Friday, 24 July 2015

సొమ్మసిల్లిన మధు..

సీఎం డౌన్ డౌన్..పోలీసు జులుం నశించాలనే నినాదాలు..పోలీసులు బలప్రయోగం..సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు, సీపీఎం నేత బాబురావులకు తప్పిన సృహ..ఎక్కడ చూసినా సొమ్మ సిల్లిన కార్యకర్తలు..కొంతమంది కార్యకర్తలకు గాయాలు..తోటి కార్మికుల సపర్యలు..ఈ దృశ్యాలన్నీ విజయవాడ సబ్ కలెక్టర్ ఆవరణలో చోటు చేసుకున్నాయి. పోలీసులు జరిపిన బలప్రయోగాన్ని కార్మికులు తీవ్రంగా నిరసించారు.
కార్మికులు..నేతలపై బలప్రయోగం..
తమ సమస్యలు పరిష్కరించాలంటూ పారిశుధ్య కార్మికులు చేస్తున్న సమ్మెపై ప్రభుత్వ నిరంకుశ వైఖరిని నిరశిస్తూ సీపీఎం, వైసీపీ పార్టీలు సబ్ కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించాయి. భారీగా వచ్చిన కార్యకర్తలు..కార్మికులతో కలెక్టర్ కార్యాలయం అట్టుడికింది. సీఎం డౌన్..తమ సమస్యలు పరిష్కరించాలంటూ నినాదాలు చేశారు. ప్రభుత్వం స్పందించేంత వరకు తమ పోరాటం ఆపమని స్పష్టం చేశారు. దీనితో అక్కడ తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు చోటు చేసుకున్నాయి. లోనికి వెళ్లేందుకు ప్రయత్నించిన కార్యకర్తలను..కార్మికులను పోలీసులు అడ్డుకున్నారు. ఇరువర్గాల మధ్య తీవ్ర తోపులాట చోటు చేసుకుంది. పోలీసులు పిడిగుద్దులు.. బలప్రయోగం చేయడంతో సీపీఎం నేత బాబురావు, ఇతర నేతలు సొమ్మసిల్లిపడిపోయారు. వెంటనే అక్కడున్న కార్మికులు, కార్యకర్తలు సపర్యలు చేపట్టారు. చాలా మంది కోలుకోకపోవడంతో అక్కడంతా టెన్షన్ వాతావరణం చోటు చేసుకుంది.
పోలీసులు నిరంకుశంగా వ్యవహరిస్తున్నారు - మధు..
విజయవాడ పోలీసు నగర కమిషనర్ నిరంకుశంగా వ్యవహరిస్తున్నారని సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి మధు పేర్కొన్నారు. పోలీసులు అతి ద్ముర్మార్గంగా వ్యవహరిస్తున్నారని టెన్ టివితో పేర్కొన్నారు. ప్రజా ఉద్యమాలు అణిచి వేయలేరని స్పష్టం చేశారు. ప్రజా ఉద్యమాలు అణిచివేయాలంటే కార్మికులు బాబు గుండెల్లో నిద్రపోతారని వైసీపీ నేత గౌతంరెడ్డి పేర్కొన్నారు. పుష్కరాలకు పది లారీల టపాసులు కాలుస్తారా ? పేద వాడి ఆకలి గ్రహించలేని సర్కార్ అని తీవ్రంగా విమర్శించారు. వెంటనే కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. 












No comments:

Post a Comment