Monday, 22 June 2015

కార్మిక హక్కుల రక్షణకు సిఐటియును గెలిపించండి...

- జిల్లా ఉపాధ్యక్షులు తమ్మినేని సూర్యనారాయణ
- ఎన్నికల కార్యాలయం ప్రారంభం
అరుణా జ్యూట్‌మిల్లులో ఈనెల 27న జరుగనున్న గుర్తింపు సంఘం ఎన్నికల్లో కార్మిక హక్కుల రక్షణకోసం పోరాడే సిఐటియును గెలిపించాలని ఆ సంఘం జిల్లా ఉపాధ్యక్షులు తమ్మినేని సూర్యనారాయణ పిలుపునిచ్చారు. శనివారం అరుణా జ్యూట్‌మిల్లు ఆవరణలో ఎన్నికల కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సిఐటియు నిత్యం కార్మికులు హక్కులు, సంక్షేమం కోసం పని చేస్తోందన్నారు. ప్రభుత్వాలు, పరిశ్రమ యాజమాన్యాలు కార్మికుల హక్కులను కాలరాస్తుంటే వాటిని కాపాడుకునేందుకు సిఐటియు అంకిత భావంతో పని చేస్తుందన్నారు. అరుణా జ్యూట్‌మిల్లులో ఇంత వరకు గుర్తింపు సంఘంగా ఉన్న సంఘాలు కార్మికుల సమస్యలు పరిష్కరించడంలోను, హక్కులు కాపాడటంలోనూ విఫలమయ్యాయన్నారు. సమాన పనికి సమాన వేతనం, పని గంటలు కోసం రాజీలేని పోరాటాలు చేస్తున్నదని తెలిపారు. అనేక ఏళ్లుగా గుర్తింపు సంఘంగా అరుణాజ్యూట్‌మిల్లులో లేకపోయినా కార్మికులకు నష్టం జరిగే ప్రతి సారీ వారి తరుపున నిలబడి పోరాడుతున్నదన్నారు. కార్మికుల హక్కులు కాపాడాలన్నా, సమస్యలు పరిష్కారం కావాలన్నా స్టార్‌ గుర్తుపై ఓటు వేసి సిఐటియును గెలపించాలని కార్మికులకు పిలుపునిచ్చారు. అనంతరం సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి టివి రమణ మాట్లాడుతూ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాడుతున్న సిఐటియును గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు రెడ్డి శంకరరావు, జగన్మోహన రావు, జీవ అధిక సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment