- సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గఫూర్
- కార్మికచట్టసవరణను వ్యతిరేకించాలని పిలుపు
- హిందూపురంలో రాష్ట్ర బస్సుజాతా ప్రారంభం
దేశవ్యాప్తంగా సెప్టెంబర్2న చేపట్టే సార్వత్రిక సమ్మెను మరో స్వాతంత్య్ర పోరాటంలా నిర్వహించాలని సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంఏ గఫూర్ పిలుపునిచ్చారు. సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని కోరుతూ చేపట్టిన బస్సుజాతా సోమవారం అనంతపురం జిల్లా హిందూపురంలో ప్రారంభమైంది. అనంతపురం జిల్లా సిఐటియు ప్రధాన కార్యదర్శి ఓబులు, ఎఐటియుసి ప్రధాన కార్యదర్శి రాజారెడ్డి హిందూపురంలో జాతాను జెండా ఊపి ప్రారంభించారు. పెనుకొండ,
అనంతపురం, గుత్తి, గుంతకల్లు మీదుగా యాత్ర కర్నూలు జిల్లాలోకి ప్రవేశించింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో గఫూర్ మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల సమస్యలను విస్మరించాయని ధ్వజమెత్తారు. ఈ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా ఉన్న జాతీయ కార్మిక సంఘాలన్నీ ఐక్యమై సెప్టెంబర్ 2న నిర్వహించే సమ్మెను జయప్రదం చేయాలని కోరారు. 24 యేళ్లలో భారత శ్రామిక వర్గం 15 సార్లు సార్వత్రిక సమ్మేచేపట్టిందన్నారు. ఈ ఏడాది సెప్టెంబర్ 2న తలపెట్టిన 16వ సార్వత్రిక సమ్మె మరో స్వాతంత్య్ర పోరాటంగా ఉంటుందన్నారు. మొత్తం 16 డిమాండ్లతో సమ్మె తలపెట్టినట్టు తెలిపారు. ధరల నియంత్రణ, కనీసవేతనం నెలకు రూ.15వేలు, కార్మిక చట్టాల సక్రమ అమలు, చట్ట సవరణలు చేయవద్దని, తదితర డిమాండ్లు ఉన్నాయని చెప్పారు. ఎఐటియుసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఓబులేషు మాట్లాడుతూ రాష్ట్రంలోనే హిందూపురం నియోజకవర్గానికి ఒక ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు. ఇక్కడ పారిశ్రామికవాడలోని ఏ పరిశ్రమలోనూ కార్మిక చట్టాలు అమలు కావడం లేదన్నారు. స్థానిక శాసన సభ్యులు నందమూరి బాలకృష్ణ ఈ విషయాలను ముఖ్యమంత్రి దృష్టికి ఎందుకు తీసుకెళ్లడంలేదని ప్రశ్నించారు. మహిళా కార్మికులతో వెట్టిచాకిరీ చేయించుకుంటున్నారని, జిల్లాలో మహిళా మంత్రి ఉన్నప్పటికీ వీటిపై స్పందించటం లేదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు నాయకులు ఉపేంద్ర, టియుసిసి సుందర్ రామరాజు, ఐఎన్టియుసి రమణ, వైఎస్టియుసి కొర్రపాడు హుసేన్, ఎపియుడబ్ల్యుజెఎఫ్ మల్లికార్జున ప్రసాద్, వైఎస్సార్టియుసి ఆదినారాయణరెడ్డి పాల్గొన్నారు.

No comments:
Post a Comment