- న్యాయపరమైన డిమాండ్లు పరిష్కరించాల్సిందే.
- పుష్కరాల్లో వేలకోట్లు మింగేశారు
- మున్సిపల్ జాతాలో యూనియన్ నాయకులు
ఏళ్ల తరబడి గొడ్డి చాకిరి చేస్తూ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటూ అనారోగ్యాలపాలౌవుతున్నారు. న్యాయబద్ధంగా కనీస వేతనం రూ.15వేలు ఇవ్వాలి అంటూ వేడుకుంటున్నా కనికరించట్లేదు. ఏం కార్మికులు ఏమైనా గొంతెమ్మ కోర్కెలు కోరారా..? అంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును 'ఎ.పి. మునిసిపల్ వర్కర్స్, ఎంప్లాయీస్ యూనియన్ (సిఐటియు) రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు సామ్రాజ్యం, ఉమామ హేశ్వరరావు, నాయకులు శంకరరావు, వెంకట్‌రెడ్డిలు ప్రశ్నించారు. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న జాతా గురువారం గుడివాడకు చేరుకుంది. ఈ సందర్భంగా స్థానిక మునిసిపల్ కార్యాలయం వద్ద నిర్వహించిన సభలో వారు మాట్లాడారు. ప్రజానికాని ఆరోగ్యాన్ని కాపాడుతూ కార్మికులు తమ ఆరోగ్యాన్ని పాడుచేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్డులపై, డ్రైయిన్లపై మురుగును, చెత్తను చేతులతో తొలగించి సస్యామలంగా ఉంచుతున్న కార్మికులపై రాష్ట్ర ప్రభుత్వం జాలి చూపడం లేదన్నారు. 10వ పిఆర్సికి అనుగుణంగా ప్రతి ఒక్క కార్మికుడికి న్యాయ బద్ధంగా కనీస వేతనం రూ.15వేలు ఇవ్వాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేస్తామంటూ ప్రభుత్వానికి లేఖ ఇచ్చినా స్పందించలేదన్నారు. ప్రభుత్వం స్పందించకపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 45వేల మంది కార్మికులు సమ్మెలో వెళ్లడం జరిగిందన్నారు. సమ్మెను భగం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం పోలీసులతో లాఠీఛార్జీ, తెలుగు తమ్ముళ్లతో అరువు జగడాలు సృష్టించి అల్లర్లకె తెగబడిందన్నారు. వీటన్నింటిని లెక్కచేయకుంగా కార్మిక సంఘాల ఆధ్వర్యంలో సమ్మెను కొనసాగించడంతో ప్రభుత్వం వెన్నులో వణుకుపుట్టిందన్నారు. కార్మికులకు కనీస వేతనం రూ.15వేలు ఇస్తే కేవలం రూ.350కోట్లు చెల్లించినట్లేనన్నారు. ఈ రూ.350కోట్లు లేవని చెప్పే ప్రభుత్వం గోదావరి పుష్కరాలకు రూ.2 వేల కోట్లు ఖర్చు చేశామని దొంగ లెక్కలు పలికి ఆ డబ్బును ముఖ్యమంత్రి బాబు, స్థానిక నాయకులు మింగేశారని ఆరోపించారు. వచ్చే ఏడాది కృష్ణా పుష్కరాల కోసం దేశం నేతలు ఆవురావురమంటూ ఎదురు చూపులు చూస్తున్నారని పేర్కొన్నారు. మునిసిపల్ కార్మికుల న్యాయపరమైన సమస్యలను పరిష్కరించకపోతే సెప్టెంబర్ 2వ తేదీన జరిగే దేశవ్యాప్త ఉద్యమంలో ప్రభుత్వం మెడలు వంచడం ఖాయమని తేల్చిచెప్పారు. ఈ కార్యక్రమంలో డివిజన్ కార్యదర్శి ఆర్.సి.పి.రెడ్డి, పట్టణ కార్యదర్శి కైలా సుబ్బారావు, మునిసిపల్ కార్మికుల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

No comments:
Post a Comment