మున్సిపల్ కార్మికుల సమస్యలపౖౖె ప్రభుత్వ నిర్లక్ష్యం తగదని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు దడాల సుబ్బారావు పేర్కొన్నారు. బుధవారం కాకినాడలోని మున్సిపల్ కార్యాలయం వద్ద కార్మికుల జాతాను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం వేల కోట్ల రూపాయలను పుష్కరాల పేరుతో వృథా చేసిందన్నారు. మున్సిపల్ కార్మికులకు కనీస వేతనాలిచ్చేందుకు వెనకాడడం సరికాదన్నారు. మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ కాంట్రాక్టు వర్కర్లను రెగ్యులర్ చేయాలని కోరారు. పదో పిఆర్‌సి ప్రకారం జీతాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. తొలుత సిఐటియు పతాకాన్ని యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు కె.సామ్రాజ్యం ఆవిష్కరించారు.Wednesday, 5 August 2015
'మున్సిపల్' సమస్యలపై నిర్లక్ష్యం తగదు
మున్సిపల్ కార్మికుల సమస్యలపౖౖె ప్రభుత్వ నిర్లక్ష్యం తగదని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు దడాల సుబ్బారావు పేర్కొన్నారు. బుధవారం కాకినాడలోని మున్సిపల్ కార్యాలయం వద్ద కార్మికుల జాతాను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం వేల కోట్ల రూపాయలను పుష్కరాల పేరుతో వృథా చేసిందన్నారు. మున్సిపల్ కార్మికులకు కనీస వేతనాలిచ్చేందుకు వెనకాడడం సరికాదన్నారు. మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ కాంట్రాక్టు వర్కర్లను రెగ్యులర్ చేయాలని కోరారు. పదో పిఆర్‌సి ప్రకారం జీతాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. తొలుత సిఐటియు పతాకాన్ని యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు కె.సామ్రాజ్యం ఆవిష్కరించారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment