Sunday, 21 June 2015

ఐసిడిఎస్‌ను బలోపేతం చేయాలి....

ఐసిడిఎస్‌ను బలోపేతం చేయడం ద్వారానే అభివృద్ధి సాధ్యమని అంగన్‌వాడీ వర్కర్స్‌, ఎంప్లాయిస్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్షులు పైడిరాజు తెలిపారు. ఐసిడిఎస్‌ను బలోపేతం చేయాలని డిమాండ్‌ చేస్తూ నిర్వహిస్తున్న జీపుజాతా మండల కేంద్రానికి ఆదివారం చేరుకుంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ వ్యవస్థ బలోపేతమయ్యేందుకు లబ్ధిదారుల సహకారం ఎంతో అవసరమన్నారు. అంగన్‌వాడీ కేంద్రాలకు కనీస వసతులు కల్పించి పిల్లలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. మిగతా రాష్ట్రాలతో పోల్చితే రాష్ట్రంలో అంగన్‌వాడీలకు ఇస్తున్న వేతనాలు చాలా తక్కువగా ఉన్నాయన్నారు. కనీస వేతనాల చట్టం ప్రకారం రూ.15 వేలు జీతంతో పాటూ ప్రతి గ్రామంలోనూ పక్కాభవనాలు నిర్మించాల్సి ఉందన్నారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా అంగన్‌వాడీలకు జీతాలు పెంచాలని డిమాండ్‌ చేశారు. తొలుత వినతి అందజేశారు. తమ సమస్యలను సత్వరమే పరిష్కరించాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు లక్ష్మి, సిఐటియు డివిజన్‌ నాయకులు పురం అప్పారావు తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment