కార్మికుల సమస్యలు పరిష్కరించాలని భెల్ ఛైర్మన్‌కు తపన్‌సేన్ లేఖ....
భెల్ విశాఖ యూనిట్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సిఐటియు ఆల్ ఇండియా ప్రధాన కార్యదర్శి తపన్‌సేన్ భెల్ ఛైర్మన్‌కు లేఖ రాశారని భెల్ గుర్తింపు యూనియన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎస్.సుధాకర్, జిటిపి ప్రకాష్ గురువారం తెలిపారు. 1992 వేతన సవరణకు సంబంధించిన సమస్య పరిష్కరించాలని, ఈ సమస్యపై గతంలో ఇచ్చిన హామీని కూడా లేఖలో గుర్తుచేశారని తెలిపారు. కార్మికులకు మెడికల్, ఫెన్షన్ స్కీము కోర్టు పరిధిలో లేని అంశాలను తక్షణమే పరిష్కరించాలని కోరినట్లు పేర్కొన్నారు.
No comments:
Post a Comment