- రాష్ట్రవ్యాప్తంగా నిరసనల హోరు
- సమ్మె మరింత ఉధృతం
పారిశుధ్య కార్మికులు రాష్ట్రవ్యాప్తంగా బుధవారం తలపెట్టిన మున్సిపల్ కార్యాలయాలు, నగర పంచాయతీ కార్యాలయాల ముట్టడి విజయవంతమైంది. కనీస వేతనాలు చెల్లించాలని, ఇతర సమస్యలు పరిష్కరించాలని సమ్మె చేస్తున్న మున్సిపల్ కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ కార్మికులు తమ ఆందోళనను బుధవారం నుండి మరింత ఉధృతం చేశారు. 12 రోజులుగా సమ్మెచేస్తున్నా స్పందిం చని ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ పలుచోట్ల మున్సిపల్ కమిషనర్లను దిగ్బంధించి సమస్యలపై స్పందనేదని నిలదీశారు. వివిధ రూపాల్లో నిరసనలూ వ్యక్తం చేశారు.
మున్సిపల్ కార్మికుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ శ్రీకాకుళం జిల్లాలో మున్సిపాల్టీలు, నగర పంచాయతీ కార్యాలయాలను ముట్టడించారు. విజయనగరంలో మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడించి మున్సిపల్ కమిషనర్ ఎంఎం నాయుడును కార్యాల యంలోకి వెళ్లనీయకుండా అడ్డుకున్నారు. దీంతో కార్మికులకూ, పోలీసులకూ మధ్య తోపులాట జరిగింది. పార్వతీపురం మున్సిపల్ కార్యాలయాన్ని కూడా కార్మికులు ముట్టడించి అధికారులను లోపలికి వెళ్లనీయకుండా అడ్డుకున్నారు.
సాలూరులో మున్సిపల్ కార్మికులు వంటావార్పు నిర్వహించారు. జివిఎంసి పరిధిలోని భీమిలిలో కార్మికులు అర్ధనగ ప్రదర్శన, మధురవాడలో పాదయాత్ర, గాజువాకలో ధర్నా నిర్వహించారు. ప్రజల మద్దతు కోరుతూ ఇంటింటికీ కరపత్రాలు పంపిణీచేశారు. అనకాపల్లిలో జివిఎంసి జోనల్ కార్యాలయాన్ని, కమిషనర్ షేక్సుభాన్ను దిగ్బంధించి సమస్యలపై నిలదీశారు. నర్సీపట్నంలో నల్లబ్యాడ్జిలతో ఆర్డీవో కార్యాలయంలో నిరసన వ్యక్తం చేశారు. తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురంలో మున్సిపల్ కార్యాలయానికి చేరుకుని చెత్తను తీసుకెళ్లే ట్రాక్టర్లను బయటకు వెళ్లనివ్వకుండా అడ్డుకున్నారు. వర్షాన్ని సైతం లెక్కచేయకుండా సుమారు మూడు గంటలపాటు ఆందోళన చేశారు. పోలీసులు వచ్చి బెదిరింపులకు పాల్పడినా కార్మికులు అక్కడి నుంచి కదలలేదు. కాకినాడ మున్సిపల్ కార్యాలయం గేట్‌కు కార్మికులు తాళాలు వేసి నిరసన తెలిపారు. వీరి సమ్మెకు సిపిఎం, సిపిఐ, వైసిపి, లోక్‌సత్తా పార్టీలు సంఘీభావం తెలిపాయి. మండపేటలో కార్మికులు మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడించారు. రెండు గంటలకుపైగా అధికారులను, సిబ్బందిని బయటకు రానీయకుండా నిర్బంధించారు. ఏలేశ్వరంలోనూ కార్మికులు అర్ధనగ ప్రదర్శన నిర్వహించారు. పశ్చిమగోదావరి జిల్లాలో మున్సిపల్ కార్యాలయాలను ముట్టడించి ఉద్యోగులను, ఇతర సిబ్బందిని విధులకు వెళ్లకుండా అడ్డుకున్నారు. పోలీసులు జోక్యం చేసుకోవడంతో పలుచోట్ల ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. ఏలూరులో మున్సిపల్ కార్మికులకు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. విజయవాడ నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద మునిసిపల్ జెఎసి ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. మునిసిపల్ మంత్రి తక్షణం రాజీనామా చేయాలని జెఎసి నాయకులు డిమాండ్ చేశారు. ఎపి మునిసిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్(సిఐటియు) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ఉమామహేశ్వరరావు, ఎపి మునిసిపల్ ఎంప్లాయీస్ యూనియన్ (ఎఐటియుసి) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎ.రంగనాయకులు, వైఎస్ఆర్సిపి ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు పి.గౌతంరెడ్డి తదితరులు పాల్గొన్నారు. కృష్ణాజిల్లాలోని అన్ని మున్సిపల్ కార్యాలయాలూ, నగర పంచాయతీలనూ కార్మికులు ముట్టడించారు. పలుచోట్ల నాయకులను అరెస్టు చేసి సొంత పూచీకతుపై విడుదల చేశారు. గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయాన్ని ముట్టడించి సిబ్బందిని లోపలికి వెళ్లకుండా అడ్డుకున్నారు. అన్ని రాజకీయ పార్టీలూ మద్దతు తెలిపాయి. జిల్లావ్యా ప్తంగా మున్సిపల్ కార్యాలయాలను కార్మికులు ముట్టడిం చారు. పలుచోట్ల పోలీసులు అరెస్టు చేశారు. తెనాలిలో కార్మికులకు ఎమ్మెల్సీ బొడ్డు నాగేశ్వరరావు మద్దతు తెలిపారు. సత్తెపల్లిలో స్పీకర్ కోడెల శివప్రసాదరావుకు కార్మికులు వినతిపత్రం ఇచ్చారు. నెల్లూరు కార్పొరేషన్ కార్యాలయాన్ని ముట్టడిని అడ్డుకునేందుకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసి కార్మికులను లోనికి పోకుండా గంటసేపు అడ్డుకున్నారు. పెద్ద సంఖ్యలో వచ్చిన పారిశుధ్య కార్మికులు గేట్లను బలవంతంగా తోసుకుని వెళ్లే ప్రయత్నంలో తోపులాటలు జరిగాయి. గేట్లు మూసేసి బైఠా యించారు. ప్రకాశం జిల్లాలోని అన్ని మున్సిపల్ కేంద్రాల్లో కార్మికులు పికెటింగ్ నిర్వహించారు. కందుకూరు మున్సిపల్ కార్యాలయం ఎదుట ఉదయం ఆరు గంటల నుండి బైఠా యించారు. చెత్తను తరలించే ఏ ఒక్క వాహనాన్నీ రోడ్డెక్క నీయలేదు. మున్సిపల్ కార్యకలాపాలను స్తంభింపజేశారు. తిరుపతిలో కార్పొరేషన్ కార్యాలయాన్ని మూసేసి అధికా రులను, సిబ్బందిని లోనికి పోనీకుండా అడ్డుకున్నారు. చిత్తూరులో నేలపై పడుకుని నిరసన తెలియజేశారు. కడప కార్పొరేషన్, మున్సిపాలిటీ కార్యాల యాలను ముట్టడిం చారు. మైదుకూరులో కార్మికులు అరగుండుతో నిరసన వ్యక్తం చేశారు. అనంతపురం జిల్లాలోని అన్ని మున్సిపాల్టీ కార్యాలయాలను వామపక్షనేతలు ముట్టడించారు. జిల్లా కేంద్రంలోని నగరపాలక కార్యాలయాన్ని ముట్టడించి నిరసన వ్యక్తం చేశారు. తొలుత పుట్టపర్తిలో రిలేదీక్ష శిబిరంలో గుండె పోటుతో మృతి చెందిన కార్మికుడు వెంకటనాయుడు మృతికి సంతాపం తెలిపారు. అనంతరం నిరసన కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు ఓబులు, సిపిఐ జిల్లా కార్యదర్శి జగదీష్, సిపిఎం నగర కార్యదర్శి నాగేంద్రకుమార్ మాట్లాడారు.

No comments:
Post a Comment