- కమిషనర్ కార్యాలయాన్ని ముట్టడించిన కార్మికులు..
గుంటూరు నగరంలో మధ్యాహ్న భోజన పథకం నిర్వహణను 'ఇస్కాన'్‌కు ఇవ్వాలనే ప్రతిపాదన విరమించుకోవాలని ఎపి మధ్యాహ్న భోజన కార్మికుల యూనియన్(సిఐటియు) ఆధ్వర్యంలో కార్మికులు మంగళవారం నగరపాలక సంస్థ కార్యాలయాన్ని ముట్టడించారు. కార్యాలయం గేటు ఎదుట భైఠాయించి మా కడుపులు కొట్టొందంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఇస్కాన్‌కు అప్పగిస్తే సహించేది లేదని నాయకులు హెచ్చరించారు. అనంతరం కమిషనర్ కన్నబాబును కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కృష్ణా-గుంటూరు జిల్లాల పిడిఎఫ్ ఎమ్మెల్సీ బొడ్డు నాగేశ్వరరావు మాట్లాడుతూ, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో ఇస్కాన్ నిర్వహణ సరిగా లేదని అనేక ఆరోపణలొచ్చిన నేపథ్యంలో ఇస్కాన్ కాంట్రాక్టును రద్దు చేస్తూ విద్యా శాఖ ఉత్త్వరులు జారీ చేసిందని, అటువంటి సంస్థకు గుంటూరులో పథకం అప్పజెప్పడం సరికాదని పేర్కొన్నారు. ఇస్కాన్‌కు అప్పగిస్తే ప్రభుత్వ లక్ష్యం దెబ్బతింటుందని, ఏళ్ల తరబడి పథకాన్ని నిర్వహిస్తున్న కార్మికులు ఉపాధి కోల్పోతారని వివరించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, ఇస్కాన్‌కు అప్పగిస్తూ ప్రభుత్వం ఈ పాటికే నిర్ణయం తీసుకుందని తెలపగా, నిర్ణయాన్ని ఉపసంహరించుకునే వరకూ పోరాడతామని నాయకులు స్పష్టం చేశారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ కెయస్ లక్ష్మణరావు, యుటిఎఫ్ జిల్లా కార్యదర్శి ఎం.హనుమంతరావు, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షులు భగవాన్, సిఐటియు నగర కార్యదర్శి కె.శ్రీనివాస్, ఐద్వా జిల్లా కార్యదర్శి ఎంఆర్ దేవి కార్మికుల పోరాటానికి సంఘీభావం తెలిపారు.

No comments:
Post a Comment