- సిఐటియు రాష్ట్ర కార్యదర్శి ఏవి. నాగేశ్వరరావు
కార్మికుల డిమాండ్‌ల సాధనకు సెప్టెంబర్ 2న జరిగే దేశవ్యాపిత సార్వత్రిక సమ్మెను జయప్రదం చేసి కార్మిక వర్గ ఐక్యతను, శక్తిని ప్రపంచానికి చాటాలని సిఐటియు రాష్ట్ర కార్యదర్శి ఏవి. నాగేశ్వరరావు అన్నారు. గురువారం బస్సు యాత్రలో కార్మిక సంఘాల నాయకులతో వచ్చిన ఆయన కావలిలో బస్సును ఆపి కార్మికునుద్దేశించి మాట్లాడారు. గత 24 ఏళ్లలో భారత శ్రామికవర్గం ఇప్పటి వరకు 15 సార్వత్రిక సమ్మెను చేపట్టి విజయం సాధించిందన్నారు. 16వ సార్వత్రిక సమ్మెను కూడా జయప్రదం చేయాలని కోరారు. కార్మికులకు ఎంతో కాలంగా పెండింగ్‌లోని సమస్యలైన ధరల నియంత్రణ, కనీస వేతనం నెలకు రు.15 వేలు, కార్మిక చట్టాల సక్రమ అమలు, చట్ట సవరణల నిలుపుదల, కాంట్రాక్టు, క్యాజువల్, ఔట్‌సోర్సింగ్ నియామకాల క్రమబద్దీకరణ, సమాన పనికి సమాన వేతనం, అందరికి పింఛన్‌ల వర్తింపు, వ్యవసాయ కూలీలతో సహా అసంఘటిత కార్మికులందరికి సాంఘిక భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ రంగ పరిశ్రమలలో పెట్టుబడుల ఉపసంహరణ రద్దు, రోడ్డు రవాణా, భద్రతా బిల్లు ఉపసంహరణ, అన్ని స్కీంల కార్మికుల క్రమబద్దీకరణ, భూసేకరణ బిల్లు రద్దు, రక్షణ, రైల్వే, ద్రవ్య, చిల్లర వర్తకాలలో విదేశీ పట్టుబడుల నిలుపుదల ప్రధాన డిమాండ్ల ఈ సార్వత్రిక సమ్మె కొనసాగుతుందన్నారు. కార్మిక హక్కులను ప్రభుత్వాలు హరిం చవచ్చుగానీ వారి పోరాట శక్తిని హరించే శక్తి ఎవరికీ లేదన్నారు. ఈ బస్సు యాత్రలో ఏఐటియుసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఓబులేసు, రాష్ట్ర కార్యదర్శి మనోహరమాణిక్యం, ఐఎఫ్‌టియు నాయకులు రామారావు, ప్రసాద్, టియుసిసి నాయకులు పివి సుందరరామ రాజులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, సిఐటియు జిల్లా నాయకులు ఎస్‌కె. రెహనాబేగం, కాకాని రామయ్య, తాళ్ళూరు మాల్యాద్రి, పఠాన్ కాలేషా, విఎంకే రావ్, జి. రవికుమార్, అంగన్‌వాడీ కార్యకర్తలు, ఏఐటియుసి నాయకులు దామా అంకయ్య, ఎన్. వెంకటేశ్వర్లు, డేగా సత్యనారాయణ, ఎం. బాలకోటయ్య, ఐఎఫ్‌టియు నాయకులు కె. భాస్కర్, మున్సిపల్ వర్కర్లు, పలు ట్రేడ్ యూనియన్‌ల కార్మికులు పాల్గొన్నారు.

No comments:
Post a Comment