జీతాలపెంపు, రెగ్యురైజేషన్ కోసం రాష్ట్రంలోని కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్, కంటింజెంట్ ఉద్యోగులు పోరాటాలకు సిద్ధంకావాలని సిఐటియు రాష్ట్ర కోశాధికారి ఎవి నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. స్థానిక సిఐటియు కార్యాలయంలో ఆదివారం షేక్ హుస్సేన్ అధ్యక్షతన ఏర్పాటుచేసిన జిల్లా మెడికల్ అండ్ హెల్త్ యూనియన్‌ల సమన్వయకమిటీ సమావేశంలో ఆయన ప్రసంగించారు. నాగేశ్వరరావు మాట్లాడుతూ ప్రభుత్వం అధికారంలోకొచ్చి ఏడాది గడిచినా కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించలేదన్నారు. కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్ కోసం చట్టాలు ఆటంకంగా ఉన్నాయని ప్రభుత్వం చెబుతోందని, తానే చేసిన చట్టం ఆటకం అయితే చట్టాన్ని సవరించి కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులందరినీ రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్‌చేశారు. నాలుగేళ్లుగా కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు రూపాయి కూడా జీతం పెంచలేదని, ధర పెరుగుదలతో ఉద్యోగులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. వేలాది పర్మినెంట్ ఉద్యోగాలు ఖాళీగావున్నా వాటిని భర్తీకి ప్రభుత్వం నేటికీ ఆలోచన చేయడంలేదని, దీంతో ప్రస్తుత ఉద్యోగులపై తీవ్రపనిభారం పెరిగిందని చెప్పారు. పోరాటాలు చేయకుంటే ఏ ఉద్యోగుల సమస్యల పరిష్కారంగురించి ప్రభుత్వం ఆలోచించటంలేదన్నారు. అంగన్‌వాడీలు, ఆర్‌టిసి కార్మికులు వారి సమస్యల పరిష్కారానికి పోరాటమార్గాన్ని ఎంచుకున్నారని, కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు కూడా అదే దారిలో పయనించాలని నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. కాంట్రాక్ట్ మేల్ హెల్త్‌అసిస్టెంట్ల రాష్ట్ర నాయకులు విజరు మాట్లాడుతూ 12ఏళ్లకుపైగా పనిచేస్తున్న ఉద్యోగులను ప్రభుత్వం తొలగించాలని చూస్తోందని, ఇది సరైందికాదన్నారు. యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి జె.శ్యామ్ మాట్లాడుతూ జిల్లాలోని వైద్య, ఆరోగ్యరంగ ఉద్యోగులందరినీ ఒకేతాటిపైకి తెచ్చేందుకు తమ యూనియన్ శక్తివంచనలేకుండా కృషిచేస్తోందన్నారు. సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి వై.నేతాజి, మెడికల్ అండ్ హెల్త్ యూనియన్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ఎస్‌కె కరిముల్లా, అర్బన్‌హెల్త్ సెంటర్స్ యూనియన్ జిల్లాఅధ్యక్షులు ఎస్.బసవదేవి, యూరోపియన్ ఎఎన్‌ఎంల యూనియన్ కన్వీనర్ కె.అన్నమ్మ, సెకెండ్ ఎఎన్‌ఎంల యూనియన్ నాయకులు పరమేశ్వరి, అంజలీదేవి, హైర్డ్ ఎఎన్‌ఎంల యూనియన్ నాయకులు కుమారి తదితతరులు ప్రసంగించారు.Monday, 29 June 2015
జీతాలపెంపు, రెగ్యులరైజేషన్‌కోసం పోరాటం : సిఐటియు
జీతాలపెంపు, రెగ్యురైజేషన్ కోసం రాష్ట్రంలోని కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్, కంటింజెంట్ ఉద్యోగులు పోరాటాలకు సిద్ధంకావాలని సిఐటియు రాష్ట్ర కోశాధికారి ఎవి నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. స్థానిక సిఐటియు కార్యాలయంలో ఆదివారం షేక్ హుస్సేన్ అధ్యక్షతన ఏర్పాటుచేసిన జిల్లా మెడికల్ అండ్ హెల్త్ యూనియన్‌ల సమన్వయకమిటీ సమావేశంలో ఆయన ప్రసంగించారు. నాగేశ్వరరావు మాట్లాడుతూ ప్రభుత్వం అధికారంలోకొచ్చి ఏడాది గడిచినా కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించలేదన్నారు. కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్ కోసం చట్టాలు ఆటంకంగా ఉన్నాయని ప్రభుత్వం చెబుతోందని, తానే చేసిన చట్టం ఆటకం అయితే చట్టాన్ని సవరించి కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులందరినీ రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్‌చేశారు. నాలుగేళ్లుగా కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు రూపాయి కూడా జీతం పెంచలేదని, ధర పెరుగుదలతో ఉద్యోగులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. వేలాది పర్మినెంట్ ఉద్యోగాలు ఖాళీగావున్నా వాటిని భర్తీకి ప్రభుత్వం నేటికీ ఆలోచన చేయడంలేదని, దీంతో ప్రస్తుత ఉద్యోగులపై తీవ్రపనిభారం పెరిగిందని చెప్పారు. పోరాటాలు చేయకుంటే ఏ ఉద్యోగుల సమస్యల పరిష్కారంగురించి ప్రభుత్వం ఆలోచించటంలేదన్నారు. అంగన్‌వాడీలు, ఆర్‌టిసి కార్మికులు వారి సమస్యల పరిష్కారానికి పోరాటమార్గాన్ని ఎంచుకున్నారని, కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు కూడా అదే దారిలో పయనించాలని నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. కాంట్రాక్ట్ మేల్ హెల్త్‌అసిస్టెంట్ల రాష్ట్ర నాయకులు విజరు మాట్లాడుతూ 12ఏళ్లకుపైగా పనిచేస్తున్న ఉద్యోగులను ప్రభుత్వం తొలగించాలని చూస్తోందని, ఇది సరైందికాదన్నారు. యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి జె.శ్యామ్ మాట్లాడుతూ జిల్లాలోని వైద్య, ఆరోగ్యరంగ ఉద్యోగులందరినీ ఒకేతాటిపైకి తెచ్చేందుకు తమ యూనియన్ శక్తివంచనలేకుండా కృషిచేస్తోందన్నారు. సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి వై.నేతాజి, మెడికల్ అండ్ హెల్త్ యూనియన్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ఎస్‌కె కరిముల్లా, అర్బన్‌హెల్త్ సెంటర్స్ యూనియన్ జిల్లాఅధ్యక్షులు ఎస్.బసవదేవి, యూరోపియన్ ఎఎన్‌ఎంల యూనియన్ కన్వీనర్ కె.అన్నమ్మ, సెకెండ్ ఎఎన్‌ఎంల యూనియన్ నాయకులు పరమేశ్వరి, అంజలీదేవి, హైర్డ్ ఎఎన్‌ఎంల యూనియన్ నాయకులు కుమారి తదితతరులు ప్రసంగించారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment