- కాదంటే రాష్ట్ర వ్యాప్త సమ్మె
- మున్సిపల్ కార్మికుల ఐక్య కార్యాచరణ కమిటీ హెచ్చరిక
పదో వేతన సవరణ సంఘం సిఫార్సు ప్రకారం మున్సిపల్ కార్మికులకు కనీస వేతనం రూ.15,432లు చెల్లించాలని మున్సిపల్ కార్మికుల ఐక్య కార్యాచరణ కమిటీ డిమాండ్ చేసింది. బుధవారం స్థానిక మున్సిపల్ కార్యాలయం వద్ద ఈ నెల 26న విజయవాడలో నిర్వహించనున్న మున్సిపల్ కార్మికుల రాష్ట్ర సదస్సు వాల్‌పోస్టర్‌ను జెఎసి నాయకులు కె.శ్రీనివాస్, ఎన్.బలరాం, ఎన్.రాజారావు, జె.గురుమూర్తి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ కనీస వేతనం చెల్లించకుంటే రాష్ట్ర వ్యాప్త సమ్మెకు దిగుతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ సిబ్బందికి, కంటింజెంట్ పారిశుధ్య కార్మికులకు కనీస వేతనాలివ్వాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్టు ఉద్యోగులను, కార్మికులను క్రమబద్ధీకరించాలన్నారు. పిఎఫ్, బీమా బకాయిలను చెల్లించి, ఖాతాలను పునరుద్ధరించాలని చెప్పారు. పెరుగుతున్న పట్టణ అవసరాలకు అనుగుణంగా జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల్లోనూ సిబ్బందిని అదనంగా నియమించాలని కోరారు. మున్సిపల్ సిబ్బందికి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో ఎల్.రాంబాబు, ఎన్.వెంకటరమణ, డి.గోవిందరావు, బి.మంగరాజు, జె.రమేష్, వేణుగోపాల్, గణేష్; తదితరులు పాల్గొన్నారు.

No comments:
Post a Comment