- సిఐటియు జాతీయ కార్యదర్శి డాక్టర్ హేమలత
కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, ఉద్యోగ వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ మోడీ ప్రభుత్వానికి హెచ్చరికగా సెప్టెంబరు 2న దేశవ్యాప్తంగా జరగనున్న సార్వత్రిక సమ్మె జయప్రదం చేయాలని సిఐటియు అఖిల భారత కార్యదర్శి డాక్టర్ కె.హేమలత విజ్ఞప్తి చేశారు. ఈ సమ్మెలో రాజకీయాలు, సంఘాల అనుబంధాలకు అతీతంగా కార్మికులు, ఉద్యోగులందరూ చైతన్యవంతంగా పాల్గొనాలని అన్నారు. విశాఖనగరంలోని నండూరి ప్రసాదరావు భవనంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చీరాగానే తమ కర్కశమైన మొదటి దాడిని ప్రభుత్వాలు కార్మికవర్గంపైనే ప్రారంభించిందని అన్నారు. మోడీ పదే పదే అచ్చే దిన్ (మంచిరోజులు) తీసుకు వచ్చామని చెబుతున్నారని, వాస్తవానికి కార్మికులకు గోరేదిన్ (చెడ్డరోజులు) ప్రారంభమయ్యాయని అన్నారు. కేంద్రంలో కార్మికచట్టాలను రాజస్థాన్ తరహాలో మార్చటానికి పూనుకోవడం అమానుషమని విమర్శించారు. మోడీ అడుగుజాడల్లో రాష్ట్రంలో చంద్రబాబు కార్మిక చట్టాల మార్పునకు పూనుకుని కార్మికులపై దాడి చేయడం మరీ ఘోరమని అన్నారు. ఎక్కువమంది కార్మికులు కార్మిక చట్టాల పరిధిలోకి రాకుండా యజమానుల దయాదాక్షిణ్యాలకు కార్మికులను బలిపెట్టారని విమర్శించారు. దేశవ్యాప్తంగా కోట్ల సంఖ్యలో ఉన్న అంగన్‌వాడీ, మిడ్డేమీల్, ఆశ వంటి స్కీమ్ వర్కర్లకు ఏ విధమైన కనీస వేతనాలు, కార్మిక చట్టాలు, రిటైర్‌మెంట్ బెనిఫిట్స్, పెన్షన్ వంటి సౌకర్యాలు అమలు కావడం లేదని అన్నారు. స్కీమ్ వర్కర్లలో 90 శాతం మంది శ్రామిక మహిళలు బానిసల్లా పనిచేస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు.
గతంలో మన్మోహన్ ప్రభుత్వ కాలం నుంచి కార్మిక సంఘాలన్నీ ఐక్యంగా కార్మిక సమస్యలపై పలు ఉద్యమాలను, సమ్మెలు నిర్వహించాయని గుర్తు చేశారు. అదే పోరాట ఐక్యతను ఇప్పుడు కూడా కొనసాగిస్తామని అన్నారు. మోడీ ప్రభుత్వం కార్మిక చట్టాలకు చేయదల్సిన సవరణలను వెంటనే విరమించాలన్నారు. ఎఫ్‌డిఐను 26 నుంచి 49 శాతానికి పెంచవద్దని చెప్పినా కార్మిక సంఘాలతో సంప్రదించకుండా, పార్లమెంటుతో సంబంధం లేకుండా ఆర్డినెన్స్‌లతో ఎఫ్‌డిఐలకు తలుపులు బార్లా తెరవడం దుర్మార్గమని అన్నారు. ఈ చర్య దేశ ప్రయోజనాలను విదేశాలకు తాకట్టుపెట్టడమేనని విమర్శించారు.
కేంద్ర ప్రభుత్వం తాజాగా కార్మిక నిబంధనావళి బిల్లు 2015ను ప్రతిపాదిస్తుందని డాక్టర్ హేమలత తెలిపారు. 1926, 1947 నాటి మూడు చట్టాలను ఒకే చట్టంగా రూపొందించాలని కేంద్రం చూస్తుందని, అదే జరిగితే యజమానులకు, కార్పొరేట్ కంపెనీలకు లబ్ధి చేకూర్చటమే అవుతుందని అన్నారు. అదే సందర్భంలో ఉద్యోగులు, కార్మికులు చేస్తున్న పోరాటాలను ఉద్యమాలను అణచి వేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చూస్తున్నాయని విమర్శించారు. అందుకే అన్ని కార్మిక సంఘాలు ఏకతాటిపై వచ్చి సమ్మెకు పిలుపు ఇచ్చాయని అన్నారు. కార్మిక చట్టాలలో సవరణలను వెంటనే ఉపసంహరించుకోవాలని, యూనియన్ రిజిస్ట్రేషన్‌కు దరఖాస్తు చేసిన తర్వాత 45 రోజులకు తప్పనిసరిగా యూనియన్ రిజిస్ట్రేషన్ ఇవ్వాలని, కార్మిక చట్టాలను సక్రమంగా అమలు చేయాలని, ప్రజలందరికీ వర్తించే అధిక ధరలు అరికట్టాలని, ప్రభుత్వ రంగ పరిశ్రమల్లో పెట్టుబడులు ఉపసంహరణను ఎత్తివేయాలని డిమాండ్లతో సమ్మె చేస్తున్నామని తెలిపారు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను అనుమతించవద్దని, ఉపాధి కల్పనతో కూడిన అభివృద్ధి కావాలని, కనీస వేతనం రూ. 15 వేలు ఇవ్వాలని, కాంట్రాక్టు వ్యవస్థను రద్దుచేయాలని, అసంఘటిత రంగ కార్మికుల భద్రతకు దేశ స్థూల ఆదాయంలో 3 శాతం నిధులు కేటాయించాలని, కార్మికులకు, ఉద్యోగులకు పెన్షన్ అమలు చేయాలని, పిఎఫ్, ఇఎస్‌ఐ, బోనస్, గ్రాట్యూటీలపై ఉన్న అన్ని రకాల సీలింగులు ఎత్తివేయాలనే డిమాండ్ల సాధన కోసమే సెప్టెంబర్ 2 దేశవ్యాప్త సమ్మె ఉద్దేశమని తెలిపారు. ఈ సమావేశంలో సిఐటియు జిల్లా, నగర ప్రధాన కార్యదర్శులు ఎస్.రమేష్, ఎం.జగ్గునాయుడు పాల్గొన్నారు.
కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, ఉద్యోగ వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ మోడీ ప్రభుత్వానికి హెచ్చరికగా సెప్టెంబరు 2న దేశవ్యాప్తంగా జరగనున్న సార్వత్రిక సమ్మె జయప్రదం చేయాలని సిఐటియు అఖిల భారత కార్యదర్శి డాక్టర్ కె.హేమలత విజ్ఞప్తి చేశారు. ఈ సమ్మెలో రాజకీయాలు, సంఘాల అనుబంధాలకు అతీతంగా కార్మికులు, ఉద్యోగులందరూ చైతన్యవంతంగా పాల్గొనాలని అన్నారు. విశాఖనగరంలోని నండూరి ప్రసాదరావు భవనంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చీరాగానే తమ కర్కశమైన మొదటి దాడిని ప్రభుత్వాలు కార్మికవర్గంపైనే ప్రారంభించిందని అన్నారు. మోడీ పదే పదే అచ్చే దిన్ (మంచిరోజులు) తీసుకు వచ్చామని చెబుతున్నారని, వాస్తవానికి కార్మికులకు గోరేదిన్ (చెడ్డరోజులు) ప్రారంభమయ్యాయని అన్నారు. కేంద్రంలో కార్మికచట్టాలను రాజస్థాన్ తరహాలో మార్చటానికి పూనుకోవడం అమానుషమని విమర్శించారు. మోడీ అడుగుజాడల్లో రాష్ట్రంలో చంద్రబాబు కార్మిక చట్టాల మార్పునకు పూనుకుని కార్మికులపై దాడి చేయడం మరీ ఘోరమని అన్నారు. ఎక్కువమంది కార్మికులు కార్మిక చట్టాల పరిధిలోకి రాకుండా యజమానుల దయాదాక్షిణ్యాలకు కార్మికులను బలిపెట్టారని విమర్శించారు. దేశవ్యాప్తంగా కోట్ల సంఖ్యలో ఉన్న అంగన్‌వాడీ, మిడ్డేమీల్, ఆశ వంటి స్కీమ్ వర్కర్లకు ఏ విధమైన కనీస వేతనాలు, కార్మిక చట్టాలు, రిటైర్‌మెంట్ బెనిఫిట్స్, పెన్షన్ వంటి సౌకర్యాలు అమలు కావడం లేదని అన్నారు. స్కీమ్ వర్కర్లలో 90 శాతం మంది శ్రామిక మహిళలు బానిసల్లా పనిచేస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. గతంలో మన్మోహన్ ప్రభుత్వ కాలం నుంచి కార్మిక సంఘాలన్నీ ఐక్యంగా కార్మిక సమస్యలపై పలు ఉద్యమాలను, సమ్మెలు నిర్వహించాయని గుర్తు చేశారు. అదే పోరాట ఐక్యతను ఇప్పుడు కూడా కొనసాగిస్తామని అన్నారు. మోడీ ప్రభుత్వం కార్మిక చట్టాలకు చేయదల్సిన సవరణలను వెంటనే విరమించాలన్నారు. ఎఫ్‌డిఐను 26 నుంచి 49 శాతానికి పెంచవద్దని చెప్పినా కార్మిక సంఘాలతో సంప్రదించకుండా, పార్లమెంటుతో సంబంధం లేకుండా ఆర్డినెన్స్‌లతో ఎఫ్‌డిఐలకు తలుపులు బార్లా తెరవడం దుర్మార్గమని అన్నారు. ఈ చర్య దేశ ప్రయోజనాలను విదేశాలకు తాకట్టుపెట్టడమేనని విమర్శించారు.
కేంద్ర ప్రభుత్వం తాజాగా కార్మిక నిబంధనావళి బిల్లు 2015ను ప్రతిపాదిస్తుందని డాక్టర్ హేమలత తెలిపారు. 1926, 1947 నాటి మూడు చట్టాలను ఒకే చట్టంగా రూపొందించాలని కేంద్రం చూస్తుందని, అదే జరిగితే యజమానులకు, కార్పొరేట్ కంపెనీలకు లబ్ధి చేకూర్చటమే అవుతుందని అన్నారు. అదే సందర్భంలో ఉద్యోగులు, కార్మికులు చేస్తున్న పోరాటాలను ఉద్యమాలను అణచి వేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చూస్తున్నాయని విమర్శించారు. అందుకే అన్ని కార్మిక సంఘాలు ఏకతాటిపై వచ్చి సమ్మెకు పిలుపు ఇచ్చాయని అన్నారు. కార్మిక చట్టాలలో సవరణలను వెంటనే ఉపసంహరించుకోవాలని, యూనియన్ రిజిస్ట్రేషన్‌కు దరఖాస్తు చేసిన తర్వాత 45 రోజులకు తప్పనిసరిగా యూనియన్ రిజిస్ట్రేషన్ ఇవ్వాలని, కార్మిక చట్టాలను సక్రమంగా అమలు చేయాలని, ప్రజలందరికీ వర్తించే అధిక ధరలు అరికట్టాలని, ప్రభుత్వ రంగ పరిశ్రమల్లో పెట్టుబడులు ఉపసంహరణను ఎత్తివేయాలని డిమాండ్లతో సమ్మె చేస్తున్నామని తెలిపారు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను అనుమతించవద్దని, ఉపాధి కల్పనతో కూడిన అభివృద్ధి కావాలని, కనీస వేతనం రూ. 15 వేలు ఇవ్వాలని, కాంట్రాక్టు వ్యవస్థను రద్దుచేయాలని, అసంఘటిత రంగ కార్మికుల భద్రతకు దేశ స్థూల ఆదాయంలో 3 శాతం నిధులు కేటాయించాలని, కార్మికులకు, ఉద్యోగులకు పెన్షన్ అమలు చేయాలని, పిఎఫ్, ఇఎస్‌ఐ, బోనస్, గ్రాట్యూటీలపై ఉన్న అన్ని రకాల సీలింగులు ఎత్తివేయాలనే డిమాండ్ల సాధన కోసమే సెప్టెంబర్ 2 దేశవ్యాప్త సమ్మె ఉద్దేశమని తెలిపారు. ఈ సమావేశంలో సిఐటియు జిల్లా, నగర ప్రధాన కార్యదర్శులు ఎస్.రమేష్, ఎం.జగ్గునాయుడు పాల్గొన్నారు.
No comments:
Post a Comment