- ప్రభుత్వ తీరుపై అంగన్‌వాడీల ఆగ్రహం
- ఐసిడిఎస్ కార్యాలయం ముందు ధర్నా
ఏళ్ల తరబడి కష్టపడి పనిచేస్తున్న అంగన్‌వాడీల సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న కంటితుడుపు చర్యల వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని అంగన్‌వాడీ, సిఐటియు నాయకులు స్పష్టం చేశారు. సమస్యల పరిష్కారం కోరుతూ ఎపి అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ నాయకులు జిల్లా కేంద్రంలోని ఐసిడిఎస్ పీడీ కార్యాలయం ముందు సోమవారం ధర్నా నిర్వహించారు. పెద్ద ఎత్తున కార్యకర్తల కార్యాలయం ముందు బైఠాయించారు. సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు నల్లప్ప, నగర కార్యదర్శి నాగేంద్రకుమార్, సిఐటీయు నగర కార్యదర్శి నాగరాజు మాట్లాడుతూ అంగన్‌వాడీ వర్కర్స్, హెల్పర్లకు పదవీవిరమణ సదుపాయలు కంటితుడుపు చర్యగా చేసి చేతులు దులుపుకోవాలని ప్రభుత్వం చూస్తోందన్నారు. వర్కర్లకు రూ.50వేలు, హెల్పర్లకు రూ.20వేలు ఇచ్చి వదిలించుకోవాలని చూస్తోందన్నారు. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా వర్కర్లకు రూ.రెండు లక్షలు, హెల్పర్లకు రూ.లక్ష రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. వేతనాలు పెంచుతామని హామీ ఇచ్చి నాలుగు నెలలు గడుస్తున్నా దాని గురించి అతీగతీ లేదన్నారు. కమిటీల పేరుతో కాలయాపన చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణం సమస్యలను పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని లేని పక్షంలో ఆందోళన చేపడతామని హెచ్చరించారు. అనంతరం పీడీ షెహనాజ్‌బీకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగమణి, రైతు సంఘం జిల్లా కార్యదర్శి పెద్దిరెడ్డి, సిఐటియు నాయకులు వెంకటేష్‌తో పాటు జిల్లాలోని అంగన్‌వాడీలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

No comments:
Post a Comment