కనీస వేతనం రూ.15,432 ఇంజినీరింగ్ కార్మికులకు స్కిల్డ్, సెమీ స్కిల్డ్ వేతనాలు పెంపు కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులరైజ్ పర్మినెంట్ ఉద్యొగులకు జి.పి.ఎఫ్ డిమాండ్లపై మున్సిపల్ జే.ఏ.సి నాయకులతో మున్సిపల్ మినిస్టర్ నారాయణ తో 29.06.2015 న చర్చలు....
పదవ వేతన సవరణ కమిటీ సిఫార్సుల అమలుకోసం రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెకు సిద్దమవుతున్న మున్సిపల్ ఉద్యోగులు, కార్మికులను రాష్ట్ర ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించింది. భాగంగా సోమవారం అన్ని పట్టణాల్లో ప్రదర్శనలు నిర్వహించి అధికారులకు సమ్మె నోటీసుల ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మున్సిపల్ ఉద్యోగులు, కార్మికుల ఐక్య కార్యాచరణ కమిటీ (జెఎసి) పిలుపునిచ్చింది. జెఎసి నేతలు ఇచ్చిన పిలుపుతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రదర్శనలకు ఎక్కడికక్కడ ఉద్యోగులు, కార్మికులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపధ్యంలో చర్చలకు రావాలని రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానించింది. సోమవారం సాయంత్రం సచివాలయంలోని పురపాలన, పట్టణాభివృద్దిశాఖ మంత్రి డాక్టర్ పి. నారాయణ ఆధ్వర్యంలో ఈ చర్చలు జరగనున్నాయి. చర్చల్లో సానుకూల ఫలితం రాకపోతే జులై ఒకటవతేది తరువాత నిరవధిక సమ్మె చేపడతామని జెఎసి ప్రకటించింది. పదవ వేతన సవరణ కమిటీ సిఫార్సుల అమలుతో పాటు వివిధ ఇతర సమస్యల పరిష్కారం రాష్ట్ర వ్యాప్తంగా కొంతకాలంగా సిఐటియు నేతృత్వంలో పలు పట్టణాల్లో పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్న సంగతి తెలిసిందే. పలు కార్మిక సంఘాలు కూడా ఇదే డిమాండ్‌తో నిరసనలు ఆందోళనలు కొనసాగించాయి. అన్ని కార్మిక సంఘాలు ఆందోళన బాట పట్టినా ప్రభుత్వం నుండి స్పందన శూన్యం. దీంతో అన్ని కార్మిక సంఘాలు ఐక్యకార్యాచరణ కమిటీగా ఏర్పాటయ్యా యి.'మున్సిపల్' ఆందోళనల్లో ఇదో కీలక పరిణామ ం. జెఎసిగా ఏర్పాటైన కార్మిక సంఘాలు ఈ నెల 18 వ తేదిన రాష్ట్ర ప్రభుత్వానికి సమ్మెనోటీసు ఇచ్చాయి. జులై ఒకటిలోపు పరిష్కరించకపోతే ఆ తరువాత నిరవధిక సమ్మెకు దిగుతామని ఈ నోటీసులో హెచ్చరించాయి. అయినా ప్రభుత్వంలో స్పందన లేకపోవడంతో ఈ నెల 26న విజయవాడలో రాష్ట్ర సదస్సు నిర్వహించి భవిష్యత్ కార్యాచరణకు ప్రణాళికను జెఎసి సిద్దం చేసింది. కార్మికసంఘాలన్నీ ఏకతాటిపై కదులుతుండట ంతో స్పందించక తప్పనిస్థితి రాష్ట్ర ప్రభుత్వానికి ఏర్పడింది. ఈ నేపధ్యంలో సోమవారం జరగ నున్న చర్చలు ఎటువంటి ఫలితానిస్తాయన్న ది ఆసక్తి కరంగా మారింది. వేతన సంఘం సిఫార్సుల అమలుతో పాటు, ఇంజినీరింగ్ కార్మికులకు స్కిల్డ్, సెమి స్కిల్డ్ జీతాలు చెల్లించా లని, ఎన్‌ఎంఆర్, కాంట్రాకు, అవుట్ సోర్సింగ్ కార్మికుల రెగ్యులరైజేషన్, పర్మినెంటు ఉద్యోగులకు జిపిఎఫ్ ఖాతాలు, హెల్త్‌కార్డులు, 010 పద్దు ద్వారా జీతాల చెల్లింపు, స్కూల్ స్వీపర్స్ ఇతర పార్ట్‌టైమ్ ఉద్యోగులకు కనీస వేతనాలు చెల్లించాలని కార్మిక సంఘాలు కోరుతున్నాయి.
No comments:
Post a Comment