తెలుగుదేశం ప్రభుత్వం ప్రకటించిన నూతన మద్యం విధానాన్ని నిరసిస్తూ ఈనెల 29న రాష్ట్రవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు నిర్వహించను న్నట్లు అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) రాష్ట్ర కార్యదర్శి డి.రమాదేవి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన షాపుల కేటాయింపులను నిలుపు దల చేయాలని వివరించారు. విజయవాడ గవర్నర్ పేట లోని సుందడిమాండ్ చేస్తూ నూతన మద్యం విధానంపై జారీ చేసిన జీవోలను దగ్ధం చేస్తామని వివరించారు. విజయవాడ గవర్నర్‌పేట లోని సుందరయ్య భవన్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. నూతన మద్యం విధానాన్ని ఐద్వా తీవ్రంగా ఖండిం చారు. టిడిపి వ్యవస్థాపక అధ్యక్షులు ఎన్‌టిఆర్ హయాంలో సారా సీసాలతోపాటు ప్యాకెట్లనూ అందుబాటులోకి తెచ్చి మద్యం ద్వారా వచ్చే ఆదాయాన్ని నాలుగు రెట్లు పెంచారన్నారు. తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు మద్యం ద్వారా రూ. 40 వేల కోట్ల మేర ఆదాయం వస్తున్నా చాలదన్నట్లుగా మద్యం అమ్మకాలను విచ్చలవిడి చేసేందుకు ప్రయత్నిస్తున్నారని విమ ర్శించారు. గుడి, బడి దగ్గరలో మద్యం షాపులకు అనుమతి ఇవ్వ బోమం టూనే వాస్తవ పరి స్థితుల్లో నిబంధనలు మా త్రం పట్టించుకోవడం లేదన్నారు. గతంలో 4,380 మద్యం దుకాణాలకు లైసెన్స్ ఇస్తే మహిళల తిరుగు బాటుతో 400 దుకాణాలు మూతబడ్డాయన్నారు. తాజాగా ప్రభుత్వం ప్రకటించిన విధానంలో మద్యం షాపులు, లైసెన్సులతో పనిలేకుండా కూల్ డ్రింక్ షాపుల్లో కూడా మద్యం టెట్రాప్యాక్‌లు ఉండేలా ప్ర భుత్వం ప్రయత్నిస్తోందన్నారు. నూతన మద్యం పాలసీకి వ్యతిరేకంగా ఇతర మహిళా, ప్రజా సంఘాలు, కలిసొచ్చే రాజకీయ పార్టీలనూ కలుపు కుని గ్రామగ్రామానా ఉద్యమిస్తామని చెప్పారు. సమా వేశంలో ఐద్వా నాయకులు కె.శ్రీదేవి, పి.విజయ, కె.సరోజ పాల్గొన్నారు.
No comments:
Post a Comment