గత మార్చిలో ప్రభుత్వం చట్టాన్ని సవరించి కార్మిక సంక్షేమ నిధికి ప్రస్తుతం నెలకు రూ.2గా ఉన్న కార్మిక వాటాను నెలకు రూ.30గా నిర్ణయించింది. అలాగే యజమానులు చెల్లించే వాటాను నెలకు రూ.5 నుంచి రూ.70కి పెంచింది. ఈ మొత్తం నిధులు ప్రభుత్వం దగ్గర జమ అవుతాయి. ప్రభుత్వం ఈ నిధికి ఒక్క పైసా కూడా చెల్లించదు. కానీ ఆధిపత్యం మొత్తం ప్రభుత్వానిదే. తమిళనాడులో ఈ సంక్షేమ నిధికి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆర్థిక సహాయం చేసి పని చేయలేని పరిస్థితుల్లో ఉన్న రిటైర్డ్ కార్మికులందరికీ నెలకు రూ.1,000 పెన్షన్ చెల్లిస్తున్నది. ఈ తరహాలో అనేక వృత్తుల వారికి సహాయం చేసే పథకాలు కేరళ, బెంగాల్, తదితర రాష్ట్రాల్లో అనేకం అమలు జరుగుతున్నాయి. మన రాష్ట్రంలో మాత్రం చంద్రబాబుకు కార్మికుల జేబులు కత్తిరించడమే తప్ప వారికి సహాయం చేయాలనే ఆలోచన ఏకోశానా లేదు.
డ్రైవర్ సోదరులకి 5 లక్షల ప్రమాద భీమా ఇస్తున్నట్లు ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటున్నది . పై ఆర్టికల్ లో రాసినట్లు 5 లక్షల ప్రమాద భీమా అమలుచేయడానికి ఇన్సూరెన్స్ కంపెనీలకి కట్టవలసిన ప్రీమియం మొత్తం 11 కోట్లు మన బిల్డింగ్ కార్మికుల సంక్షేమ నిధి నుండి తిసి ఇన్సూరెన్స్ కంపెనీలకు కట్టింది..... సొమ్ము కార్మికులది .....సోకు చంద్రబాబుది......మన నిధులు కాపాడుకోవడానికి సెప్టెంబర్ 2 సమ్మె మరింత పట్టుదలతో చేద్దాం...

No comments:
Post a Comment