- సిఐటియు డిమాండ్

కెమికల్ పరిశ్రమ యాజమాన్యం మొండివైఖరి వీడాలని సిఐటియు రాష్ట్ర కార్యదర్శి వి.ఉమామహేశ్వరరావు డిమాండ్ చేశారు. పశ్చిమగోదావరి జిల్లా కాళ్ల మండలం జక్కరం మల్లికార్జున కెమికల్స్ పరిశ్రమలో తొలగించిన కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని కోరుతూ చేపట్టిన నిరవధిక నిరాహార దీక్ష బుధవారం మూడో రోజుకు చేరింది. శిబిరాన్ని సందర్శించిన ఉమామహేశ్వ రరావు మాట్లాడుతూ.. కార్మికుల వల్లే లాభాలు ఆర్జిస్తున్న యాజమాన్యం వారిని నిర్లక్ష్యం చేయడం తగదన్నారు. అదే వైఖరి కొనసాగితే అంతకంటే గట్టి పట్టుదలతో కార్మికులు తమ హక్కులను సాధించుకుంటా రని పేర్కొన్నారు. బాధితులకు సంఘీభావం తెలిపేందుకు వచ్చిన వివిధ యూనియన్లకు చెందిన సుమారు 500మంది కార్మికులను అభినందించారు. ఈ సందర్భంగా కార్మికులకు ఆయా కార్మిక సంఘాల ఆధ్వర్యాన రూ.12 వేలు ఆర్థిక సహాయాన్ని అందజేశారు. సిఐటియు జిల్లా నాయకులు జెఎన్‌వి గోపాలన్ మాట్లాడారు.
మద్దతుగా రాస్తారోకో, నేతల అరెస్టు
దీక్షకు మద్దతుగా సిఐటియు ఆధ్వర్యాన జాతీయ రహదారిపై రాస్తారోకో చేశారు. పోలీసులు బలవంతంగా కార్మిక నేతలను ఈడ్చు కుంటూ తీసుకెళ్లి అరెస్టు చేశారు. సిఐటియు నాయకులు జెఎన్‌వి గోపాలన్, వాసు దేవరావు, ఆంజనేయులును పోలీసు లు కాళ్ల పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.

No comments:
Post a Comment