Saturday, 22 August 2015

కార్మిక వ్యతిరేక చట్టాలను ఉపసంహరించుకోవాలి...

- సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు వి.ఉమామహేశ్వరరావు

 కార్మికుల చట్టాలను కుదించేందు కు మోడీ ప్రభుత్వం చేస్తున్న యత్నాలను ఉపసంహరించుకోవాలని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు వి.ఉమామహేశ్వరరావు డిమాం డ్‌ చేశారు. సెప్టెంబర్‌ 2న అన్ని కేంద్ర, కార్మిక సంఘాలు తలపెట్టిన సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని కోరుతూ అన్ని కార్మిక సంఘాలూ నిర్వహిస్తున్న బస్సుయాత్ర శనివా రం నూజివీడులో ప్రారంభమై హనుమాన్‌ జంక్షన్‌ మీదుగా పశ్చిమ గోదావరి జిల్లాకు చేరింది. ఈ జాతాకు జంక్షన్‌లో సిఐటియు కార్యకర్తలు, నాయకులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు వి.ఉమామహేశ్వరరావు మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం కార్మికులను భానిసలుగా మార్చేం దుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. కార్పొరేట్‌ కంపెనీలకు ఊడిగం చేస్తూ దశా బ్ధాల తరబడి సాధించుకున్న కార్మిక చట్టాలను మార్చి కార్మికులకు తీవ్ర అన్యాయం చేయడా నికి పూనుకుంటోందన్నారు. కార్మిక వ్యతిరేక సంస్కరణలను వేగంగా అమలు చేస్తోంద న్నారు. ఎఐటియుసి రాష్ట్ర అధ్యక్షులు చలసాని రామారావు మాట్లాడారు. కార్మిక సంఘాలు కోరుతున్న కనీసవేతనం రూ.15వేలు, సమాన పనికి సమాన వేతనం, కాంట్రాక్ట కార్మికుల రెగ్యులైజేషన్‌, కనీస పింఛన్‌ రూ.3వేలు అమలు చేయాలని కోరారు. కార్మికులు పెద్దఎత్తున పోరాటాలు సాగించకపోతే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దిగిరావన్నారు. ఈ యాత్రలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి డివి కృష్ణ, జిల్లా అధ్యక్షులు ఎన్‌సిహెచ్‌ శ్రీనివాస్‌, కార్యదర్శులు పి.కమల, ఎఐటియుసి రాష్ట్ర నాయకులు ఆర్‌.రవీంద్ర, సిహెచ్‌.రామారావు, మండల కార్యదర్శి జి.రాజు, జిల్లా నాయకులు జరబన నాగేశ్వరరావు, ఐఎఫ్‌టియు నాయకులు పోలార్‌ పాల్గొన్నారు. స్వాగతం పలికిన వారిలో సిఐటియ గన్నవరం డివిజన్‌ కార్యదర్శి పి.మహేష్‌, బాపులపాడు మండల కార్యదర్శి నల్లి ఆంజనేయులు, డివిజన్‌ నాయకులు అబ్దుల్‌బారీ, ఎఎస్‌ఎఫ్‌ జిల్లా సంయుక్త కార్యదర్శి జోజిబాబు, స్థానిక ముఠా, బిల్డింగ్‌, ప్రయివేటు ఎలక్ట్రీషియన్లు, కార్పెంటర్లు, షాపు ముఠా వర్కర్లు పాల్గొన్నారు.

No comments:

Post a Comment