సెప్టెంబర్ 2న జరిగే దేశ వ్యాప్త సమ్మె జయప్రదం చేయాలని సంబంధిత సిఐటియు నాయకులు ఓబుల్రాజు పిలుపునిచ్చారు. స్థానిక సిఐటియు కార్యాలయంలో డివిజన్ స్థాయి సమావేశం ఆ సంఘం పట్టణ కార్యదర్శి గిరిధర్ గుప్తా అధ్యక్షతన మంగళవారం జరిగింది. ఈ సందర్భంగా డివిజన్ నాయకులు ఓబుల్రాజు మాట్లాడుతూ 'సమ్మె సమరానికి సై' అనే నినాదంతో కార్మికులు సిద్ధం కావాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలు తిప్పికొట్టడమే ప్రధాన ధ్యేయమన్నారు. కార్మిక హక్కులకు భంగం వాటిల్లకుండా రక్షించుకోవడం ముఖ్యమన్నారు. దాంతోపాటు కార్మిక చట్టాల రక్షణతోపాటు వేతనం రూ.15 తప్పనిసరి కార్మికులకు ప్రభుత్వం అందించే వరకు ఈ సమ్మెతోపాటు పోరాటాలు ఆగవని ఆయన హెచ్చరించారు. అనంతరం స్థానిక ఐసిడిఎస్ కార్యాలయం అధికారి సిడిపిఓకు సమ్మె నోటీసు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆయనతోపాటు శ్రామిక మహిళా డివిజన్ కన్వీనర్ భువనేశ్వరి, అంగన్వాడీ అధ్యక్ష, కార్యదర్శులు వాణిశ్రీ, సరస్వతి, అరుణ, ధనలక్ష్మి, రాజేశ్వరి, అబిద, శ్యామల, సాకమ్మ, భారతి, ప్రేమావతి, యశోద, అక్తర్, సభ్యులు టి.మునిరత్నం పాల్గొన్నారు.
Wednesday, 19 August 2015
సమ్మె సమరానికి సిద్ధం కావాలి: సిఐటియు

Subscribe to:
Post Comments (Atom)

No comments:
Post a Comment