- మున్సిపల్ కార్మికుల నోటీసులు
- రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు
వేతనాలు పెంచాలని కోరుతూ మున్సిపల్ కార్మికులు రాష్ట్రవాప్తంగా సోమవారం ఆందోళన బాట పట్టారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా మున్సిపల్ కార్మికులకు పిఆర్‌సి అమలు చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో జులై 1వ తేదీ నుంచి విధులు బహిష్కరిచి సమ్మెలో పాల్గొంటామని స్పష్టంచేశారు. తూర్పుగోదావరి జిల్లా మండపేట మున్సిపల్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. అనంతరం అధికారులకు వినతిపత్రాలు అందజేశారు. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు కార్పొరేషన్ కార్యాలయం వద్ద సిఐటియు ఆధ్వర్యాన ధర్నా నిర్వహించారు. నగరపాలక సంస్థలో గార్బేజ్ కార్మికులుగా పనిచేస్తున్న తమ సమస్యలు పరిష్కరించాలని కార్మికులు ఆందోళన చేపట్టారు. కార్పొరేషన్ కార్యాలయం ఎదుట చేపట్టిన రిలేదీక్షలు ఏడో రోజూ కొనసాగాయి. ఒంగోలు నగరపాలక సంస్ధ కార్యాలయం వద్ద మున్సిపల్ సంఘాల జేఏసి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. వచ్చే నెల ఒకటి తరువాత రాష్ట్ర వ్యాప్తింగా సమ్మె జరపాలని నిర్ణయించిన నేపధ్యంలో యూనియన్ నాయకులు ఒంగోలు నగరపాలక సంస్ధ కార్యాలయ మేనేజర్ శ్రీహరిని కలిసి సమ్మె నోటీసు అందజేశారు. తమకు కనీస వేతనం ఇవ్వాలని కోరుతూ నెల్లూరు కార్పొరేషన్ పారిశుధ్య కార్మికులు నిరసన ప్రదర్శన చేశారు. గాంధీబొమ్మ నుంచి కార్పొరేషన్ కార్యాలయం వరకూ ప్రదర్శన నిర్వహించారు. నగర కమిషనర్ పివివిఎస్ మూర్తికి సమ్మె నోటీసు ఇచ్చారు. సమస్యల పరిష్కారం కోసం మున్సిపల్ కార్మికులు కడప జిల్లా వ్యాప్తంగా నిరసన చేశారు. ర్యాలీలు నిర్వహించారు. కార్మికుల డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించని కారణంగా జులై 1 తర్వాత ఏ రోజైనా సమ్మెలోకి వెళ్తామని ఎపి రాష్ట్ర మున్సిపల్ ఉద్యోగులు, కార్మికు ఐక్య కార్యాచరణ కమిటి హెచ్చరించింది. కమిటీ తరఫురన సిఐటియు కడప నగర ప్రధాన కార్యదర్శి బి.మనోహర్ ఆధ్వర్యంలో సోమవారం నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసుకు సమ్మె నోటిసు అందజేశారు. శ్రీకాకుళం మున్సిపల్ కార్యాలయం వద్ద మున్సిపల్ కాంట్రాక్టు కార్మికులు ధర్నా చేపట్టారు. అనంతరం మున్సిపల్ కార్యాలయంనుంచి పట్టణంలోని ఏడు రోడ్ల కూడలి వరకూ ర్యాలీ నిర్వహించారు.
గుంటూరు జిల్లా సత్తెనపల్లి, నరసరావుపేట మున్సిపల్ కార్యాలయం ఎదుట కార్మికులు ధర్నా నిర్వహించారు. అనంతరం కమిషనర్‌కు వినతి పత్రం ఇచ్చారు. మున్సిపల్ కార్మిక సంఘాల నాయకులతో ప్రభుత్వం జరిపే చర్చలు సఫలం కాకపోతే జులై 1వతేదీ తర్వాత ఏరోజునుండైనా సమ్మెలోకి వెళతామని ధర్నాలో నాయకులు తెలిపారు. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయం గేటు వద్ద మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ (సిఐటియు), ఎఐటియుసి అనుబంధ సంఘం సంయుక్తంగా ధర్నా నిర్వహించాయి. వినతిపత్రాన్ని, సమ్మె నోటీసును కమిషనర్ జి వీర్యపాండ్యన్‌కు అందజేశారు. కార్యక్రమంలో రెండుయూనిన్లకు చెందిన నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు.
- రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు
వేతనాలు పెంచాలని కోరుతూ మున్సిపల్ కార్మికులు రాష్ట్రవాప్తంగా సోమవారం ఆందోళన బాట పట్టారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా మున్సిపల్ కార్మికులకు పిఆర్‌సి అమలు చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో జులై 1వ తేదీ నుంచి విధులు బహిష్కరిచి సమ్మెలో పాల్గొంటామని స్పష్టంచేశారు. తూర్పుగోదావరి జిల్లా మండపేట మున్సిపల్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. అనంతరం అధికారులకు వినతిపత్రాలు అందజేశారు. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు కార్పొరేషన్ కార్యాలయం వద్ద సిఐటియు ఆధ్వర్యాన ధర్నా నిర్వహించారు. నగరపాలక సంస్థలో గార్బేజ్ కార్మికులుగా పనిచేస్తున్న తమ సమస్యలు పరిష్కరించాలని కార్మికులు ఆందోళన చేపట్టారు. కార్పొరేషన్ కార్యాలయం ఎదుట చేపట్టిన రిలేదీక్షలు ఏడో రోజూ కొనసాగాయి. ఒంగోలు నగరపాలక సంస్ధ కార్యాలయం వద్ద మున్సిపల్ సంఘాల జేఏసి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. వచ్చే నెల ఒకటి తరువాత రాష్ట్ర వ్యాప్తింగా సమ్మె జరపాలని నిర్ణయించిన నేపధ్యంలో యూనియన్ నాయకులు ఒంగోలు నగరపాలక సంస్ధ కార్యాలయ మేనేజర్ శ్రీహరిని కలిసి సమ్మె నోటీసు అందజేశారు. తమకు కనీస వేతనం ఇవ్వాలని కోరుతూ నెల్లూరు కార్పొరేషన్ పారిశుధ్య కార్మికులు నిరసన ప్రదర్శన చేశారు. గాంధీబొమ్మ నుంచి కార్పొరేషన్ కార్యాలయం వరకూ ప్రదర్శన నిర్వహించారు. నగర కమిషనర్ పివివిఎస్ మూర్తికి సమ్మె నోటీసు ఇచ్చారు. సమస్యల పరిష్కారం కోసం మున్సిపల్ కార్మికులు కడప జిల్లా వ్యాప్తంగా నిరసన చేశారు. ర్యాలీలు నిర్వహించారు. కార్మికుల డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించని కారణంగా జులై 1 తర్వాత ఏ రోజైనా సమ్మెలోకి వెళ్తామని ఎపి రాష్ట్ర మున్సిపల్ ఉద్యోగులు, కార్మికు ఐక్య కార్యాచరణ కమిటి హెచ్చరించింది. కమిటీ తరఫురన సిఐటియు కడప నగర ప్రధాన కార్యదర్శి బి.మనోహర్ ఆధ్వర్యంలో సోమవారం నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసుకు సమ్మె నోటిసు అందజేశారు. శ్రీకాకుళం మున్సిపల్ కార్యాలయం వద్ద మున్సిపల్ కాంట్రాక్టు కార్మికులు ధర్నా చేపట్టారు. అనంతరం మున్సిపల్ కార్యాలయంనుంచి పట్టణంలోని ఏడు రోడ్ల కూడలి వరకూ ర్యాలీ నిర్వహించారు. గుంటూరు జిల్లా సత్తెనపల్లి, నరసరావుపేట మున్సిపల్ కార్యాలయం ఎదుట కార్మికులు ధర్నా నిర్వహించారు. అనంతరం కమిషనర్‌కు వినతి పత్రం ఇచ్చారు. మున్సిపల్ కార్మిక సంఘాల నాయకులతో ప్రభుత్వం జరిపే చర్చలు సఫలం కాకపోతే జులై 1వతేదీ తర్వాత ఏరోజునుండైనా సమ్మెలోకి వెళతామని ధర్నాలో నాయకులు తెలిపారు. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయం గేటు వద్ద మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ (సిఐటియు), ఎఐటియుసి అనుబంధ సంఘం సంయుక్తంగా ధర్నా నిర్వహించాయి. వినతిపత్రాన్ని, సమ్మె నోటీసును కమిషనర్ జి వీర్యపాండ్యన్‌కు అందజేశారు. కార్యక్రమంలో రెండుయూనిన్లకు చెందిన నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు.
No comments:
Post a Comment