మున్సిపల్ కార్మికుల సమ్మె ఉధృతం
- రాష్ట్రప్రభుత్వానికి శాపనార్థాలు
- రాస్తారోకోలు..అర్థనగ ప్రదర్శనల హోరు
రాష్ట్రంలో మున్సిపల్ కార్మికుల సమ్మె మరింత ఉధృతరూపం దాల్చింది. ప్రభుత్వంతో చర్చలు విఫలమవ్వడంతో రాష్ట్రవ్యాప్తంగా నిరసన జ్వాల మిన్నంటుతోంది. ఆదివారం పలు చోట్ల మంత్రి నారాయణ దిష్టిబొమ్మలను దహనం చేశారు. పర్యావరణ పరిరక్షణలో కీలక భూమిక వహించే తమను చిన్నచూపు చూస్తూ వేతనాలు పెంచకుండా మొండివైఖరి అవలంబిస్తుండటం తగదని శాపనార్థాలు పెట్టారు. విశాఖ నగరంలో మున్సిపల్ వర్కర్ల సమ్మె ఉధృతమవుతోంది. జివిఎంసి పరిధిలో దాదాపుగా పది చోట్ల నిరసన కార్యక్రమాలు జరిగాయి. మున్సిపల్ కార్మికులు మోకాళ్లపై నడుస్తూ వినూత్నంగా నిరసన తెలిపారు. అనకాపల్లి, కంచరపాలెం తదితర చోట్ల టెంట్లు కింద ధర్నాలు చేపట్టారు. తమ డిమాండ్లు పరిష్కరించే వరకూ పోరాటం ఆపే ప్రసక్తే లేదని స్పష్టంచేశారు. నర్సీపట్నం, యలమంచిలి మున్సిపాలిటీల్లోనూ, జివిఎంసి అనకాపల్లి జోనల్ పరిధిలోనూ సమ్మె కొనసాగింది. నర్సీపట్నం ఆర్‌డిఒ కార్యాలయం వద్ద ధర్నా చేశారు. గుంటూరులో ప్రదర్శన, ధర్నా చేపట్టారు. సత్తెనపల్లిలో మున్సిపల్ శాఖ మంత్రి శవయాత్ర నిర్వహించి దిషిబొమ్మను దహనం చేశారు. నరసరావుపేట, రేపల్లెలో కూడా ప్రభుత్వ దిష్బిబొమ్మలను దహనం చేశారు. ఇతర మున్సిపల్ కార్యాలయాల వద్ద ధర్నాలు కొనసాగాయి. కృష్ణాజిల్లా గుడివాడలో ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి వెంకటేశ్వర్లు, యుటిఎఫ్ నాయకులు సంఘీభావం తెలిపారు. నందిగామలో ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేసి మున్సిపల్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. తిరువూరులో వంటావార్పూ నిర్వహించారు. జగ్గయ్యపేటలో ధర్నా నిర్వహించారు. విజయవాడ సింగ్‌నగర్ కృష్ణాహోటల్ సెంటర్‌లో ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. పడమట ఎన్‌టిఆర్ సర్కిల్ వద్ద అర్ధనగ ప్రదర్శన చేసి, ఎన్‌టిఆర్ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. వన్‌టౌన్ పంజాసెంటర్ నుంచి చిట్టినగర్ సెంటర్ వరకు నిరసన ప్రదర్శన చేశారు. అనంతపురం జిల్లాలోని అన్ని మున్సిపాల్టీల పరిధిలో కార్మికులు ర్యాలీ, మానవహారం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మలను దహనం చేశారు. తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురంలో రాష్ట్రప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మున్సిపల్ కార్యాలయం వద్ద సమ్మెలో సుమారు 300 మంది పాల్గొన్నారు. ఏలూరు, తణుకు తదితర మున్సి పాలిటీల్లోనూ సమ్మె చేపట్టారు. శ్రీకాకుళం జిల్లాలో శ్రీకాకుళం, పాలకొండలో మున్సిపల్ కార్మికులు ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఇచ్ఛాపురంలో కార్మికులు ర్యాలీ నిర్వహించారు. ప్రకాశం జిల్లా ఒంగోలులోని కొత్తపట్నం బస్టాండ్ వద్ద ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేశారు. కనిగిరిలో రాస్తారోకో నిర్వహించారు. నెల్లూరులో రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేశారు. కెవిపిఎస్ ఆధ్వర్యంలో కార్మికులు కడప కార్పొరేషన్ కార్యాలయం ఎదుట మంత్రి నారాయణ దిష్టిబొమ్మను దహనం చేశారు. చిత్తూరు జిల్లా తిరుపతిలో కార్మికులు అర్ధనగ ప్రదర్శనతో నిరసన వ్యక్తం చేశారు. కర్నూలు జిల్లాలోని 8 మున్సి పాల్టీలు, కర్నూలు కార్పొరేషన్ పరిధిలో కార్మికులు చేపట్టిన సమ్మె మూడో రోజుకు చేరింది. కర్నూలు పాతబస్టాండ్ సమీపంలో మున్సిపల్ ఓపన్ ఎయిర్ థియేటర్ నుంచి తెలుగు తల్లి విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. సమస్యలు పరిష్కరించాలని నినాదాలు చేశారు.

No comments:
Post a Comment