Saturday, 18 July 2015

కార్మికులను మోసం చేస్తున్న ప్రభుత్వం: ఎంఎ గఫూర్‌..

రాష్ట్రప్రభుత్వం మున్సిపల్‌ కార్మికులను మోసం చేస్తోందని సిఐటియు ప్రధాన కార్యదర్శి ఎంఎ గఫూర్‌ విమర్శించారు. తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం ఎన్నికల్లో ఔట్‌ సోర్సింగ్‌, కాంట్రాక్ట్‌ ఉద్యోగులను రెగ్యులర్‌ చేస్తామని చెప్పిందని తెలిపారు. ఇప్పుడు మాత్రం ప్రభుత్వం తమకు సంబంధం లేదంటూ పక్కకు తప్పుకోవడం దుర్మార్గమని మండిపడ్డారు. పోలీసులతో అరెస్టులు చేయించాలని చూస్తే చంద్రబాబు చేతికి కూడా త్వరలో బేడీలు వేసే కాలం వస్తుందని హెచ్చరించారు. ఎఐటియుసి ప్రధాన కార్యదర్శి ఓబులేష్‌, సిపిఎం నాయకులు వి ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వచ్ఛాంధ్రప్రదేశ్‌ అంటున్నారని, ఆయన ఒక్కడితోనే స్వచ్ఛాంధ్రప్రదేశ్‌ సాధ్యం కాదన్నారు. మున్సిపల్‌ కార్మికులు అందరూ చీపుర్లు పట్టుకుంటునే స్వచ్ఛాంధ్రప్రదేశ్‌ సాధ్యమని స్పష్టం చేశారు. 

No comments:

Post a Comment