సెప్టెంబర్ 2న దేశ వ్యాప్త సమ్మె సందర్భంగా సిఐటియు రాష్ట్ర కమిటీి
'శ్రామిక జన శంఖారావం' ప్రచార గీతాల సిడిని శుక్రవారం ఆవిష్కరించింది.
యూనియన్ ఉపాధ్యక్షురాలు పి. రోజా, కోశాధికారి ఎవి నాగేశ్వరరావుతో కలిసి
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంఏ గఫూర్ ఈ సిడిని ఆవిష్కరించారు. అనంతరం
గఫూర్ విలేకరులతో మాట్లాడుతూ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు, రాష్ట్ర,
కేంద్ర ప్రభుత్వ విధానాలపై 10 పాటలను రూపొందించి ఈ సిడిలో ఉంచామన్నారు.
ప్రచార గీతాలతో రాష్ట్ర వ్యాప్తంగా సెప్టెంబర్ 2 సమ్మె ఆవశ్యకతను కార్మిక
వర్గంలో పెద్ద ఎత్తున ప్రచారం చేయాలని సిఐటియు నిర్ణయించిందని, అందులో
భాగంగానే ప్రజా నాట్యమండలి సహకారంతో ఈ పాటలను రూపొందించామని చెప్పారు.
సెప్టెంబర్ 17 నుంచి 25 వరకు రాష్ట్ర వ్యాప్తంగా బస్సు జాతా నిర్వహించాలని
కార్మిక సంఘాల ఐక్య వేదిక నిర్ణయించిందన్నారు. కేంద్ర ప్రభుత్వం అధికారంలో
వచ్చిన్నప్పటి నుంచీ కార్మికులపై యుద్ధం ప్రకటించిన్నట్లుగా
వ్యవహరిస్తోందని విమర్శించారు.. ఇఎస్‌ఐ, పిఎఫ్ వంటి పథకాలకు కోత పెట్టాలని
కేంద్రం ఆలోచిస్తుందని, ట్రేడ్ యూనియన్లు ఏర్పాటు చేయకుండా, సమ్మె చేసే
హక్కు లేకుండా చేసేందుకు యత్నిస్తోందని తెలిపారు. సమ్మె చేస్తే రూ.50 వేల
నుంచి రూ. 6 లక్షలు జరిమానా విధించే విధంగా చట్టం చేయాలనే దుర్మార్గపు
ఆలోచన కేంద్రం చేస్తుందన్నారు. అంగన్‌వాడీ, ఆశా, మధ్యాహ్న భోజనం, ఐకెపి
తదితరాల్లో స్కీంల వర్కర్ల చేత అతి తక్కువ వేతనాలతో పని
చేయించుకుంటోందన్నారు. దేశ వ్యాప్తంగా కార్మికులకు రూ.15వేలు కనీస వేతనం
చెల్లించాలని, స్కీం వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, అసంఘటిత
కార్మికులకు సామాజిక భద్రత కల్పించాలని, పథకాలకు అవసరమైన నిధులు
కేటాయించాలని, అందరికీ పెన్షన్ కల్పించాలని, ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటాల
ఉపసంహరణ ఆపాలి.. తదితర డిమాండ్లతో సెప్టెంబర్ 2న కేంద్ర కార్మిక సంఘాలు,
వైెఎస్‌ఆర్‌టియు తదితర ఉద్యోగ సంఘాలు నిర్వహిస్తున్న సమ్మెలో కార్మిక
వర్గం పాల్గొని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు.




No comments:
Post a Comment