Tuesday, 18 August 2015

హక్కులు కాపాడేందుకే సమ్మె : గఫూర్‌

- కర్నూలు చేరిన కార్మిక సంఘాల బస్సు యాత్ర

కార్మికుల హక్కులను కాపాడుకునేందుకు సెప్టెంబర్‌ 2న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంఏ గఫూర్‌ పిలుపునిచ్చారు. సమ్మె విజయవంతానికి అనంతపురం జిల్లా హిందూపురంలో ప్రారంభమైన కార్మిక సంఘాల బస్సు యాత్ర మంగళవారం కర్నూలు జిల్లా కేంద్రా నికి చేరింది. సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పిఎస్‌ రాధాకృష్ణ, ఎఐటియుసి జిల్లా కార్యదర్శి మునెప్ప అధ్యక్షతన జరిగిన సభలో గఫూర్‌ మాట్లాడారు. కార్మికుల హక్కులు కాలరాస్తే కార్మికులు పిడికిలి బిగించి పోరాడాలన్నారు. ఎఐటియుసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఓబులేసు మాట్లాడుతూ, ఈ సమ్మె నరేంద్రమోడీకి హెచ్చరిక కావాలన్నారు. సభలో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు టి.షడ్రక్‌, కందారపు మురళి, జిల్లా కార్యదర్శి కె.ప్రభాకర్‌రెడ్డి పాల్గొన్నారు.

No comments:

Post a Comment