కాన్‌, నాంది, అక్షయపాత్ర వంటి వాటికి ఏజెన్సీలను అప్పగించడం సరికాదన్నారు. పారిశ్రామిక వేత్తలకు పెద్దపీట వేసే ఉద్దేశంతోనే ప్రభుత్వాలు ఇటువంటి చర్యలకు దిగుతున్నాయని మండిపడ్డారు. మధ్యాహ్న భోజన పధక కార్మికుల సమస్యలుగా ఉన్న కనీస వేతనం ఇవ్వాలని, బ్యాంకర్ల ద్వారా ఏజెన్సీలకు రుణాలు అందజేయాలని, బిల్లుల సకాలంలో చెల్లించాలని, గ్యాస్‌, రెండు జతల యూనిఫారం, ఇన్సూరెన్స్‌ పధకాల వర్తింపు వంటి సమస్యలపై జులైలో ఛలో కమిషనరేట్‌ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. సిఐటియు నగర కార్యదర్శి ఎంవి.సుధాకర్‌ మాట్లాడుతూ స్కీమ్‌ వర్కర్లుగా ఉన్న మధ్యాహ్న భోజన పధక కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించకపోగా ఏకంగా పధకాన్ని నిర్వీర్యం చేసే దిశగా సిఎం చర్యలు తీసుకోవడం సహేతుకం కాదన్నారు. స్కీం వర్కర్ల సమస్యల పరిష్కార క్రమంలో భాగంగా దేశ వ్యాప్తంగా సెప్టెంబర్‌ 2న సార్వత్రిక సమ్మె జరగనుందని, ఆ సమ్మెలో కార్మికులంతా పాల్గొనాలని కోరారు. సమ్మెకు సంఘీభావంగా జులై 5న తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగే కార్మిక వర్గాల రాష్ట్ర సదస్సును జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. యూనియన్‌ నాయకురాలు ఎ.దుర్గాభవానీ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో నాయకులు సిహెచ్‌.పాపాలక్ష్మీ, వి.దుర్గాభవానీ, ఆర్‌.ప్రసన్నలక్ష్మీ, జి.రమాదేవి తదితరులు పాల్గొన్నారు. 
నూతన నగర కమిటీ ఎన్నిక
2015 ఏడాదికి మధ్యాహ్న భోజన పధక కార్మికుల యూనియన్‌ (సిఐటియు) నగర నూతన కమిటీిని ఎన్నుకున్నారు. అధ్యక్షురాలిగా వి.దుర్గాభవానీ, కార్యదర్శిగా సిహెచ్‌.పాపాలక్ష్మీ, కోశాధికారిగా జి.రమాదేవితో పాటు ఎనిమిది మంది ఆఫీస్‌ బేరర్స్‌తో కలిపి మొత్తంగా 15 మందితో కమిటీని ఎన్నుకున్నారు.

Friday, 26 June 2015

సమస్యలు పరిష్కరించకుంటే సమ్మె తప్పదు...

- 9న రాష్ట్రంలో అన్ని మున్సిపాల్టీల్లో సదస్సులు
- జూలై ఒకటి తర్వాత నిరవధిక సమ్మెకు సిద్ధం
- రాష్ట్ర సదస్సులో పలు తీర్మానాలు

 మున్సిపల్‌ కార్మికులకు కనీస వేతనం రూ. 15,432లకు పెంపు, ఇంజనీరింగ్‌ కార్మికులకు స్కిల్డ్‌, సెమీ స్కిల్డ్‌ జీతాలు, పర్మినెంట్‌ ఉద్యోగులకు జిపిఎఫ్‌ అకౌంట్లు, హెల్త్‌కార్డులు, 010 పద్దు ద్వారా జీతాలు, ఎన్‌ఎంఆర్‌ కాంట్రాక్టు ఔట్‌సోర్సింగ్‌ కార్మికుల రెగ్యులరైజేషన్‌, ప్రమాద బీమా రూ. 5 లక్షలు తదితర డిమాండ్లను జులై 1లోగా పరిష్కరించాలని విజయవాడలో జరిగిన ఎపి రాష్ట్ర మున్సిపల్‌ ఉద్యోగులు, కార్మికుల ఐక్య కార్యాచరణ కమిటీ(జెఎసి) రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తూ తీర్మానించింది. 1లోగా పరిష్కరించకపోతే ఆరోజు తరువాత ఎప్పటినుండైనా సమ్మెకు దిగుతామని సదస్సు హెచ్చరించింది. సమస్యలు పరిష్కారం కోరుతూ జెఎసి ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక హనుమంతరాయ గ్రంథాలయంలో రాష్ట్ర సదస్సు నిర్వహించారు. సమస్యల పరిష్కారం కోసం సమిష్టి పోరాటాలే ఏకైక మార్గమని పలు కార్మిక సంఘాలకు చెందిన రాష్ట్ర నాయకులు ఉద్ఘాటించారు. ఈనెల 29న అన్ని మున్సిపల్‌ పట్టణాల్లో సదస్సులు నిర్వహిస్తామని చెప్పారు. సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంఎ గఫూర్‌ మాట్లాడుతూ, పారిశుధ్య కార్మికులకు కనీస వేతనం రూ. 15 వేలు కూడా ఇవ్వకుండా వెట్టిచాకిరీ చేయించుకుంటున్నారన్నారు. కష్టించి పనిచేసే కార్మికులకు కనీస వేతనాలిచ్చేందుకు చేతులురాని పాలకులు, ఎంఎల్‌సి ఎన్నికల్లో ఒక్కో ఎంఎల్‌ఎను కొనుగోలు చేసేందుకు కోట్లు ఖర్చు చేస్తున్నారని విమర్శించారు. ఎఐటియుసి రాష్ట్ర కార్యదర్శి బి.తులసేంద్ర మాట్లాడుతూ, కార్మికులకు పిఆర్‌సి విషయంలో అన్యాయం జరిగితే సహించేది లేదన్నారు. మున్సిపల్‌ కార్మిక సంఘాలు ఐక్యంగా ఉద్యమిస్తేనే సమస్యలు పరిష్కరమవుతాయన్నారు. ఎపి మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌(సిఐటియు) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ఉమామహేశ్వరరావు, ఎపి మున్సిపల్‌ వర్కర్స్‌ యూనియన్‌(ఎఐటియుసి) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆసుల రంగనాయకులు మాట్లాడుతూ, సెప్టెంబర్‌ 2న జరిగే దేశవ్యాప్త సమ్మెలో మున్సిపల్‌ ఉద్యోగ, కార్మికులు పాల్గొనాలన్నారు. మున్సిపల్‌ శాఖ మంత్రి కార్మిక సంఘాల జెఎసి నాయకులను ఈనెల 29వ తేదీ సాయంత్రం మూడు గంటలకు చర్చలకు ఆహ్వానించినట్లు నాయకులు తెలిపారు. సదస్సుకు రాష్ట్ర నలుమూలల నుండి పెద్ద ఎత్తున మున్సిపల్‌ కార్మికులు తరలిరావడంతో హనుమంతరాయ గ్రంథాలయం కిక్కిరిసిపోయింది. సిఐటియు నాయకులు పి.వెంకటరెడ్డి అధ్యక్షతన జరిగిన సదస్సులో మున్సిపల్‌ రంగానికి చెందిన బి.ఎంఎస్‌ రాష్ట్ర నాయకులు ఎంబిజి నాయుడు, దశరధ రామరాజు, ఐఎన్‌టియుసి నాయకులు వై.వి.రమణ, వెంకటరత్నంనాయుడు, గుంటూరు స్వతంత్ర సంఘం నాయకులు వరికల్లు రవికుమార్‌, ఎస్‌.శంకరరావు, మధు, మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయిస్‌ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షులు కె.సామ్రాజ్యం, నాయకులు ఎం.డేవిడ్‌, ఎఐటియుసి నాయకులు జేమ్స్‌ పాల్గొన్నారు.




కార్మిక సంఘాల సదస్సును జయప్రదం చేయాలి : సిఐటియు.

ఉద్యోగ, కార్మిక హక్కులను కాలరాస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని నిరసిస్తూ జులై 5న విజయవాడ నగరంలో నిర్వహించనున్న కార్మిక సంఘాల రాష్ట్ర సదస్సును జయప్రదం చేయాలని సిఐటియు నగర కార్యదర్శి టి.ప్రభుదాస్‌ కోరారు. గురువారం దుర్గాపురంలోని సిఐటియు నగర కార్యాలయంలో సిఐటియు సెంట్రల్‌ జోన్‌ -2 కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రభుదాస్‌ పాల్గొని మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక హక్కులను హరించే విధంగా పాలన సాగిస్తున్నాయని తెలిపారు. ఎన్నికలకు ముందు కార్మికులకు అనేక వరాలు గుప్పించిన పాలక పార్టీలు ఎన్నికల్లో గెలిచిన తరువాత బడా పారిశ్రామిక వేత్తలకు అనుకూలంగా పాలన సాగిస్తున్నారన్నారు. ఇటువంటి తరుణంలో అన్ని కార్మిక సంఘాలు సెప్టెంబర్‌ 2వ తేదీన దేశ వ్యాప్తంగా సార్వత్రిక సమ్మెకు పిలుపునిచ్చాయని పేర్కొన్నారు. ఈ సమ్మెకు సమాయత్తమయ్యేందుకు రాష్ట్రంలోని కేంద్ర కార్మిక సంఘాల నాయకత్వం జులై 5న నగరంలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో రాష్ట్ర స్థాయి సదస్సును నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సదస్సుకు అన్ని రంగాల్లోని కార్మికులు పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు సదస్సు పోస్టర్‌ను ఆవిష్కరించారు. పోస్టర్‌ ఆవిష్కరణలో సిఐటియు సెంట్రల్‌ జోన్‌ -2 కమిటీ ఉపాధ్యక్షులు పి.కృష్ణమూర్తి, కార్యదర్శి ఎం.బాలాజీ, పెన్షనర్ల అసోసియేషన్‌ నాయకులు మల్లంపల్లి సాంబశివరావు, షాపు గుమస్తాల సంఘం నగర నాయకులు సుబ్బారావు, ఆటో వర్కర్స్‌ యూనియన్‌ నాయకులు రోజోలు, బిల్డింగ్‌ వర్కర్స్‌ యూనియన్‌ నాయకులు నాగరాజు పాల్గొన్నారు.

