అపార్ట్‌మెంట్స్ వాచ్‌మెన్‌లు అందరికీ కనీసవేతనం రూ.పదివేలు ఇవ్వాలని, వారందరికీ గుర్తింపుకార్డులు, ఎనిమిది గంటల పనివిధానాన్ని అమలుచేయాలని సిఐటియు నగర ప్రధాన కార్యదర్శి కట్లగుంట శ్రీనివాసరావు డిమాండ్‌చేశారు. గుంటూరు నగర అపార్ట్‌మెంట్ వాచ్‌మెన్ అండ్ వర్కర్స్ యూనియన్ నగర మహాసభను పాత గుంటూరులోని సిఐటియు కార్యాలయంలో సిహెచ్ నాగేశ్వరరావు అధ్యక్షతన ఆదివారం నిర్వహించారు. మహాసభలో శ్రీనివాసరావు మాట్లాడుతూ సమస్యల పరిష్కారంకోసం వాచ్‌మెన్‌లు అందరూ ఐక్యంగా ఉద్యమించాలని కోరారు. రెండేళ్లకాలంలో సంఘం, కార్మికుల సమస్యలపై వాచ్‌మెన్‌ల సంఘం నగర ప్రధానకార్యదర్శి పి.పెద్దిరాజు వివరించారు. సంఘ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సిహెచ్ నాగేశ్వరరావు, పి.చిన్నమాల్యాద్రి, కోశాధికారి ఎం.దుర్గారావు, బండి నాగేశ్వరరావు, పి.అంకాలు, ఎం.రంగారావు, ఎం.కీలాను తదితరులు పాల్గొన్నారు.Sunday, 21 June 2015
వాచ్‌మెన్‌లకు రూ.పదివేల వేతనం ఇవ్వాలి...
అపార్ట్‌మెంట్స్ వాచ్‌మెన్‌లు అందరికీ కనీసవేతనం రూ.పదివేలు ఇవ్వాలని, వారందరికీ గుర్తింపుకార్డులు, ఎనిమిది గంటల పనివిధానాన్ని అమలుచేయాలని సిఐటియు నగర ప్రధాన కార్యదర్శి కట్లగుంట శ్రీనివాసరావు డిమాండ్‌చేశారు. గుంటూరు నగర అపార్ట్‌మెంట్ వాచ్‌మెన్ అండ్ వర్కర్స్ యూనియన్ నగర మహాసభను పాత గుంటూరులోని సిఐటియు కార్యాలయంలో సిహెచ్ నాగేశ్వరరావు అధ్యక్షతన ఆదివారం నిర్వహించారు. మహాసభలో శ్రీనివాసరావు మాట్లాడుతూ సమస్యల పరిష్కారంకోసం వాచ్‌మెన్‌లు అందరూ ఐక్యంగా ఉద్యమించాలని కోరారు. రెండేళ్లకాలంలో సంఘం, కార్మికుల సమస్యలపై వాచ్‌మెన్‌ల సంఘం నగర ప్రధానకార్యదర్శి పి.పెద్దిరాజు వివరించారు. సంఘ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సిహెచ్ నాగేశ్వరరావు, పి.చిన్నమాల్యాద్రి, కోశాధికారి ఎం.దుర్గారావు, బండి నాగేశ్వరరావు, పి.అంకాలు, ఎం.రంగారావు, ఎం.కీలాను తదితరులు పాల్గొన్నారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment