Tuesday, 18 August 2015

సంస్కరణల పేరుతో కార్మిక హక్కులు హరిస్తే సహించం

  కేంద్ర ప్రభుత్వం సంస్కరణల పేరుతో కార్మిక హక్కులను హరిస్తే సహించేదిలేదని సిఐటియు రాష్ట్ర నాయకులు మురళీ, ఎఐటియుసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఓబులేసు హెచ్చరించారు. అన్ని కార్మిక సంఘాల రాష్ట్ర నాయకుల ఆధ్వర్యంలో చేపట్టిన బస్సుయాత్ర మంగళవారం ఆళ్లగడ్డకు చేరుకుంది. ఈ బస్సుయాత్రకు కార్మికులు నాలుగు రోడ్ల కూడలిలో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ప్రభుత్వ విధానాలపై 24 ఏళ్లలో భారత శ్రామికవర్గం ఇంతవరకూ 15 సార్వత్రిక సమ్మెలను చేపట్టిందని తెలిపారు. ఈఏడాది సెప్టంబరు 2న తలపెట్టిన 16వ సార్వత్రిక సమ్మె మరో స్వాతంత్య్ర పోరాటంగా ఉంటుందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక, ప్రజావ్యతిరేక విధానాలను అవలంభిస్తున్నాయన్నారు. టియుసిసి నాయకులు సుందర రామరాజు, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పిఎస్‌ రాధాకృష్ణ, ఐఎఫ్‌టియు రాష్ట్ర అధ్యక్షులు ప్రసాద్‌, ఎఐటియుసి జిల్లా ఉప ప్రధాన కార్యదర్శి మురళీధర్‌, యుఇఇయు జిల్లా ఉపాధ్యక్షులు శ్రీనివాసులు, సిఐటియు ఆళ్లగడ్డ నాయకులు శ్రీధర్‌, వైఎస్‌ఆర్‌టియు నాయకులు రమణ, ఆటో యూనియన్‌ నాయకులు మౌలాలి, నగర పంచాయతీ పారిశుధ్య సంఘం నాయకులు రత్నం, జయరాముడు, నరసరాముడు, ఆశావర్కర్లు వరలకిë, చిన్నక్క బేగం పాల్గొన్నారు.

No comments:

Post a Comment