మద్యంపాలసీ పై మహిళల యుద్దం...అరెస్టు చేసిన పోలీసులు..

తెలుగుదేశం ప్రభుత్వం ప్రకటించిన నూతన ఎక్సైజ్‌ పాలసీని వ్యతిరేకిస్తూ విశాఖపట్నంలో మహిళా సంఘాలు పెద్దఎత్తున నిరసన చేపట్టాయి. సిఐటియు కార్యాలయం నుంచి మహిళలు జగదాంబ జంక్షన్‌ వరకు ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ తెన్నేటి జంక్షన్‌ దాటి ముందుకు సాగుతుండగా పోలీసులు అడ్డుకున్నారు. మద్యం వద్దు మంచినీళ్లు కావాలి, షాపింగ్‌ మాల్స్‌లో కూడా మద్యం అమ్మకాలు జరిపేలా చేస్తామనడం దుర్మార్గమంటూ మహిళలు పెద్దపెట్టున నినాదాలు చేశారు. చంద్రబాబు మాస్క్‌కు మద్యం పడుతున్నట్లు కొందరు మహిళలు మద్యం సీసాలను ఉంచి నిరసన తెలిపారు. మరికొందరు నూతన ఎక్సైజ్‌ పాలసీ జీవోలను చించివేశారు. ఈ చర్యలను పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. చంద్రబాబు మాస్క్‌ను కొందరు మహిళలు దహనం చేయగా, మరికొందరు మహిళలు మాస్క్‌లను కాళ్లతో తొక్కి నిరసన తెలిపారు. దీంతో పోలీసులు ఆగ్రహించారు. దొరికిన వారిని దొరికనట్టుగా బలవంతంగా ఈడ్చుకుంటూ వ్యాన్‌లో పడేసి టుటౌన్‌ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అరెస్ట యిన వారిలో ఐద్వా రాష్ట్ర అధ్యక్షులు బి.ప్రభావతి, నగర అధ్యక్ష, కార్యదర్శులు బి.పద్మ, ఆర్‌ఎన్‌ మాధవి, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కె.ద్రాక్షాయిని, కె.నాగరాణి, ఎపి మహిళా సమాఖ్య జిల్లా కార్యదర్శి ఎ.విమల, బేగం, పిఓడబ్ల్యుకు చెందిన ఇందిర, వెంకట లకిëతోపాటు 20 మంది ఉన్నారు.

కార్మికుల సమస్యలు పరిష్కరించాలని భెల్‌ ఛైర్మన్‌కు తపన్‌సేన్‌ లేఖ....

భెల్‌ విశాఖ యూనిట్‌ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సిఐటియు ఆల్‌ ఇండియా ప్రధాన కార్యదర్శి తపన్‌సేన్‌ భెల్‌ ఛైర్మన్‌కు లేఖ రాశారని భెల్‌ గుర్తింపు యూనియన్‌ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎస్‌.సుధాకర్‌, జిటిపి ప్రకాష్‌ గురువారం తెలిపారు. 1992 వేతన సవరణకు సంబంధించిన సమస్య పరిష్కరించాలని, ఈ సమస్యపై గతంలో ఇచ్చిన హామీని కూడా లేఖలో గుర్తుచేశారని తెలిపారు. కార్మికులకు మెడికల్‌, ఫెన్షన్‌ స్కీము కోర్టు పరిధిలో లేని అంశాలను తక్షణమే పరిష్కరించాలని కోరినట్లు పేర్కొన్నారు.

Thursday, 25 June 2015

మిషన్‌ మోడ్‌ వద్దు...

- ఐసిడిఎస్‌ను యథావిధిగా కొనసాగించాలి
- అంగన్‌వాడీల ధర్నా

 ఐసిడిఎస్‌ పరిరక్షణకు జిల్లా వ్యాప్తంగా సాగిన జీపు జాతా బుధవారం జిల్లా కేంద్రమైన చిత్తూరుకు చేరుకుంది. ఈ సందర్భంగా చిత్తూరు ప్రాజెక్టుకు చెందిన అంగన్‌వాడీలు గాంధీ విగ్రహం ఎదుట 'మిషన్‌మోడ్‌ వద్దు యథావిధిగా కొనసాగించాలి...' అంటూ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌హెల్పర్స్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్షురాలు సృజని మాట్లాడుతూ దేశంలో పిల్లల్లో పోషకాహార లోపాన్ని, శిశు మరణాలను తగ్గించేందుకు ఐసిడిఎస్‌ను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ప్రస్తుతం ఈ పథకాన్ని మిషన్‌మోడ్‌ పద్ధతికి మార్చడం వల్ల ఈ పథకం ఉద్దేశం నీరుగారే అవకాశం ఉందన్నారు. దీన్ని తమ సంఘం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు. ఐసిడిఎస్‌ పరిరక్షణకు ఈనెల 19 నుంచి చిత్తూరు నుంచి కార్వేటినగరం, జిడి నెల్లూరు, పులిచర్ల, బంగారుపాళ్యం, చిత్తూరు ప్రాజెక్టు పరిధిలోని అన్ని మండలాల్లో పర్యటించి అంగన్‌వాడీలను చైతన్య పరిచినట్లు చెప్పారు.  జీపు జాతాకు నాయకత్వం వహించిన సిఐటియు జిల్లా అధ్యక్షులు చైతన్య మాట్లాడుతూ ఐసిడిఎస్‌ మిషన్‌ పేరుతో అంగన్‌వాడీ సెంటర్లను మూసి వేసేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తోందన్నారు. దీన్ని కాపాడుకొనేందుకు అంగన్‌వాడీలు, ఆయాలతో పాటు లబ్ధిదారులు కూడా పోరాటాలకు కలసి రావాలన్నారు. మిషన్‌మోడ్‌ నిబంధనల ప్రకారం అంగన్‌వాడీ సెంటర్లు 10 శాతం స్వచ్ఛంద సంస్థలకు అప్పగించాలని ప్రయోత్నిస్తోందన్నారు. సిఐటియు పట్టణ కార్యదర్శి గణపతి మాట్లాడుతూ అంగన్‌వాడీ సెంటర్లను ప్రయివేటు వ్యక్తులకు అప్పగిస్తే మరో పోరాటానికి అంగన్‌వాడీలు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ ఆధీనంతో నడస్తున్న అంగన్‌వాడీ కేంద్రాలు గ్రామీణ స్థాయిలో సేవలందిస్తున్నాయని, ఇలాంటి కేంద్రాలను ప్రయివేటు వ్యక్తులు ఇవ్వడం సరికాదన్నారు. ఈ కార్యక్రమంలో కెవిపిఎస్‌ జిల్లా అధ్యక్షులు సురేంద్ర, అంగన్‌వాడీ యూనియన్‌ నేతలు జయంతి, బుజ్జి, మమత, సునీతలతో పాటు అంగన్‌వాడీలు పాల్గొన్నారు.

Wednesday, 24 June 2015

5న రాష్ట్ర సదస్సును విజయవంతం చేయాలి....

- సిఐటియు ఆధ్వర్యంలో పోస్టర్‌ ఆవిష్కరణ..

 సెప్టెంబర్‌ 2న జరగబోయే దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలని కోరుతూ జూలై 5న విజయవాడలోని తుమ్మలపల్లి క్షేత్రయ్య కళాక్షేత్రంలో అన్ని కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించే రాష్ట్రస్థాయి సదస్సును కార్మిక, ఉద్యోగవర్గం పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని సిఐటియు తూర్పుజోన్‌-1 కార్యదర్శి వి.గురుమూర్తి కోరారు. ఈ సందర్భంగా బుధవారం రాణిగారితోటలోని సిఐటియు కార్యాలయంలో రాష్ట్ర సదస్సు పోస్టర్‌ను ఆవిష్కరించారు.గురుమూర్తి మాట్లాడుతూ కేంద్రంలో ప్రధాని మోడి, రాష్ట్రంలో సిఎం చంద్రబాబుల నేతృత్వంలోని ప్రభుత్వాలు కార్మిక, ఉద్యోగ వ్యతిరేక విధానాలు అనుసరిస్తున్నాయని పేర్కొన్నారు. అనేక త్యాగాలు చేసి సాధించుకున్న చట్టాలను మార్పులు చేస్తూ ఉన్న హక్కులపై దాడి చేసే పనికి పూనుకుంటున్నాయన్నారు. సమస్యలు పరిష్కరించమని అడగటానికి వెళ్లిన కార్మిక సంఘాల నాయకులకు సమయం ఇవ్వని సిఎం చంద్రబాబు, సింగ్‌పూర్‌, జపాన్‌, మలేషియా, చైనా లాంటి దేశాలు పర్యటిస్తూ అక్కడి కార్పొరేట్‌ కంపెనీలకు రాష్ట్ర ప్రభుత్వం రెడ్‌ కార్పెట్‌ పరుస్తుందని దుయ్యబట్టారు. ప్రజల కష్టార్జితంతో నిర్మించుకున్న జాతి సంపద అయిన ప్రభుత్వ రంగాన్ని ప్రయివేటు రంగానికి దారాదత్తం చేయడానికి ప్రభుత్వాలు పూనుకుంటున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికలకు ముందు వరకు ధరలు తగ్గిస్తామని ఉదరగొట్టిన ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చి ఏడాది గడిచినా నిత్యావసర వస్తువుల ధరలు నింగినంటుతున్నాయని పేర్కొన్నారు. కార్మిక హక్కుల సాధన కోసం దేశ వ్యాప్తంగా సెప్టెంబర్‌ 2న నిర్వహించే సమ్మెలో కార్మిక, ఉద్యోగ వర్గం పెద్ద ఎత్తున పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జోన్‌ అధ్యక్షులు టి.చంద్రశేఖర్‌, నాయకులు భాను, డి.రమణ, మునిసిపల్‌ వర్కర్స్‌ యూనియన్‌ జోన్‌ కార్యదర్శి ఎస్‌.జ్యోతిబాస్‌, రిక్షా వర్కర్స్‌ యూనియన్‌ నాయకులు ఈదయ్య తదితరులు పాల్గొన్నారు. 

