విజయనగరంలో మద్యాన్ని విచ్చలవిడిగా అమ్మించే నూతన మద్యం పాలసీని వెంటనే రద్దు చేయాలని ఐద్వా జిల్లా అధ్యక్షులు రెడ్డిశ్రీదేవి డిమాండ్ చేశారు. టిడిపి ప్రభుత్వం ప్రకటించిన నూతన ఎక్సైజ్ పాలసీని వ్యతిరేకిస్తూ ఐద్వా ఆధ్వర్యంలో పార్వతీపురం, విజయనగరం పట్టణాల్లో జీవో కాపీలను దహనం చేశారు. పార్వతీపురంలోని బెలగాం చర్చివీధి జంక్షన్ వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో ఐద్వా జిల్లా అధ్యక్షులు రెడ్డి శ్రీదేవి మాట్లాడుతూ రాష్ట్రాన్ని మద్యాంధ్రప్రదేశంగా మార్చేలా మద్యంపాలసీ ఉందని విమర్శించారు. మద్యం ద్వారా వచ్చే ఆదాయమే ప్రధాన ఆదాయంగా తెలుగుదేశం ప్రభుత్వం చూస్తుందని, ఇది సిగ్గుచేటని అన్నారు. షాపింగ్ మాల్స్‌లో కూడా మద్యం దొరికే విధంగా ఈ పాలసీలో పేర్కొనడం దుర్మార్గమన్నారు. దీనివల్ల మహిళలపై దాడులు పెరుగుతాయన్నారు. కావున నూతన ఎక్సైజ్ పాలసీని రద్దుచేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఐద్వా నాయకులు వాడాడ సత్యమ్మ, బోడమ్మ, కొమ్ము గౌరి, దొగ్గ సత్తమ్మ తదితరులు పాల్గొన్నారు. ఆందోళనకు ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు సిహెచ్ ముఖేష్ మద్దతు తెలిపారు. గాంధీ విగ్రహం వద్ద నిరసన
మద్యం పాలసీని నిరసిస్తూ విజయనగరం పట్టణంలోని కన్యకాపరమేశ్వరి ఆలయం వద్ద గల గాంధీ విగ్రహం వద్ద ఐద్వా ఆధ్వర్యాన మహిళలు నిరసన తెలిపారు. జీవో కాపీలను దహనం చేశారు. ఈ సందర్భంగా ఐద్వా ఉపాధ్యక్షులు పి.రమణమ్మ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆదాయం పెంచుకునేందుకు మద్యాన్ని విచ్చలవిడిగా అమ్మాలని ప్రభుత్వమే షాపులను ఏర్పాటు చేయడం దారుణమని అన్నారు. ఇప్పటికే మద్యం బారినపడి అనేక కుటుంబాలు వీధిన పడ్డాయన్నారు. మద్యం ప్రభావంవల్ల యువత అనేక పెడధోరణులు పడుతున్నారన్నారు. ఎన్నో కుటుంబాలను రోడ్డుపాలు చేసి, మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలకు కారణమైన మద్యం పాలసీని వెంటనే విరమించుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. లేదంటే రానున్న కాలంలో ఉద్యమాన్ని మరింత ఉదృతం చేస్తామని ఆమె హెచ్చరించారు. కార్యక్రమంలో ఐద్వా నాయకులు ఆదిలక్ష్మి పాల్గొన్నారు.

No comments:
Post a Comment