- సిఐటియు రాష్ట్ర కౌన్సిల్ సమావేశం తీర్మానం ...
భవన మరియు ఇతర నిర్మాణ కార్మికులకు సంక్షేమ పథకాలు అమలు చేయాలని, ఒంగోలు సుందరయ్య భవన్లో జరుగుతున్న సిఐటియు రాష్ట్ర కౌన్సిల్ సమావేశం తీర్మానించింది. సమావేశ తీర్మానాన్ని సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మీడియాకు వెల్లడించారు. రాష్ట్రంలో భవననిర్మాణ రంగంలో 26 రకాల వృత్తుల్లో సుమారు 25లక్షలమంది కార్మికులు పనిచేస్తున్నారన్నారు. వీరితో పాటు ఇటుక బట్టీలు, ఇసుక, కంకర క్వారీలు సంబందిత వృత్తులలో మరో లక్ష 50 వేలమందికి పైగా పనిచేస్తున్నట్లు తెలిపారు. కార్మికుల పోరాట ఫలితంగా 2007లో భవన మరియు ఇతర నిర్మాణ కార్మికుల వెల్పేర్బోర్డును ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు. 2009లో కార్మికుల నమోదు ప్రారంభించినప్పటి నుండి ఇప్పటి వరకు రాష్ట్రంలో వెయ్యి కోట్లు సెస్ వసూలైందన్నారు. గడిచిన ఏడు సంవత్సరాల కాలంలో సహజమరణం, ప్రమాదమరణం, అంత్యక్రియల ఖర్చులు, తాత్కాలిక, శాశ్విత అంగవైకల్యం , వివాహ కానుక, ప్రసూతి సహాయం పధకాల కొరకు కేవలం 50 కోట్లు మాత్రమే కార్మికులకు నష్టపరిహారాలు, బెనిఫిట్స్ అందించారన్నారు. వీటిలో ప్రధాన మైన పధకాలన్నీ కార్మికుడు మరణించిన తరువాత ఉపయోగపడేవి గానే ఉన్నాయి తప్ప బ్రతకటానికి ఉపయోగపడేలా లేవన్నారు. నిర్మాణ కార్మికుడికి కేంద్రచట్టంలో పెన్షన్, స్కాలర్షిప్స్, గృహానిర్మాణ రుణం, పనిముట్లు కొనుగోలకు ఆర్ధికసహాయం వంటి అనేక పధకాలున్నాయన్నారు. కానీ ఇవేవీ మన రాష్ట్రంలో అమలు చేయడంలేదన్నారు. వెల్పేర్బోర్డు నిధులను కార్మికుల సంక్షేమపధకాల కోసం కాకుండా ఇతర అవసరాలకు చట్ట విరుద్దంగా బోర్డు డబ్బును తరలించి ఖర్చు చేసుకుంటుందన్నారు. సంక్షేమబోర్డు నిధులు కార్మికుల సంక్షేమం కోసం వినియోగించాలని సిఐటియు రాష్ట్ర కౌన్సిల్ సమావేశం తీర్మానించిందన్నారు. 60 సంవత్సరాల నిండిన కార్మికునికి పెన్షన్ నెలకు రూ 2000 ఇవ్వాలని, ప్రమాద మరణానికి ఐదులక్షలు, సహజమరణానికి రెండు లక్షలు, అంత్యక్రియలకు 25వేలు, ప్రసూతి సహాయం 25వేలు, కుమార్తె వివాహ బహుమతి 50 వేలు ఇవ్వాలని సిఐటియు కౌన్సిల్ సమావేశం డిమాండ్ చేసిందన్నారు. కార్మికుడు పనిచేసినంతకాలం సంక్షేమ పధకాలు వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. కొత్త పధకాలను ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు.

No comments:
Post a Comment