- రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు
భారతీయ రైల్వేలకు ఉరితాడుగా ఉన్న వివేక్ దేబ్‌రారు కమిటీ సిఫార్సులను కేంద్ర ప్రభుత్వం తిరస్కరించాలని రౌండ్ టేబుల్ సమావేశంలో పలువురు వక్తలు డిమాండ్ చేశారు. భారత ప్రజలకు చౌక ప్రయాణాన్ని అందిస్తూ 150 సంవత్సరాల నుండి సేవలందిస్తున్న భారతీయ రైల్వేను కుదేలు చేసేలా, ప్రయివేటు వ్యక్తుల గుప్పెట్లోకి వెళ్లేలా దేబ్‌రారు కమిటీ సిఫార్సులు ఉన్నాయన్నారు. తక్షణమే వాటిని తిరస్కరించని పక్షంలో రైల్వే రంగంలోని అన్ని కేటగిరిల ఉద్యోగులతో పాటు ప్రజలు, ప్రజాతంత్రవాదులు సంఘటిత పోరాటం చేసి భారతీయ రైల్వేను కాపాడుకోవాల్సి ఉందన్నారు. రైల్వే కాంట్రాక్ట్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ (సిఐటియు) ఆధ్వర్యంలో వివేక్ దేబ్‌రారు కమిటీ సిఫార్సులను నిరసిస్తూ గాంధీనగర్‌లోని ప్రెస్‌క్లబ్‌లో శనివారం రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు వి.ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ దేశంలో వేగంగా అమలు చేస్తున్న సరళీకరణ ఆర్థిక విధానాల్లో భాగంగానే దేవ్‌రారు సిఫార్సులు ఉన్నాయన్నారు. రైల్వేల పునర్వవ్యవస్తీకరణ కోసం ఏర్పాటు చేసిన ఈ కమిటీ భారత ప్రజలకు చౌకగా సేవలు అందిస్తుండగా వ్యవస్థ మొత్తాన్ని బడా పెట్టుబడి దారులకు కట్టబెట్టే రీతిలో సిఫార్సులు ఉన్నాయన్నారు. కేంద్ర ప్రభుత్వం కేవలం సలహా ఇచ్చేదిగానూ, రైల్వేబోర్డు కార్పేరేట్ ఆఫీస్‌గానూ, బోర్డు ఛైర్మన్ దానికి సిఇవోగానూ వ్యవహరించాలని కమిటీ సూచించిందన్నారు. ప్రత్యేక రెగ్యులేటరీ ఏర్పాటు చేసి ప్రయాణ, రవాణా ఛార్జీలు మొదలగు వాటిని పెంచాలని, ప్రైవేటు వారికి రాయితీలు ఇచ్చి ప్రొత్సహించాలని, రైలు పట్టలు, స్టేషన్లు, రూట్లు, పాసింజర్, రవాణా, పార్సిల్ తదితర సేవలను ఉత్పాదక యూనిట్‌లను ప్రయివేటు పరం చేయాలనే రైల్వే విచ్ఛిన్నకర సిఫార్సులను కమిటీ చేసిందన్నారు. రెగ్యులేటరీ బోర్డు ద్వారా ఎప్పటికప్పుడు ప్రయాణ, రవాణా ఛార్జీలను పెంచాలని, ప్రయాణికులకు అందించే మంచినీరు, ఆహార సరఫరా వంటి వాటిని పూర్తిగా ప్రవేటు పరం చేయాలని పేర్కొందని, ఇటువంటి సిఫార్సులను తిప్పికొట్టాల్సి ఉందని అన్నారు. దక్షిణ మధ్య రైల్వే మజ్దూర్ యూనియన్ జోనల్ ఉపాధ్యక్షులు జి.రాంగోపాల్ మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా రైల్వే ఉద్యోగులకు సేవలందిస్తున్న రైల్వే స్కూళ్లను, హాస్పటల్స్‌ను మూసివేసి ప్రయివేటుకు వెళ్లేలా నగదు సబ్సిడీ ఇవ్వాలని కమిటీ సూచించడం సరికాదన్నారు. రైల్వేలకు కేంద్ర ప్రభుత్వ అజమాయిషీలో ప్రస్తుతం పార్లమెంట్ బడ్జెట్ ఆమెదించే పరిస్థితిని పూర్తిగా రద్దు చేయాలని కమిటి సిఫార్సు చేసిందంటే రానున్న కాలంలో రైల్వే పూర్తిగా ప్రయివేటు రంగ సంస్థగా మారిపోతోందన్నారు. ఓబిసి ఎంప్లాయీస్ అసోసియేషన్ నాయకులు సత్యనారాయణ మాట్లాడుతూ రైల్వేలోని కార్మిక సంఘాలన్నీ ఐక్య పోరాటం చేయాలన్నారు. ఎఐటియుసి రాష్ట్ర నాయకులు రమణమూర్తి మాట్లాడుతూ రైల్వే ఉద్యోగ, కార్మికులతో పాటు ప్రజలను కలుపుకుని సంఘటితంగా పోరాటం చేయాల్సి ఉందన్నారు. టియుసిసి రాష్ట్ర కార్యదర్శి పివి సుందరరామరాజు మాట్లాడుతూ భారత ప్రజలకు ,రైల్వే ఉద్యోగ, కార్మికులకు పూర్తిగా వ్యతిరేకంగా ఉన్న వివేక్ దేబ్‌రారు సిఫార్సులను తిప్పికొట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

No comments:
Post a Comment