Monday, 17 August 2015

ప్రభుత్వాల కార్మిక వ్యతిరేక విధానాలపై పోరాటం...



కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆర్థిక వ్యతిరేక విధానాలకు నిరసనగా 12 డిమాండ్ల సాధనకే కేంద్ర కార్మిక సంఘాలు, ఉద్యోగ సమస్యల పిలుపు మేరకు సెప్టెంబర్‌ 2న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెతో పోరాటం చేపట్టనున్నట్లు కార్మిక సంఘాల రాష్ట్ర నాయకులు పిలుపునిచ్చారు. సోమవారం పట్టణంలోని అంబేద్కర్‌ సర్కిల్‌ వద్ద బస్సుయాత్ర చేరుకుంది. ఈ సందర్భంగా కార్మికులు పెద్దఎత్తున స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గఫూర్‌ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, కార్మికుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని చెప్పారు. ముఖ్యంగా ధరల నియంత్రణ, నెలకు కనీస వేతనం రూ.15వేలు, కార్మిక చట్టాల అమలు, చట్ట సవరణల నిలుపుదల, కాంట్రాక్ట్‌, క్యాజువల్‌ ఔట్‌ సోర్సింగ్‌ నియామకాల క్రమ బద్ధీకరణ, చిల్లర వర్తకంలో విదేశీ పెట్టుబడులను వ్యతిరేకిస్తూ తదితర డిమాండ్లతో సమ్మె నిర్వహిస్తున్నామన్నారు. ఈ సమ్మెకు పెద్దసంఖ్యలో కార్మికులు పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా నాయకులు ఓబులు, హరి, రమేష్‌, వైసిపి నాయకులు హుసేన్‌పీరా, ఆదినారాయణ రెడ్డి, ఐఎన్‌టియుసి నాయకులు రమణ, మాణిక్యం మనోహర్‌, ఎఐటియుసి నాయకులు ఓబులేశు, రాజారెడ్డి, శకుంతలమ్మ, శ్రీనివాసులు, ఎఐటి యుసి నాయకులు సుధీర్‌, ఐఎఫ్‌టియు నాయకులు ప్రసాద్‌, స్థానిక నాయకులు నాగరాజు, ఓబులేశు, బావమ్మ, ఎఐటియుసి డివిజన్‌ నాయకులు శ్రీరాములు, అంగన్‌వాడీ కార్యకర్తలు, గ్రామ పంచాయతీ కార్మికులు, ఎస్‌ఎఫ్‌ఐ విద్యార్థి సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్‌ నాయకుడు సిక్బతుల్లా మద్దతు పలికారు.

No comments:

Post a Comment