Saturday, 25 July 2015
మున్సిపల్ కార్మిక సంఘాలతో ఎపి ప్రభుత్వం చర్చలు....
ఎపిలో మున్సిపల్ కార్మికుల సమ్మె విరమణ...
మున్సిపల్ కార్మిక సంఘాల జెఎసితో ఎపి మంత్రులు జరిపిన చర్చలు సఫలం అయ్యాయి. దీంతో మున్సిపల్ కార్మికులు సమ్మె విరమిస్తున్నట్లు ప్రకటించారు. రేపటి నుంచి విధులకు హాజరుకానున్నట్లు తెలిపారు. గత 16 రోజులుగా సమ్మెలో ఉన్న మున్సిపల్ కార్మికులతో రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణతో రెండు దఫాలుగా జరిపిన చర్చలల్లో కార్మిక సంఘాల జేఏసి నేతలు చర్చలో పాల్గోన్నారు. సాయంత్రం జరిగిన మలి విడత జరిగిన చర్చల్లో ప్రభుత్వం కార్మికుల డిమాండ్లను అంగీకరించింది.Friday, 24 July 2015
ఒంగోలులో కలెక్టరేట్‌ను ముట్టడించిన కార్మికులు
జిల్లాలో మున్సిపల్ కార్మికుల సమ్మె కొనసాగుతోంది. ఒంగోలులో మున్సిపల్ కార్మికులు కలెక్టరేట్‌ను ముట్టడించారు. కలెక్టరేట్ గేటు వద్ద బైఠాయించి ధర్నా చేపట్టారు. కార్మికుల ఆందోళనకు వైసీపీ, ఉద్యోగసంఘాల నేతలు మద్దతు తెలిపారు. పదిహేను రోజులుగా ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవటంపై... వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ న్యాయమైన డిమాండ్లను నెరవేర్చే వరకు...సమ్మెను విరమించేదిలేదని తేల్చిచెప్పారు.
సొమ్మసిల్లిన మధు..
సీఎం డౌన్ డౌన్..పోలీసు జులుం నశించాలనే నినాదాలు..పోలీసులు బలప్రయోగం..సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు, సీపీఎం నేత బాబురావులకు తప్పిన సృహ..ఎక్కడ చూసినా సొమ్మ సిల్లిన కార్యకర్తలు..కొంతమంది కార్యకర్తలకు గాయాలు..తోటి కార్మికుల సపర్యలు..ఈ దృశ్యాలన్నీ విజయవాడ సబ్ కలెక్టర్ ఆవరణలో చోటు చేసుకున్నాయి. పోలీసులు జరిపిన బలప్రయోగాన్ని కార్మికులు తీవ్రంగా నిరసించారు.కార్మికులు..నేతలపై బలప్రయోగం..
తమ సమస్యలు పరిష్కరించాలంటూ పారిశుధ్య కార్మికులు చేస్తున్న సమ్మెపై ప్రభుత్వ నిరంకుశ వైఖరిని నిరశిస్తూ సీపీఎం, వైసీపీ పార్టీలు సబ్ కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించాయి. భారీగా వచ్చిన కార్యకర్తలు..కార్మికులతో కలెక్టర్ కార్యాలయం అట్టుడికింది. సీఎం డౌన్..తమ సమస్యలు పరిష్కరించాలంటూ నినాదాలు చేశారు. ప్రభుత్వం స్పందించేంత వరకు తమ పోరాటం ఆపమని స్పష్టం చేశారు. దీనితో అక్కడ తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు చోటు చేసుకున్నాయి. లోనికి వెళ్లేందుకు ప్రయత్నించిన కార్యకర్తలను..కార్మికులను పోలీసులు అడ్డుకున్నారు. ఇరువర్గాల మధ్య తీవ్ర తోపులాట చోటు చేసుకుంది. పోలీసులు పిడిగుద్దులు.. బలప్రయోగం చేయడంతో సీపీఎం నేత బాబురావు, ఇతర నేతలు సొమ్మసిల్లిపడిపోయారు. వెంటనే అక్కడున్న కార్మికులు, కార్యకర్తలు సపర్యలు చేపట్టారు. చాలా మంది కోలుకోకపోవడంతో అక్కడంతా టెన్షన్ వాతావరణం చోటు చేసుకుంది.
పోలీసులు నిరంకుశంగా వ్యవహరిస్తున్నారు - మధు..
విజయవాడ పోలీసు నగర కమిషనర్ నిరంకుశంగా వ్యవహరిస్తున్నారని సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి మధు పేర్కొన్నారు. పోలీసులు అతి ద్ముర్మార్గంగా వ్యవహరిస్తున్నారని టెన్ టివితో పేర్కొన్నారు. ప్రజా ఉద్యమాలు అణిచి వేయలేరని స్పష్టం చేశారు. ప్రజా ఉద్యమాలు అణిచివేయాలంటే కార్మికులు బాబు గుండెల్లో నిద్రపోతారని వైసీపీ నేత గౌతంరెడ్డి పేర్కొన్నారు. పుష్కరాలకు పది లారీల టపాసులు కాలుస్తారా ? పేద వాడి ఆకలి గ్రహించలేని సర్కార్ అని తీవ్రంగా విమర్శించారు. వెంటనే కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.


ఏపీ సర్కార్ పై పారిశుధ్య కార్మికుల శాపనార్థాలు...
'చాలీ చాలనీ జీతాలు..ఆపై పెరుగుతున్న ధరలు..తాము అర్ధాకలితో అలమటిస్తున్నాం..కడుపులు కాలిపోతున్నాయి..పచ్చడి మెతుకులు తింటున్నాం..కనీస వేతనాలు పెంచండి..అంటే తమపై పోలీసులు ప్రతాపం చూపుతారా ? ఎందుకు చూపుతున్నారు..మా ఉసురు తాకుతుంది'' అంటూ పారిశుధ్య కార్మికులు శాపనార్థాలు పెట్టారు.సమస్యలు పరిష్కరించాలంటూ తమకు మద్దతుగా పోరాటం చేస్తున్న నాయకులను ఎందుకు కొట్టారంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గత కొన్ని రోజులుగా సమస్యలు పరిష్కరించాలంటూ పారిశుధ్య కార్మికులు సమ్మె చేస్తున్న సంగతి తెలిసిందే. కానీ ప్రభుత్వం మొండి వైఖరి అవలింబిస్తుండడంతో వామపక్షాలు, వైసీపీ విజయవాడ సబ్ కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించింది. కానీ పోలీసులు కర్కశంగా వ్యవహరించారు. గోదాట్ల ఏం చేస్తున్నారు..మా ఉసురు తాకుతుందని మండిపడ్డారు. ప్రజా స్వామ్యం అంటారు ఇదా ప్రజాస్వామ్యం అని చంద్రబాబును ఉద్ధేశించి సీపీఎం నేతలు విమర్శించారు. ప్రభుత్వం మొండి వైఖరి విడనాడే వరకు తమ పోరాటం కొనసాగుతుందని కార్మికులు, నేతలు స్పష్టం చేశారు.
Thursday, 23 July 2015
చేతికి సంకెళ్లు వేసుకుని నిరసన తెలిపిన మున్సిపల్ కార్మికులు
మున్సిపల్ కార్మికుల డిమాండ్లను పరిష్కరించాలంటూ కార్మికులు సమ్మెను ఉధృతం చేశారు. ఒంగోలులో సీఐటీయూ ఆధ్వర్యంలో కార్మికులు చేతికి సంకేళ్లు వేసుకుని ర్యాలీ నిర్వహించారు. కార్మికుల న్యాయపరమైన డిమాండ్లను పరిష్కరించకుండా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని మండిపడ్డారు. కార్మికుల సమస్యలను పరిష్కరించే వరకు ఉద్యమాన్ని విరమించేది లేదని.. ప్రభుత్వం దిగిరాకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
https://www.youtube.com/watch?v=r9Gd3X55csc
https://www.youtube.com/watch?v=r9Gd3X55csc
విజయవాడలో మున్సిపల్ కార్మికుల సమ్మె ఉధృతం...
విజయవాడ లో మున్సిపల్ కార్మికులు సమ్మెను మరింత ఉధృతం చేశారు. సింగినగర్ లోని నగరపాలక సంస్ధ డిప్యూటీ మేయర్ గోగుల రమణ ఇంటిని ముట్టడించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. మున్సిపల్ కార్మికుల ఆందోళన తీవ్రతరం చేయడంతో ఇంటి నుంచి బయటకొచ్చిన డిప్యూటీ మేయర్ సిఐటియు నాయకులతో మాట్లాడారు. మున్సిపల్ కార్మికులు చేస్తున్న సమ్మె సరైందేనని, త్వరలోనే మంత్రి నారాయణ దృష్టికి తీసుకెళ్ళి సమస్య పరిష్కారం అయ్యేలా చూస్తానని హామీ ఇచ్చారు. మరోవైపు పేదల ఓట్ల తో గద్దెనెక్కిన టిడిపి ప్రభుత్వం వాళ్ల పొట్టలే కొట్టాలని సీపీఎం నేతలు విమర్శించారు. రాజధాని పేరుతో పేదల భూములను లాక్కొని చైనాకు కట్టబెడుతున్న ప్రభుత్వం మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని, లేకుంటే పెద్ద ఎత్తున ఉద్యమ బాట పట్టి రాష్ట్రాన్ని స్తంభింపచేస్తామని హెచ్చరించారు.
Subscribe to:
Posts (Atom)








