Wednesday, 19 August 2015

కార్మికుల హక్కులను కాలరాస్తే సహించం సిఐటియు హెచ్చరిక.....


కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బడాకంపెనీల మెప్పుకోసం కార్మిక హక్కులను కాలరాస్తే సహించబోమని సిఐటియు రాష్ట్ర అధ్యక్షురాలు పుణ్యవతి హెచ్చరించారు. బుధవారం అనంతపురం జిల్లా గుంతకల్లులో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆమె మాట్లాడారు. ప్రధానమంత్రి మోడీ బడా పారిశ్రామికవేత్తల కోసం కార్మిక చట్టాల సవరణకు శ్రీకారం చుట్టారన్నారు. చట్టాలు సవరిస్తే కార్మికులు మరింత శ్రమదోపిడీకి గురవుతారన్నారు. బడా కంపెనీలకు లక్షల కోట్ల రూపాయలు రాయితీలు ఇస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికులను బానిసలుగా చేయాలనుకోవడం దారుణమన్నారు. ఇప్పటికే అసంఘటిత రంగ కార్మికులు వెట్టిచాకిరీ చేస్తూ చాలీచాలనీ వేతనాలతో జీవితం గడుపుతున్నారన్నారు. ప్రభుత్వాల తీరును వ్యతిరేకిస్తూ వామపక్ష ట్రేడ్‌యూనియన్లతో పాటు అన్ని కార్మిక సంఘాల ఆధ్వర్యంలో సెప్టెంబరు 2న దేశవ్యాప్త సమ్మె చేపట్టనున్నట్టు తెలిపారు. ప్రజలు, కార్మికులు, ఉద్యోగులు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సిఐటియు జిల్లా ప్రధానకార్యదర్శి జి.ఓబులు, సిపిఎం డివిజన్‌ కార్యదర్శి డి.శ్రీనివాసులు, పట్టణ కార్యదర్శి శ్రీనివాసులు ఉన్నారు.

No comments:

Post a Comment