- కమిషనర్‌కు పారిశుధ్య కార్మికులు నోటీసు
నెల్లూరు తమకు కనీస వేతనం ఇవ్వకుంటే సమ్మె తప్పదని కార్పొరేషన్ పారిశుధ్య కార్మికులు హెచ్చరించారు. ఎపి మున్సిపల్ వర్కర్స్, ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యాన వారు సోమవారం స్థానిక గాంధీబొమ్మ వద్ద ప్రదర్శన నిర్వహించారు. అనంతరం నగన కమిషనర్ పివివిఎస్ మూర్తిని కలసి సమ్మె నోటిసు అందజేశారు. ఈ సందర్భంగా ఆ సంఘం జిల్లా కార్యదర్శి కె. పెంచలనరసయ్య మాట్లాడుతూ నగర పాలక సంస్థలని పారిశుధ్య కార్మికులకు కనీస వేతనం రూ. 15,432గా అమలు చేయాలన్నారు. అలాగే కార్మికులకు, పర్మినెంట్ ఉద్యోగులకు జిపిఎఫ్ అకౌంట్లు ఏర్పాటు చేయాలని, 010 పద్దు ద్వారా జీతాలు చెల్లించాలని, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని, కార్మికులకు 5లక్షల ప్రమాద బీమా కల్పించాలని, ఇళ్ల స్థలాలు కేటాయించాలని డిమాండు చేశారు. కార్మికుల సమస్యలు పరిష్కరించని పక్షంలో జూలై 1 తరువాత ఎప్పుడైనా సమ్మె చేపడ్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఆ సంఘ నగర కార్యదర్శి అల్లాడి గోపాల్ ,ఏ దేశయ్య, నాగరాజమ్మ, జి మల్లికార్జున ,అప్పారావు తదితరులు పాల్గొన్నారు.

No comments:
Post a Comment