రాష్ట్ర సదస్సు పోస్టర్‌...

  ఈ నెల 26న నగరంలోని తుమ్మలపల్లి క్షేత్రయ్య కళాక్షేత్రంలో జరిగే రాష్ట్ర సదస్సుకు సంఘటిత, అసంఘటిత రంగాల్లో పనిచేసే కార్మికులు తరలిరావాలని మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌(సిఐటియు) నగర కార్యదర్శి ఎం.డేవిడ్‌, సింగ్‌నగర్‌ సిఐటియు జోన్‌ కార్యదర్శి కె.దుర్గారావు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సదస్సు వివరాలను వెల్లడిస్తూ ప్రచురించిన పోస్టర్‌ను 55వ డివిజన్‌ కృష్ణాహోటల్‌ సెంటర్‌లోని శానిటరీ కార్యాలయంల వద్ద ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై సంఘటిత ఉద్యమాలతో కార్మికులు ముందుకు వెళ్లాలన్నారు. కార్మికుల హక్కులను కాలరాసేందుకు యత్నిస్తున్న పెట్టుబడిదారి వర్గ ప్రభుత్వాలకు తగిన రీతిలో బుద్ధి చెప్పాలన్నారు. నగరంలోని కార్మికులంతా రాష్ట్ర సదస్సుకు తరలిరావాలని విజ్ఞప్తి చేశారు.
ఆవిష్కరణ

పదో వేతన సవరణ సంఘం సిఫార్సు ప్రకారం మున్సిపల్‌ కార్మికులకు కనీస వేతనం రూ.15,432లు చెల్లించాలని మున్సిపల్‌ కార్మికుల ఐక్య కార్యాచరణ కమిటీ డిమాండ్‌ ....


పదో పిఆర్‌సి ప్రకారం కనీస వేతనం చెల్లించాలి....

- కాదంటే రాష్ట్ర వ్యాప్త సమ్మె
- మున్సిపల్‌ కార్మికుల ఐక్య కార్యాచరణ కమిటీ హెచ్చరిక

పదో వేతన సవరణ సంఘం సిఫార్సు ప్రకారం మున్సిపల్‌ కార్మికులకు కనీస వేతనం రూ.15,432లు చెల్లించాలని మున్సిపల్‌ కార్మికుల ఐక్య కార్యాచరణ కమిటీ డిమాండ్‌ చేసింది. బుధవారం స్థానిక మున్సిపల్‌ కార్యాలయం వద్ద ఈ నెల 26న విజయవాడలో నిర్వహించనున్న మున్సిపల్‌ కార్మికుల రాష్ట్ర సదస్సు వాల్‌పోస్టర్‌ను జెఎసి నాయకులు కె.శ్రీనివాస్‌, ఎన్‌.బలరాం, ఎన్‌.రాజారావు, జె.గురుమూర్తి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్‌ మాట్లాడుతూ కనీస వేతనం చెల్లించకుంటే రాష్ట్ర వ్యాప్త సమ్మెకు దిగుతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఇంజనీరింగ్‌, ఎలక్ట్రికల్‌ సిబ్బందికి, కంటింజెంట్‌ పారిశుధ్య కార్మికులకు కనీస వేతనాలివ్వాలని డిమాండ్‌ చేశారు. కాంట్రాక్టు ఉద్యోగులను, కార్మికులను క్రమబద్ధీకరించాలన్నారు. పిఎఫ్‌, బీమా బకాయిలను చెల్లించి, ఖాతాలను పునరుద్ధరించాలని చెప్పారు. పెరుగుతున్న పట్టణ అవసరాలకు అనుగుణంగా జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల్లోనూ సిబ్బందిని అదనంగా నియమించాలని కోరారు. మున్సిపల్‌ సిబ్బందికి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో ఎల్‌.రాంబాబు, ఎన్‌.వెంకటరమణ, డి.గోవిందరావు, బి.మంగరాజు, జె.రమేష్‌, వేణుగోపాల్‌, గణేష్‌; తదితరులు పాల్గొన్నారు.

“All-India general strike on September 2, 2015. The national convention calls upon the trade unions and working people irrespective of affiliations to unite and make the country-wide general strike a massive success,” said a declaration at national convention of workers, under the aegis of Bharatiya Mazdoor Sangh (BMS).The convention had participants from INTUC, AITUC, HMS, CITU, AIUTUC, TUCC, SEWA, AICCTU, UTUC and LPF. “The government’ aim in aggressively pushing through sweeping changes in labour laws is nothing but to push out overwhelming majority of workers out of the coverage of all labour laws and to drastically curb the trade union rights,” the declaration said.


Tuesday, 23 June 2015

5న కార్మిక వ్యతిరేక విధానాలపై రాష్ట్ర సదస్సు...

- పోస్టర్‌ ఆవిష్కరించిన సిఐటియు నాయకులు.

 కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరి స్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా వచ్చే నెల 5న విజయవాడలో కార్మిక సంఘాల రాష్ట్ర సదస్సును జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి వై.నేతాజి పిలుపునిచ్చారు. మంగళవారం పాతగుంటూరులోని సిఐటియు జిల్లా కార్యాలయంలో సదస్సు పోస్టర్‌ను నాయకులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నేతాజి మాట్లాడుతూ ప్రభుత్వాలు ఎన్నికల్లో ఇచ్చిన వాగ్ధానాలు అమలు చేయకపోగా, కార్మికులకు నష్టం కలిగించే పలు విధానాలు, చట్ట సవరణలు చేపడుతున్నాయని మండిపడ్డారు. కార్పొరేట్‌ శక్తులకు అనుకూలంగా వ్యవహరిస్తూ కార్మిక హక్కుల్ని కాలరాస్తున్నాయని విమర్శించారు. కొత్తగా చేపట్టిన కార్మిక చట్టాల సవరణలు యాజమాన్యాల దయాదాక్షిణ్యాలకు కార్మికులను బలిపెట్టే విధంగా ఉన్నాయనీ, మన రాష్ట్ర ప్రభుత్వం వాటికి ఆమోదం తెలపటం పాలకుల వర్గ స్వభావాన్ని తెలియ చేస్తుందన్నారు. శీతాకాల సమావేశాల్లో ఆయా సవరణల బిల్లు పార్లమెంట్‌ ముందుకు రానున్నందున బిల్లు ఆమోదం పొందకుండా కార్మికులు పెద్ద ఎత్తున పోరాడాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర సదస్సులో కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని జయద్రం చేయాలని కోరారు. పోస్టర్‌ ఆవిష్కరణ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు కె.నళినీకాంత్‌, జిల్లా నాయకులు కాకుమాను నాగేశ్వరరావు, దండా లక్ష్మీనారా యణ, కె.శ్రీనివాస్‌, బాబూ ప్రసాద్‌, రవి, ఎవిఎన్‌ గోపాల్‌, టి.రవిశంకర్‌ పాల్గొన్నారు.
కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, ఉద్యోగ వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ మోడీ ప్రభుత్వానికి హెచ్చరికగా సెప్టెంబరు 2న దేశవ్యాప్తంగా జరగనున్న సార్వత్రిక సమ్మె జయప్రదం చేయాలని సి.ఐ.టి.యు రాష్ట్ర ప్రథాన కార్యదర్శి ఎం.ఏ.గపూర్ పేర్కొన్నారు. ఈ సమ్మెలో రాజకీయాలు, సంఘాల అనుబంధాలకు అతీతంగా కార్మికులు, ఉద్యోగులందరూ చైతన్యవంతంగా పాల్గొనాలని అన్నారు. 

29న రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు: ఐద్వా.

తెలుగుదేశం ప్రభుత్వం ప్రకటించిన నూతన మద్యం విధానాన్ని నిరసిస్తూ ఈనెల 29న రాష్ట్రవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు నిర్వహించను న్నట్లు అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) రాష్ట్ర కార్యదర్శి డి.రమాదేవి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన షాపుల కేటాయింపులను నిలుపు దల చేయాలని వివరించారు. విజయవాడ గవర్నర్‌ పేట లోని సుందడిమాండ్‌ చేస్తూ నూతన మద్యం విధానంపై జారీ చేసిన జీవోలను దగ్ధం చేస్తామని వివరించారు. 
విజయవాడ గవర్నర్‌పేట లోని సుందరయ్య భవన్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. నూతన మద్యం విధానాన్ని ఐద్వా తీవ్రంగా ఖండిం చారు. టిడిపి వ్యవస్థాపక అధ్యక్షులు ఎన్‌టిఆర్‌ హయాంలో సారా సీసాలతోపాటు ప్యాకెట్లనూ అందుబాటులోకి తెచ్చి మద్యం ద్వారా వచ్చే ఆదాయాన్ని నాలుగు రెట్లు పెంచారన్నారు. తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు మద్యం ద్వారా రూ. 40 వేల కోట్ల మేర ఆదాయం వస్తున్నా చాలదన్నట్లుగా మద్యం అమ్మకాలను విచ్చలవిడి చేసేందుకు ప్రయత్నిస్తున్నారని విమ ర్శించారు. గుడి, బడి దగ్గరలో మద్యం షాపులకు అనుమతి ఇవ్వ బోమం టూనే వాస్తవ పరి స్థితుల్లో నిబంధనలు మా త్రం పట్టించుకోవడం లేదన్నారు. గతంలో 4,380 మద్యం దుకాణాలకు లైసెన్స్‌ ఇస్తే మహిళల తిరుగు బాటుతో 400 దుకాణాలు మూతబడ్డాయన్నారు. తాజాగా ప్రభుత్వం ప్రకటించిన విధానంలో మద్యం షాపులు, లైసెన్సులతో పనిలేకుండా కూల్‌ డ్రింక్‌ షాపుల్లో కూడా మద్యం టెట్రాప్యాక్‌లు ఉండేలా ప్ర భుత్వం ప్రయత్నిస్తోందన్నారు. నూతన మద్యం పాలసీకి వ్యతిరేకంగా ఇతర మహిళా, ప్రజా సంఘాలు, కలిసొచ్చే రాజకీయ పార్టీలనూ కలుపు కుని గ్రామగ్రామానా ఉద్యమిస్తామని చెప్పారు. సమా వేశంలో ఐద్వా నాయకులు కె.శ్రీదేవి, పి.విజయ, కె.సరోజ పాల్గొన్నారు.

'మధ్యాహ్న భోజనం' ఇస్కాన్‌కు ఇవ్వొద్దు....

- కమిషనర్‌ కార్యాలయాన్ని ముట్టడించిన కార్మికులు..

గుంటూరు నగరంలో మధ్యాహ్న భోజన పథకం నిర్వహణను 'ఇస్కాన'్‌కు ఇవ్వాలనే ప్రతిపాదన విరమించుకోవాలని ఎపి మధ్యాహ్న భోజన కార్మికుల యూనియన్‌(సిఐటియు) ఆధ్వర్యంలో కార్మికులు మంగళవారం నగరపాలక సంస్థ కార్యాలయాన్ని ముట్టడించారు. కార్యాలయం గేటు ఎదుట భైఠాయించి మా కడుపులు కొట్టొందంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఇస్కాన్‌కు అప్పగిస్తే సహించేది లేదని నాయకులు హెచ్చరించారు. అనంతరం కమిషనర్‌ కన్నబాబును కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కృష్ణా-గుంటూరు జిల్లాల పిడిఎఫ్‌ ఎమ్మెల్సీ బొడ్డు నాగేశ్వరరావు మాట్లాడుతూ, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో ఇస్కాన్‌ నిర్వహణ సరిగా లేదని అనేక ఆరోపణలొచ్చిన నేపథ్యంలో ఇస్కాన్‌ కాంట్రాక్టును రద్దు చేస్తూ విద్యా శాఖ ఉత్త్వరులు జారీ చేసిందని, అటువంటి సంస్థకు గుంటూరులో పథకం అప్పజెప్పడం సరికాదని పేర్కొన్నారు. ఇస్కాన్‌కు అప్పగిస్తే ప్రభుత్వ లక్ష్యం దెబ్బతింటుందని, ఏళ్ల తరబడి పథకాన్ని నిర్వహిస్తున్న కార్మికులు ఉపాధి కోల్పోతారని వివరించారు. ఈ సందర్భంగా కమిషనర్‌ మాట్లాడుతూ, ఇస్కాన్‌కు అప్పగిస్తూ ప్రభుత్వం ఈ పాటికే నిర్ణయం తీసుకుందని తెలపగా, నిర్ణయాన్ని ఉపసంహరించుకునే వరకూ పోరాడతామని నాయకులు స్పష్టం చేశారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ కెయస్‌ లక్ష్మణరావు, యుటిఎఫ్‌ జిల్లా కార్యదర్శి ఎం.హనుమంతరావు, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షులు భగవాన్‌, సిఐటియు నగర కార్యదర్శి కె.శ్రీనివాస్‌, ఐద్వా జిల్లా కార్యదర్శి ఎంఆర్‌ దేవి కార్మికుల పోరాటానికి సంఘీభావం తెలిపారు.

Mid Day Meal Workers Union (CITU) National Level Foundation Conference June 21- 23 atBangalore










Monday, 22 June 2015

కేంద్ర ప్రభుత్వ కార్మిక, ఉద్యోగ విధానాలకు వ్యతిరేకంగా సార్వత్రిక సమ్మెకు సన్నద్ధం కండి...

- సిఐటియు జాతీయ కార్యదర్శి డాక్టర్‌ హేమలత
కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, ఉద్యోగ వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ మోడీ ప్రభుత్వానికి హెచ్చరికగా సెప్టెంబరు 2న దేశవ్యాప్తంగా జరగనున్న సార్వత్రిక సమ్మె జయప్రదం చేయాలని సిఐటియు అఖిల భారత కార్యదర్శి డాక్టర్‌ కె.హేమలత విజ్ఞప్తి చేశారు. ఈ సమ్మెలో రాజకీయాలు, సంఘాల అనుబంధాలకు అతీతంగా కార్మికులు, ఉద్యోగులందరూ చైతన్యవంతంగా పాల్గొనాలని అన్నారు. విశాఖనగరంలోని నండూరి ప్రసాదరావు భవనంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చీరాగానే తమ కర్కశమైన మొదటి దాడిని ప్రభుత్వాలు కార్మికవర్గంపైనే ప్రారంభించిందని అన్నారు. మోడీ పదే పదే అచ్చే దిన్‌ (మంచిరోజులు) తీసుకు వచ్చామని చెబుతున్నారని, వాస్తవానికి కార్మికులకు గోరేదిన్‌ (చెడ్డరోజులు) ప్రారంభమయ్యాయని అన్నారు. కేంద్రంలో కార్మికచట్టాలను రాజస్థాన్‌ తరహాలో మార్చటానికి పూనుకోవడం అమానుషమని విమర్శించారు. మోడీ అడుగుజాడల్లో రాష్ట్రంలో చంద్రబాబు కార్మిక చట్టాల మార్పునకు పూనుకుని కార్మికులపై దాడి చేయడం మరీ ఘోరమని అన్నారు. ఎక్కువమంది కార్మికులు కార్మిక చట్టాల పరిధిలోకి రాకుండా యజమానుల దయాదాక్షిణ్యాలకు కార్మికులను బలిపెట్టారని విమర్శించారు. దేశవ్యాప్తంగా కోట్ల సంఖ్యలో ఉన్న అంగన్‌వాడీ, మిడ్డేమీల్‌, ఆశ వంటి స్కీమ్‌ వర్కర్లకు ఏ విధమైన కనీస వేతనాలు, కార్మిక చట్టాలు, రిటైర్‌మెంట్‌ బెనిఫిట్స్‌, పెన్షన్‌ వంటి సౌకర్యాలు అమలు కావడం లేదని అన్నారు. స్కీమ్‌ వర్కర్లలో 90 శాతం మంది శ్రామిక మహిళలు బానిసల్లా పనిచేస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. 
 గతంలో మన్మోహన్‌ ప్రభుత్వ కాలం నుంచి కార్మిక సంఘాలన్నీ ఐక్యంగా కార్మిక సమస్యలపై పలు ఉద్యమాలను, సమ్మెలు నిర్వహించాయని గుర్తు చేశారు. అదే పోరాట ఐక్యతను ఇప్పుడు కూడా కొనసాగిస్తామని అన్నారు. మోడీ ప్రభుత్వం కార్మిక చట్టాలకు చేయదల్సిన సవరణలను వెంటనే విరమించాలన్నారు. ఎఫ్‌డిఐను 26 నుంచి 49 శాతానికి పెంచవద్దని చెప్పినా కార్మిక సంఘాలతో సంప్రదించకుండా, పార్లమెంటుతో సంబంధం లేకుండా ఆర్డినెన్స్‌లతో ఎఫ్‌డిఐలకు తలుపులు బార్లా తెరవడం దుర్మార్గమని అన్నారు. ఈ చర్య దేశ ప్రయోజనాలను విదేశాలకు తాకట్టుపెట్టడమేనని విమర్శించారు. 
కేంద్ర ప్రభుత్వం తాజాగా కార్మిక నిబంధనావళి బిల్లు 2015ను ప్రతిపాదిస్తుందని డాక్టర్‌ హేమలత తెలిపారు. 1926, 1947 నాటి మూడు చట్టాలను ఒకే చట్టంగా రూపొందించాలని కేంద్రం చూస్తుందని, అదే జరిగితే యజమానులకు, కార్పొరేట్‌ కంపెనీలకు లబ్ధి చేకూర్చటమే అవుతుందని అన్నారు. అదే సందర్భంలో ఉద్యోగులు, కార్మికులు చేస్తున్న పోరాటాలను ఉద్యమాలను అణచి వేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చూస్తున్నాయని విమర్శించారు. అందుకే అన్ని కార్మిక సంఘాలు ఏకతాటిపై వచ్చి సమ్మెకు పిలుపు ఇచ్చాయని అన్నారు. కార్మిక చట్టాలలో సవరణలను వెంటనే ఉపసంహరించుకోవాలని, యూనియన్‌ రిజిస్ట్రేషన్‌కు దరఖాస్తు చేసిన తర్వాత 45 రోజులకు తప్పనిసరిగా యూనియన్‌ రిజిస్ట్రేషన్‌ ఇవ్వాలని, కార్మిక చట్టాలను సక్రమంగా అమలు చేయాలని, ప్రజలందరికీ వర్తించే అధిక ధరలు అరికట్టాలని, ప్రభుత్వ రంగ పరిశ్రమల్లో పెట్టుబడులు ఉపసంహరణను ఎత్తివేయాలని డిమాండ్లతో సమ్మె చేస్తున్నామని తెలిపారు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను అనుమతించవద్దని, ఉపాధి కల్పనతో కూడిన అభివృద్ధి కావాలని, కనీస వేతనం రూ. 15 వేలు ఇవ్వాలని, కాంట్రాక్టు వ్యవస్థను రద్దుచేయాలని, అసంఘటిత రంగ కార్మికుల భద్రతకు దేశ స్థూల ఆదాయంలో 3 శాతం నిధులు కేటాయించాలని, కార్మికులకు, ఉద్యోగులకు పెన్షన్‌ అమలు చేయాలని, పిఎఫ్‌, ఇఎస్‌ఐ, బోనస్‌, గ్రాట్యూటీలపై ఉన్న అన్ని రకాల సీలింగులు ఎత్తివేయాలనే డిమాండ్ల సాధన కోసమే సెప్టెంబర్‌ 2 దేశవ్యాప్త సమ్మె ఉద్దేశమని తెలిపారు. ఈ సమావేశంలో సిఐటియు జిల్లా, నగర ప్రధాన కార్యదర్శులు ఎస్‌.రమేష్‌, ఎం.జగ్గునాయుడు పాల్గొన్నారు.