Tuesday, 18 August 2015

సెప్టెంబరు 2 సార్వత్రిక సమ్మె డిమాండ్- 6.......

కార్మికులందరికి రు.3000/-కు తగ్గకుండా పెన్షన్ ఇవ్వాలి. పెన్షన్ చెల్లింపు గ్యారంటీగా జరిగే విధముగా చూడాలి.
ప్రస్తుతం2004 కి ముందు రిక్రూట్ అయిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు, డి ఓ టి నుండి బి ఎస్ ఎన్ ఎల్ లో విలీనమయిన ఉద్యోగులకు ప్రభుత్వ పెన్షన్ వస్తున్నది. బిఎస్ఎన్ఎల్ లో రిక్రూట్ అయిన వారికి,అనేక ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులకు , ప్రయివేటు కంపెనీల ఉద్యోగులకు ఇపిఎఫ్ ఎవరికయితే వర్తిస్తుందో వారికి ఇపిఎఫ్ స్కిములో భాగముగా ఇపిఎస్ (ఎంప్లాయిస్ పెన్షన్ స్కీం) ప్రకారం పెన్షన్ వర్తిస్తుంది. కాని అనేక రంగాలలో ఈ ఇపిఎస్ క్రింద వచ్చె పెన్షన్ రు.1000 కన్నా చాలా తక్కువగా వుంటూ వచ్చింది. కార్మికోద్యమ పోరాటాల వలన ఈ ఇపిఎస్ స్కీం ప్రకారం వచ్చే పెన్షన్ కనీసం రు.1000 కి తగ్గకూడదని ప్రభుత్వము అంగికరించి ఆర్దర్సు ఇచ్చింది. కాని అత్యధిక సంఖ్యలో వున్నఅసంఘటిత కార్మికులకు ఈ స్కీము వర్తించదు. కేంద్ర, రాష్ట్రప్రభుత్వ ఉద్యోగులలో 1.1.2004 నుండి రిక్రూట్ అయిన వారికి ప్రభుత్వము పెన్షన్ చెల్లించదు. వారికి నూతన పెన్షన్ విధానం అమలులోకి తెచ్చారు. దదీని ప్రకారం వారు ప్రతినెలా తమ జీతం నుండి 10 శాతం పెన్షన్ కంట్రిబ్యుషన్ చెల్లించాలి. ప్రభుత్వము కుడా 10 శాతం చెల్లిస్తుంది. ఈ మొత్తాన్ని ఉద్యోగి ఎంపిక చేసుకున్న ఒక పెన్షన్ ఫండ్ కంపెనీకి జమ చేస్తారు. రిటైర్ అయిన తరువాత ఆ ఉద్యోగికి పెన్షన్ ఎంత వస్తుంది, అసలు వస్తుందా రాదా అనేది ఆ పెన్షన్ ఫండ్ కంపెని లాభ నష్టాల ప్రకారం వుంటుంది. ప్రభుత్వ పెన్షన్ పొందుతున్న వారిని కుడా ఈ నూతన పెన్షన్ విధానం లోకి ఎప్పుడు కావాలని అనుకుంటే అప్పుడు తరలించి ప్రభుత్వము తన బాధ్యతను వదిలించుకునేందుకు వీలుగా నూతన పెన్షన్ చట్టం (పెన్షన్ ఫండ్ రేగ్యులేతరి & డెవలప్మెంట్ అథారిటి చట్టం) ను పార్లమెంటులో కాంగ్రెస్, బి జె పి లు కలిసి ఆమోదించాయి. ఈ విధముగా ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన్ కు ముప్పు తేబడింది.
బిఎస్ఎన్ఎల్ రిక్రుటిస్ కు డిపిఇ గైడ్ లైన్స్ ప్రకారం వారి బేసిక్ పె లో 30 శాతం మేరకు రిటైర్మెంట్ బెనిఫిట్సు కు మేనేజిమెంటు ఖర్చు చేయాలి. కాని మేనేజిమెంటు ఇప్పటివరకు 18 శాతమే ఖర్చు చేస్తున్నది. మిగతా 12 శాతాన్ని మేనేజిమెంటు ఎల్ఐసి కి జమ చేసి దానిద్వారా వారికి ఒక పెన్షన్ స్కిమును ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నాము. కాని మేనేజిమెంటు ఆర్ధిక పరిస్థితి బాగు లేదనే పేరుతొ 12 శాతం కాదు, 3శాతమే ఇస్తానంటున్నది.
2013 సెప్టెంబరులో పార్లమెంటరి కమిటి చేసిన సిఫార్సు ప్రకారం ఇపిఎస్ స్కీము క్రింద ఇచ్చే కనీస పెన్షన్ ను రు. 3000 కు పెంచాలని,ఇందుకు ఇపిఎస్ స్కిముకు ప్రభుత్వ కంట్రిబ్యుషన్ నుబేసిక్ పె లో 1.16 శాతం నుండి 8.33 శాతం కు పెంచాలని2013 సెప్టెంబరులో పార్లమెంటరి కమిటి చేసిన సిఫార్సు చేసింది. కాని యుపిఎ ప్రభుత్వము ఇందుకు అంగీకరించలేదు. ఇది అన్యాయమని,తాము ఈ కనీస పెన్షన్ రు.3000 వుండాలని కోరుతున్నామని బిజెపి ఎన్నికలకి ముందు అన్నది. కాని ఎన్నికలలో గెలిచి అధికారం లోకి వచ్చిన తరువాతరు.3000 కనీస పెన్షన్ అమలు సాధ్యం కాదంటున్నది.ప్రభుత్వోద్యోగుల పెన్షన్ కు ప్రమాదం తెస్తున్న నూతన పెన్షన్ విధానాన్ని రద్దు చేసే బదులు మరింత పట్టుదలగా అమలు చేస్తున్నది. ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులందరికీ డిపిఇ గైడ్ లైన్స్ ప్రకారం అమలు చేయాల్సిన 30 శాతం రిటైర్మెంట్ బెనిఫిట్సు అమలుకు నిరాకరిస్తున్నది.
కార్మికులందరికీ గ్యారంటి పెన్షన్ విధానం వుండాలని, సంఘటిత అసంఘటిత కార్మికులందరికీ అది వర్తించాలని, ఇపిఎస్ కాని మరి ఏ ఇతర పథకం ప్రకారం కాని ఇచ్చే పెన్షన్ కనీసం రు.3000కు తగ్గకుండా వుండాలని, 1.1.2004 తరువాత రిక్రూట్ అయినప్రభుత్వ ఉద్యోగులకు నూతన పెన్షన్ విధానం రద్దు చేసి వారికి కూడా ప్రభుత్వ పెన్షన్ విధానం వర్తింపజేయాలని, తద్వారా ప్రభుత్వ పెన్షన్ విధానానికి గ్యారంటి ఇవ్వాలని, బిఎస్ఎన్ఎల్ మరియు ఇతర ప్రభుత్వ రంగ సంస్థల్లో రిక్రూట్ అయిన వారికి డిపిఇ గైడ్ లైన్స్ ప్రకారం 30 శాతం రిటైర్మెంట్ బెనిఫిట్సు వర్తింపజేసే విధముగా పెన్షన్ విధానం రూపొందించాలని కార్మిక సంఘాలు కోరుతున్నాయి.

No comments:

Post a Comment