తెలుగుదేశం ప్రభుత్వం ప్రకటించిన నూతన ఎక్సైజ్ పాలసీని వ్యతిరేకిస్తూ విశాఖపట్నంలో మహిళా సంఘాలు పెద్దఎత్తున నిరసన చేపట్టాయి. సిఐటియు కార్యాలయం నుంచి మహిళలు జగదాంబ జంక్షన్ వరకు ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ తెన్నేటి జంక్షన్ దాటి ముందుకు సాగుతుండగా పోలీసులు అడ్డుకున్నారు. మద్యం వద్దు మంచినీళ్లు కావాలి, షాపింగ్ మాల్స్‌లో కూడా మద్యం అమ్మకాలు జరిపేలా చేస్తామనడం దుర్మార్గమంటూ మహిళలు పెద్దపెట్టున నినాదాలు చేశారు. చంద్రబాబు మాస్క్‌కు మద్యం పడుతున్నట్లు కొందరు మహిళలు మద్యం సీసాలను ఉంచి నిరసన తెలిపారు. మరికొందరు నూతన ఎక్సైజ్ పాలసీ జీవోలను చించివేశారు. ఈ చర్యలను పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. చంద్రబాబు మాస్క్‌ను కొందరు మహిళలు దహనం చేయగా, మరికొందరు మహిళలు మాస్క్‌లను కాళ్లతో తొక్కి నిరసన తెలిపారు. దీంతో పోలీసులు ఆగ్రహించారు. దొరికిన వారిని దొరికనట్టుగా బలవంతంగా ఈడ్చుకుంటూ వ్యాన్‌లో పడేసి టుటౌన్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అరెస్ట యిన వారిలో ఐద్వా రాష్ట్ర అధ్యక్షులు బి.ప్రభావతి, నగర అధ్యక్ష, కార్యదర్శులు బి.పద్మ, ఆర్‌ఎన్ మాధవి, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కె.ద్రాక్షాయిని, కె.నాగరాణి, ఎపి మహిళా సమాఖ్య జిల్లా కార్యదర్శి ఎ.విమల, బేగం, పిఓడబ్ల్యుకు చెందిన ఇందిర, వెంకట లకిëతోపాటు 20 మంది ఉన్నారు.Friday, 26 June 2015
మద్యంపాలసీ పై మహిళల యుద్దం...అరెస్టు చేసిన పోలీసులు..
తెలుగుదేశం ప్రభుత్వం ప్రకటించిన నూతన ఎక్సైజ్ పాలసీని వ్యతిరేకిస్తూ విశాఖపట్నంలో మహిళా సంఘాలు పెద్దఎత్తున నిరసన చేపట్టాయి. సిఐటియు కార్యాలయం నుంచి మహిళలు జగదాంబ జంక్షన్ వరకు ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ తెన్నేటి జంక్షన్ దాటి ముందుకు సాగుతుండగా పోలీసులు అడ్డుకున్నారు. మద్యం వద్దు మంచినీళ్లు కావాలి, షాపింగ్ మాల్స్‌లో కూడా మద్యం అమ్మకాలు జరిపేలా చేస్తామనడం దుర్మార్గమంటూ మహిళలు పెద్దపెట్టున నినాదాలు చేశారు. చంద్రబాబు మాస్క్‌కు మద్యం పడుతున్నట్లు కొందరు మహిళలు మద్యం సీసాలను ఉంచి నిరసన తెలిపారు. మరికొందరు నూతన ఎక్సైజ్ పాలసీ జీవోలను చించివేశారు. ఈ చర్యలను పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. చంద్రబాబు మాస్క్‌ను కొందరు మహిళలు దహనం చేయగా, మరికొందరు మహిళలు మాస్క్‌లను కాళ్లతో తొక్కి నిరసన తెలిపారు. దీంతో పోలీసులు ఆగ్రహించారు. దొరికిన వారిని దొరికనట్టుగా బలవంతంగా ఈడ్చుకుంటూ వ్యాన్‌లో పడేసి టుటౌన్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అరెస్ట యిన వారిలో ఐద్వా రాష్ట్ర అధ్యక్షులు బి.ప్రభావతి, నగర అధ్యక్ష, కార్యదర్శులు బి.పద్మ, ఆర్‌ఎన్ మాధవి, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కె.ద్రాక్షాయిని, కె.నాగరాణి, ఎపి మహిళా సమాఖ్య జిల్లా కార్యదర్శి ఎ.విమల, బేగం, పిఓడబ్ల్యుకు చెందిన ఇందిర, వెంకట లకిëతోపాటు 20 మంది ఉన్నారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment