Saturday, 25 July 2015

ప్రభుత్వ తీరు అభ్యంతరకరమైనా అంగీకరించాం : సిఐటియు

మున్సిపల్‌ కార్మికుల పట్ల ప్రభుత్వ తీరు అభ్యంతరకరంగా ఉన్నప్పటికీ సమ్మె విరమణకు ఒప్పుకుంటున్నామని సిఐటియు రాష్ట్ర కార్యదర్శి కె.ఉమామహేశ్వరరావు తెలిపారు. పదహారు రోజుల సమ్మెను విజయవంతంగా నిర్వహించామన్నారు. కేవలం రూ.2,700 పెంపుదల సరిపోదన్నారు. 
పదో పిఆర్‌సి ఇవ్వకపోవడం వల్ల రెండేళ్లకోసారి జీతాలు పెంచాలని కోరడంతో ఒప్పుకున్నారన్నారు. ఇంజినీరింగ్‌ వర్కర్ల విషయంలో నిర్ణయం తీసుకోవాల్సి ఉందనీ, దీనిపై త్వరలోనే నిర్ణయం తీసుకోకపోతే తిరిగి సమ్మెకు సిద్ధమవుతామనీ హెచ్చరించారు. మున్సిపల్‌ కార్మికులపై ఎక్కడైనా కక్షసాధింపు చర్యలకు దిగితే రాష్ట్రవ్యాప్త ఉద్యమంగా మారుస్తామని హెచ్చరించారు.

No comments:

Post a Comment