గాజువాక టిడిపి ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన మద్యం పాలసీపై ఐద్వా గాజువాక, స్టీల్ డివిజన్ కమిటీలు శుక్రవారం నిరసన తెలిపాయి. వీధుల్లో ర్యాలీ చేపట్టాయి. ఈ సందర్భంగా సంఘం స్టీల్ డివిజన్ కార్యదర్శి ఎంబి సత్యవతి మాట్లాడుతూ నూతన మద్యం పాలసీ వల్ల ప్రజల జీవితాలు గుల్లబారుతాయన్నారు. చంద్రబాబు సర్కారు జనాన్ని మందుబాబులుగా మారుస్తోందని విమర్శించారు. మద్యం విచ్చలవిడి అమ్మకాల వల్ల నేరాలు పెరుగుతున్నాయన్నారు. మహిళలపై దాడులు రోజురోజుకూ పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో గాజువాక జోన్ కార్యదర్శి కె మంగవేణి, కె లక్ష్మీ ప్రసన్న, ఎం శ్రీదేవి, జి లక్ష్మి, ఎల్ రాధ, వేణు, నూకరత్నం, మంగ, జివై నాయుడు, తదితరులు పాల్గొన్నారు.Saturday, 27 June 2015
నూతన మద్యం పాలసీపై ఐద్వా నిరసన...
గాజువాక టిడిపి ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన మద్యం పాలసీపై ఐద్వా గాజువాక, స్టీల్ డివిజన్ కమిటీలు శుక్రవారం నిరసన తెలిపాయి. వీధుల్లో ర్యాలీ చేపట్టాయి. ఈ సందర్భంగా సంఘం స్టీల్ డివిజన్ కార్యదర్శి ఎంబి సత్యవతి మాట్లాడుతూ నూతన మద్యం పాలసీ వల్ల ప్రజల జీవితాలు గుల్లబారుతాయన్నారు. చంద్రబాబు సర్కారు జనాన్ని మందుబాబులుగా మారుస్తోందని విమర్శించారు. మద్యం విచ్చలవిడి అమ్మకాల వల్ల నేరాలు పెరుగుతున్నాయన్నారు. మహిళలపై దాడులు రోజురోజుకూ పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో గాజువాక జోన్ కార్యదర్శి కె మంగవేణి, కె లక్ష్మీ ప్రసన్న, ఎం శ్రీదేవి, జి లక్ష్మి, ఎల్ రాధ, వేణు, నూకరత్నం, మంగ, జివై నాయుడు, తదితరులు పాల్గొన్నారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment